ఇండియన్ మార్కెట్లోకి వోక్స్‌వ్యాగన్ విడుదల చేయనున్న కొత్త కార్ల జాబితా

Written By:

ప్రపంచ వ్యాప్తంగా సరసమైన ధరలతో అత్యంత నాణ్యమైన కార్లను అందివ్వడంలో వోక్స్‌వ్యాగన్‌ది ప్రత్యేక స్థానం. అయితే జపాన్ సంస్థల పోటీ దాటికి వోక్స్‌వ్యాగన్ ఆశించిన మేర రాణించలేకపోతోంది. ప్రధానంగా హోండా కార్స్‌ నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో రానున్న ఏడాదిలోపు కొన్ని కొత్త మోడళ్లను విడుదల చేసి మార్కెట్ వాటాను పెంచుకునెేందుకు ప్లాన్ చేస్తోంది.

రానున్న ఏడాది లోపు మూడు కొత్త కార్లను విడుదల చేయడానికి వోక్స్‌వ్యాగన్ సర్వం సిద్దం చేసుకుంది. వివిద దశలలో ఒక్కో సెగ్మెంట్లో ఒకటి చొప్పున మూడు మోడళ్లను విడుదలకు సిద్దం చేసింది. అవి,

 • ఎస్‌యూవీ సెగ్మెంట్ - టిగువాన్
 • ప్రీమియమ్ హైబ్రిడ్ సెడాన్ - పస్సాట్ జిటిఇ
 • ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ - పోలో

వోక్స్‌వ్యాగన్ టిగువాన్

ప్రపంచ మార్కెట్లతో పాటు ఇండియన్ మార్కెట్లో కూడా ఎస్‌యూవీలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎమ్‌క్యూబి ఫ్లాట్‌‌ఫామ్ ఆధారంగా టిగువాన్ ఎస్‌యూవీని రూపొందించింది. ఎక్ట్సీరియర్ మీద పదునైన డిజైన్ లక్షణాలను వోక్స్‌వ్యాగన్ ఉత్పత్తుల్లో గమనించవచ్చు.

వోక్స్‌వ్యాగన్ సాంకేతికంగా ఈ టిగువాన్ ఎస్‌యూవీలో 147బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 2.0-లీటర్ సామర్థ్యం గల టిడిఐ డీజల్ ఇంజన్ అందించింది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో వచ్చే అవకాశం ఉంది.

 • విడుదల అంచనా: జూన్ 2017.
 • ధర అంచనా: 25 నుండి 30 లక్షల ధరల శ్రేణిలో.
 • పోటీ: ఫోర్డ్ ఎండీవర్, టయోటా ఫార్చ్యూనర్ మరియు ఇసుజు ఎమ్‌యు-ఎక్స్.

2. వోక్స్‌వ్యాగన్ పస్సాట్ జిటిఇ

ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ కార్ల తయారీ మరియు విక్రయాలు చేపట్టే సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహాకాలు కల్పిస్తున్న తరుణంలో ప్రతి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ కూడా తమ లైనప్‌లో హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా వోక్స్‌వ్యాగన్ తమ పస్సాట్ జిటిఇ ను హైబ్రిడ్ వేరియంట్లో విడుదలకు సిద్దం చేసింది.

దిగుమతి చేసుకుని అందుబాటులో ఉంచనున్న ఈ పస్సాట్ జిటిఇ హైబ్రిడ్ వేరియంట్లో 215బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం గల 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌తో రానుంది.

 • విడుదల అంచనా: 2017 మలిసగంలో.
 • ధర అంచనా: 30 నుండి 35 లక్షల ధరల శ్రేణిలో.
 • పోటీ: టయోటా క్యామ్రీ హైబ్రిడ్ మరియు హోండా అకార్డ్ హైబ్రిడ్.

3. నెక్ట్స్ జనరేషన్ వోక్స్‌వ్యాగన్ పోలో

ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ప్రపంచ వ్యాప్తంగా వోక్స్‌వ్యాగన్ పోలో తిరుగులోని ఖ్యాతిని గడించింది. మరింత శక్తివంతమైన ఇంజన్ వేరియంట్లతో, నూతన డిజైన్ సొబగుల జోడింపు మరియు జపాన్ ఉత్పత్తుల నుండి పోటీని ఎదుర్కునేందుకు కొత్త ఫీచర్లతో ఇది వరకే ఉన్న పోలో హ్యాచ్‌బ్యాక్‌ను వోక్స్‌వ్యాగన్ మళ్లీ డెవలప్ చేస్తోంది. దీనిని నెక్ట్స్ జనరేషన్ పోలోగా విడుదల చేయనుంది.

యూరోపియన్ మోడల్ పోలో కోసం 1-లీటర్ సామర్థ్యం ఉన్న న్యాచుర్లలీ ఆస్పిరేటెడ్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ స్థానంలోకి 1.6-లీటర్ ఇంజన్‌ను అందివ్వనుంది. ఇండియన్ మార్కెట్లోకి రానున్న నెక్ట్స్ జనరేషన్ పోలో 140 నుండి 160 బిహెచ్‌పి మధ్య పవర్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ పెట్రల్ అదే విధంగా 1.5-లీటర్ డీజల్ ఇంజన్ వేరియంట్లు రానున్నాయి.

 • విడుదల అంచనా: 2018 మలిసగంలో.
 • ధర అంచనా: 5.5 నుండి 10.5 లక్షల ధరల శ్రేణిలో.
 • పోటీ: హోండా జాజ్, మారుతి సుజుకి బాలెనో మరియు హ్యుందాయ్ ఐ20.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Read In Telugu Upcoming Volkswagen Cars In India
Please Wait while comments are loading...

Latest Photos