మోదీ వద్ద మంతనాలు జరిపిన సుజుకి మరియు టయోటా: ఎందుకో తెలుసా ?

జపాన్‌కు చెందిన రెండు దిగ్గజ కార్ల తయారీ సంస్థలు మారుతి సుజుకి మరియు టయోటా మోటార్స్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వేరు వేరుగా చర్చలు జరిపాయి. పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి...

Written By:

దేశీయంగా అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలుగా వెలుగొందుతున్న జపాన్ దిగ్గజాలు టయోటా మరియు సుజుకి సంస్థలకు చెందిన అధికారులు ప్రధాని మంత్రితో వేరు వేరుగా భేటీ నిర్వహించారు. సాంకేతిక అభివృద్ది మరియు దేశీయంగా ఉన్న వ్యాపార అవకాశాల గురించి చర్చించినట్లు తెలిసింది.

ప్రధాన మంత్రి అధికార కార్యాలయం నుండి వెలువడిన ప్రెస్ నోట్ ప్రకారం టయోటా ప్రెసిడెంట్ అకియో టయోడా మరియు సుజుకి చైర్మెన్ ఒసాము సుజుకి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరిపారు.

ఈ భేటీలో టయోటా మరియు సుజుకి యొక్క భవిష్యత్ సాంకేతిక అభివృద్ది మరియు వ్యాపార భాగస్వామ్యం గురించి ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.

వీరిరువురి భాగస్వామ్యం ద్వారా టయోటా యొక్క అంతర్జాతీయ పరిజ్ఞానంతో, సుజుకి చిన్న కార్ల తయారీ సామర్థ్యం దేశీయంగా చిన్న కార్ల తయారీకి మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఇరు సంస్థలు సంయుక్తంగా చిన్న కార్ల ఉత్పత్తి మీద దృష్టి సారించినట్లు తెలిసింది.

దేశీయంగా చిన్న కార్ల తయారీ, విడి భాగాల ఉత్పత్తి, సాంకేతికతలో అభివృద్దికి టయోటా మరియు సుజుకి యొక్క వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్యపు ఒప్పందం ఎంతోగానో ఉపయోగపడనుంది.

రెండు సంస్థలు భాగస్వామ్యంతో మేకిన్ ఇండియా మంత్రంతో దేశీయ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. మరియు ప్రత్యేకంగా అంతర్జాతీయ మార్కెట్‌ అవసరాలకు ఇండియాలో తయారు చేసి ఎగుమతి చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి.

గతంలో 2016 అక్టోబర్‌లో ఇవే రెండు సంస్థలు భాగస్వామ్యంతో మార్కెట్లో బలమైన తయారీదారులుగా ఎదగడానికి భద్రత, సాంకేతిక సమాచారం వంటి అంశాల పరంగా చర్చలు జరిపాయి.

ఇరు సంస్థలు కూడా వివరణాత్మక పరిశోధన మీద దృష్టి సారించాయి. ప్రదానంగా వ్యాపార పరస్పర సహకారం కోసం, ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీస్, సేఫ్టీ టెక్నాలజీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ అదే విధంగా ఉత్పత్తుల మరియు విడిభాగాల పరస్పర సరఫరా పరంగా అంగీకారం తెలిపాయి.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్‌ను అతి త్వరలో విడుదల చేయనుంది. ప్రస్తుతం మీ వద్ద ఉన్న స్విఫ్ట్‌కు త్వరలో విడుదలయ్యే 2017 స్విఫ్ట్‌కు మధ్య తేడా ఏంటో తెలుసుకునేందుకు క్రింది ఫోటోల మీద క్లిక్ చేయండి...

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Toyota And Suzuki Held Meeting With Narendra Modi — India's Favourite Cars Could Be 'Made In India'?
Please Wait while comments are loading...

Latest Photos