హ్యుందాయ్ నుండి వస్తున్న ఐదు కొత్త కార్లు

భారతదేశపు ప్యాసింజర్ కార్ల విపణిలో రెండవ అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా నిలిచిన హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి ఐదు కొత్త మోడళ్ల విడుదలకు సిద్దం అవుతోంది.

By Anil

భారతదేశపు ప్యాసింజర్ కార్ల విపణిలో రెండవ అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా నిలిచిన హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి ఐదు కొత్త మోడళ్ల విడుదలకు సిద్దం అవుతోంది. ఈ మధ్యనే సరికొత్త వెర్నా సెడాన్ కారును విడుదల చేసింది. సందర్భానుసారంగా ఈ ఐదింటి గురించిన వివరాలు బయటకు వచ్చాయి.

అతి త్వరలో హ్యుందాయ్ మోటార్స్ విడుదల చేయనున్న ఐదు కొత్త కార్లు మరియు ఎస్‌యూవీల వివరాలు నేటి కథనంలో....

హ్యుందాయ్ కొత్త కార్లు

5. హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ ఇండియా లైనప్‌లో ఇప్పటికీ అత్తుత్తమ విక్రయాలు జరుపుతున్న మోడల్ క్రెటా కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఖరీదైన కాంపాక్ట్ ఎస్‌యూవీగా ప్రీమియమ్ కస్టమర్ల మనస్సు దోచుకున్న క్రెటా ను ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేయడానికి హ్యుందాయ్ నిశ్చయించుకుంది.

Recommended Video

Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
హ్యుందాయ్ కొత్త కార్లు

ఫేస్‌లిఫ్ట్ క్రెటాలోని ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ మార్పులతో పాటు ఫ్రంట్ డిజైన్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. 2017 క్రెటా ఎస్‌యూవీగా అంతర్జాతీయ మరియు దేశీయ విపణిలోకి ప్రవేశించినున్న ఇందులో మరిన్ని భద్రత మరియు ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు రానున్నట్లు సమాచారం.

హ్యుందాయ్ కొత్త కార్లు

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ సాంకేతికంగా పెట్రోల్ మరియు డీజల్ ఇంధన వేరియంట్లో 1.4-లీటర్ మరియు 1.6-లీటర్ ఇంజన్ ఆప్షన్‌లలో లభించనుంది.

హ్యుందాయ్ కొత్త కార్లు

4. హ్యుందాయ్ కోనా

హ్యుందాయ్ మోటార్స్ ఈ ఏడాది హైబ్రిడ్ కారును అందుబాటులోకి తీసుకు రావాలని భావించింది. అయితే, సరికొత్త ట్యాక్స్ విధానం జిఎస్‌టి మేరకు, హైబ్రిడ్ కార్ల మీద జిఎస్‌టి కారణంగా ట్యాక్స్ విపరీతంగా పెరగడంతో హైబ్రిడ్ కార్ల మీద ప్రణాళికలను హ్యుందాయ్ ఉపసంహరించుకుంది.

హ్యుందాయ్ కొత్త కార్లు

హైబ్రిడ్ కార్లను ప్రవేశపెట్టడం అంత లాభదాయకం కాదని భావించి, ఇప్పుడు ఎలక్ట్రిక్ కారును లాంచే చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందుకు అనుగుణంగా కోనా ఎస్‌యూవీని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో సిద్దం చేస్తోంది.

హ్యుందాయ్ కొత్త కార్లు

హ్యందాయ్ కోనా ఇండియా యొక్క తొలి హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారుగా నిలవనుంది. సింగల్ ఛార్జింగ్‌తో 384కిలోమీటర్ల పరిధి సామర్థ్యంతో 2018 జెనీవా మోటార్ షో వేదిక మీద ఆవిష్కరించిన అనంతరం మార్కెట్లోకి విడుదల చేయనుంది.

హ్యుందాయ్ కొత్త కార్లు

3. హ్యుందాయ్ కార్లినో

హ్యుందాయ్ మోటార్స్ క్రెటా ఎస్‌యూవీని ప్రవేశపెట్టడంతో మంచి మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. అయితే, ఇప్పటికీ సబ్ నాలుగు మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఒక్క మోడల్‌ను కూడా విడుదల చేయలేదు.

హ్యుందాయ్ కొత్త కార్లు

ప్రస్తుతం ఉన్న సబ్-4 మీటర్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో 2016 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద ప్రదర్శన కార్లినో కాన్సెప్ట్ ఆధారిత ఎస్‌యూవీని అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది.

హ్యుందాయ్ కొత్త కార్లు

హ్యుందాయ్ కార్లినో ఆధారిత ఎస్‌యూవీలో 1.0-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ మరియు క్రెటా లభించే 1.4-లీటర్ పెట్రోల్, డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో ప్రవేశపెట్టనుంది. దీని విడుదల గురించి ఖచ్చితమైన సమాచారం లేదు అయితే 2018 చివరి నాటికి లేదా 2019 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

హ్యుందాయ్ కొత్త కార్లు

2. హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

హ్యందాయ్ మోటార్స్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ కారును ఇప్పటికే ఎలైట్ మరియు ఆక్టివ్ ఎడిషన్‌లో విడుదల చేసింది. అయితే ఇప్పుడు రెగ్యులర్ వెర్షన్ ఐ20 కారును ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో విడుదలకు సిద్దమైంది. ఐ20 ఫేస్‌లిఫ్ట్‌ను ఇప్పటికే పలుమార్లు రహస్యంగా పరీక్షించింది.

హ్యుందాయ్ కొత్త కార్లు

ఫేస్‌లిఫ్ట్ ఐ20 ఇంటీరియర్ సరికొత్త వెర్నా ఇంటీరియర్ తరహాలో ఉండనుంది. ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో రానుంది.

హ్యుందాయ్ కొత్త కార్లు

నూతన ఐ20 ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుతం ఉన్న 1.4-లీటర్ డీజల్, 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో లభించనుంది. సరికొత్త ఐ20 ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ 2018 లో విడుదల కానుంది.

హ్యుందాయ్ కొత్త కార్లు

1. హ్యుందాయ్ నెక్ట్స్ జనరేషన్ శాంట్రో

హ్యుందాయ్ సరికొత్త శాంట్రో హ్యాచ్‍‌బ్యాక్ కారును అభివృద్ది చేస్తోంది. అది ఇయాన్ మరియు గ్రాండ్ ఐ10 మధ్య ఉన్న స్థానాన్ని భర్తీ చేయనుంది. టాల్ బాయ్ డిజైన్ లక్షణాలతో ix-మెట్రో కాన్సెప్ట్ ఆధారంగా దీనిని డెవలప్ చేస్తోంది.

హ్యుందాయ్ కొత్త కార్లు

సరికొత్త హ్యుందాయ్ శాంట్రో హ్యాచ్‌బ్యాక్ 68.5బిహెచ్‌పి పవర్ మరియు 94ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.0-లీటర్ పెట్రోల్ మరియు 82బిహెచ్‌పి పవర్, 116ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభించనుంది.

హ్యుందాయ్ కొత్త కార్లు

2018 ఏడాది మలిసగంలో విపణిలోకి విడుదలయ్యే సూచనలున్నాయి. అయితే, దీనికి శాంట్రో పేరునే ఖరారు చేస్తుందా.... లేదంటే కొత్త పేరుతో విడుదల చేస్తుందా అనే విషయం స్పష్టం కావాల్సి ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: Upcoming hyundai cars and suvs for india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X