పెరిగిన వెహికల్ రిజిస్ట్రేషన్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ ధరలు

Written By:

ఇప్పటి వరకు పెరిగిన కార్లు మరియు బైకుల ధరల గురించి అనేక కథనాలను డ్రైవ్‌స్పార్క్ తెలుగులో చూసుంటారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని రవాణా మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ లైసెన్స్ మరియు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ధరలను పెంచినట్లు ఉత్తర్వులు విడుదల చేసింది.

డ్రైవర్ లైసెన్స్ రెన్యువల్ ఫీజు రూ. 50 లు ఉండగా, ఇప్పుడు దానిని రూ. 200 లకు మరియు కొత్త వాహన రిజిస్ట్రేషన్ కు ప్రస్తుతం ఉన్న ఫీజుకు పది రెట్లుకు పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇక ఎవరయినా కొత్తగా డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించాలనుకుంటున్నారు, అయితే కొత్త ధరల ప్రకారం రూ. 10,000 లు చెల్లించాల్సి ఉంటుంది.

దేశీయంగా తయారయిన కార్లు మరియు బైకుల మీద మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ నుండి దిగుమతి చేసుకునే కార్లు మరియు బైకుల రిజిస్ట్రేషన్ ధరల మీద కూడా పెంపును ప్రకటించారు.

  • డ్రైవింగ్ అభ్యసించే వారి ఫీజు రూ. 150 లు
  • లైసెన్స్ రెన్యువల్ ఫీజు రూ. 200 లు
  • దేశవ్యాప్తంగా డ్రైవింగ్ పర్మిట్ ఫీజు రూ. 1,000 లు
  • డ్రైవింగ్ స్కూల్ యొక్క లైసెన్స్ రెన్యువల్ ఫీజు రూ. 5,000 లు
  • త్రీ వీలర్ రిజిస్ట్రేషన్ రుసుము రూ. 1,000 లు
  • బస్సులు మరియు ట్రక్కులకు గాను రూ. 1,500 లు
  • డుప్లికేట్ లైసెన్స్ ఫీజు రూ. 5,000లు

దెయ్యాలు ఎక్కువగా ఉన్న టాప్-10 భారతీయ రోడ్ల గురించి ఎప్పుడైనా విన్నారా...?
దెయ్యాలు ఉన్నాయా అని ఎవరినైనా కదిలిస్తే చాలు దెయ్యాలు గురించి రామాయణం, మహాభారతం రేంజ్‌లో కథలు చెప్పుకొస్తారు. కాని ఇంత వరకు దెయ్యాలు ఉన్నాయా లేవా అన్నది ప్రశ్నలాగే మిగిలిపోయిందేగాని దీనికి సంభందించి ఎటువంటి సరైన కథనాలు ఇంత వరకు రాలేదు. అయితే మన భారతీయ రోడ్ల మీద కొన్ని దెయ్యాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయట.

మీలో ఎవరయినా స్విఫ్ట్ అభిమానులు ఉన్నారా...? అయితే మీ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఈ ఏడాదిలో విడుదల కానున్న 2017 మారుతి స్విఫ్ట్ ఫోటోలను గ్యాలరీగా అందిస్తోంది. అస్సలు మిస్సవకండి...

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Saturday, January 7, 2017, 16:23 [IST]
English summary
Driving Licence And Vehicle Registration Prices Hiked
Please Wait while comments are loading...

Latest Photos