మరో నాలుగు రోజుల్లో ఇండియాకు ఎంట్రీ ఇవ్వనున్న లెక్సస్ లగ్జరీ కార్ బ్రాండ్

Written By:

జపాన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్స్ యొక్క లగ్జరీ కార్ల విభాగం మార్చి 24, 2017 న అధికారిక విడుదలకు సిద్దం అవుతోంది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల మేరకు కొన్ని కార్లను ప్రవేశపెడుతూ దీని విడుదల ఉంటుందని సమాచారం.

లెక్సస్ అఫీషియల్ లాంచ్ వేదిక మీద ఆరఎక్స్450హెచ్ హైబ్రిడ్ ఎస్‌యూవీని తమ మొదటి ఉత్పత్తిగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మరియు దీనిని కంప్లిట్లీ బిల్ట్ యూనిట్‌గా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

లెక్సస్ లగ్జరీ కార్ల డివిజన్ ఇప్పటికే సుమారుగా 75 నుండి 80 కార్లను దిగుమతి చేసుకున్నట్లు సమాచారం. మరియు డీలర్ల మధ్య ఆసక్తిని రేకెతిస్తూనే, ఎక్కువ ఆసక్తిని చూపే కస్టమర్లకు టెస్ట్ డ్రైవ్‌ కోసం కూడా అందుబాటులో ఉంచినట్లు సమాచారం.

లెక్సస్ యొక్క మొట్టమొదటి ఎస్‌యూవీ ఆర్ఎక్స్450హెచ్ హైబ్రిడ్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఇందులో 3.5-లీటర్ల సామర్థ్యం గల వి6 పెట్రోల్ ఇంజన్ లెక్సస్ హైబ్రిడ్ డ్రైవ్‌కోసం ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ మోటార్ జోడింపుతో లభించును.

ఇందులోని శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజన్‌కు అనుసంధానం చేసిన 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా గరిష్టంగా 308బిహెచ్‌‍పి వరకు పవర్ చక్రాలకు సరఫరా అవుతుంది.

లెక్సస్ ఆర్ఎక్స్450హెచ్ హైబ్రిడ్ ఎస్‌యూవీలో ఆంబియంట్ లైటింగ్, డ్యూయల్ స్క్రీన్ రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, 12.3-అంగుళాల మల్టీ మీడియా డిస్ల్పే, మరియు స్టీరింగ్ వీల్ మీద అందించిన నియంత్రికలు కలవు.

భద్రత పరంగా ఆర్ఎక్స్‌450హెచ్‌లో 10 ఎయిర్ బ్యాగులు కలవు. ఇది ఇండియన్ మార్కెట్లోకి విడుదల అయితే దీని ధర సుమారుగా రూ. 1.17 కోట్లు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉండే అవకాశం ఉంది.

సెగ్మెంట్ పరంగా పోటీదారులైన ఆడి క్యూ5 మరియు మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి లకు గట్టి పోటీనివ్వనుంది.

టాటా టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్ ఫోటోలను వీక్షించండి...

కియా మోటార్స్‌కు చెందిన కియా పికంటో హ్యాచ్‌బ్యాక్ ఫోటోలు....

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ ఫోటోలను వీక్షించండి....

 

English summary
Toyota’s Luxury Brand Lexus India Launch Details Revealed
Please Wait while comments are loading...

Latest Photos