విపణిలోకి వోల్వో ఎస్60 పోల్‌స్టార్ విడుదల: ప్రారంభ ధర రూ. 52.5 లక్షలు

వోల్వో ఇండియా విభాగం విపణిలోకి తమ ఎస్60 పోల్‌స్టార్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. శక్తివంతమైన వోల్వో ఎస్60 పోల్‌స్టార్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం రండి..

By Anil

స్వీడన్‌కు చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో తమ ఎస్60 పోల్‌స్టార్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ పర్ఫామెన్స్ బ్రాండ్ న్యూ కారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి కారుకు గట్టి పోటీనివ్వనుంది.

వోల్వో ఎస్60 పోల్‌స్టార్

ఇండియాలో లైనప్‌లోకి వోల్వో చేర్చిన మొదటి పర్ఫామెన్స్ కారు ఎస్60 పోల్‌స్టార్. దీని ప్రారంభ ధర రూ. 52.5 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్న వోల్వో ప్రతినిధులు తెలిపారు.

వోల్వో ఎస్60 పోల్‌స్టార్

సరికొత్త వోల్వో ఎస్60 పోల్‌స్టార్‌లో 2-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 362బిహెచ్‌పి పవర్ మరియు 470ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

వోల్వో ఎస్60 పోల్‌స్టార్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు పెడల్ షిఫ్టర్స్ గల 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయబడింది.

వోల్వో ఎస్60 పోల్‌స్టార్

వోల్వో ఎస్60 పోల్‌స్టార్ ముందు భాగంలో ఎక్కువ గాలిని గ్రహించేందుకు పెద్ద పరిమాణంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్, టుర్బో ఛార్జర్ మరియు ఇంజన్ టెంపరేచర్‌ని బట్టి ఎంత మేరకు గాలి కావాలనేదాని ఆధారంగా ఎలక్ట్రిక్ ద్వారా ఆపరేట్ చేయగల ఫ్రంట్ గ్రిల్‌లో చిన్న చిన్న ప్లేట్లను ఇవ్వడం జరిగింది(ఇవి ఇంజన్ వైపుకు గాలి ప్రవాహాన్ని నియంత్రిస్తాయి).

వోల్వో ఎస్60 పోల్‌స్టార్

వోల్వో ఎస్60 పోల్‌స్టార్ కేవలం 4.7 సెకండ్ల కాలవ్యవధిలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 250కిలోమీటర్లుగా ఉంది.

వోల్వో ఎస్60 పోల్‌స్టార్

సాధారణ వోల్వో ఎస్60 కన్నా ఈ వేరియంట్లో బిరుసైన సస్పెన్షన్ సిస్టమ్ అందివ్వడం జరిగింది. మరియు అంతే కాకుండా ఇందులో అత్యుత్తమ నియంత్రణ మరియు స్టీరింగ్ వీల్ అపరేషన్ కోసం కార్బన్ ఫైబర్ స్ట్రట్ బ్రేసెస్ ఉపయోగించారు.

వోల్వో ఎస్60 పోల్‌స్టార్

నూతన ఫ్రంట్ బంపర్ ద్వారా గంటకు 250కిలోమీటర్ల వేగం వద్ద ముందు వైపు 31కిలోలు మరియు వెనుక వైపున 15కిలోల డౌన్ ఫోర్స్‌ను తగ్గిస్తుంది.

వోల్వో ఎస్60 పోల్‌స్టార్

వోల్వో ఎస్60 పోల్‌స్టర్ ఇంటీరియర్‌లో స్పోర్ట్స్ సీట్లు, కార్బన్ ఫైబర్ తొడుగులు మరియు లెథర్ అప్‌హోల్‌స్ట్రే(కారు లోపలి పై భాగం), పోల్‌స్టార్ బ్యాడ్జింగ్ గల క్రోమ్ గేర్ లీవర్ మరియు సరికొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

వోల్వో ఎస్60 పోల్‌స్టార్

ఎస్60 పోల్‌స్టర్‌లో 20-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు పెద్ద బ్రేకులు ఉన్నాయి. వోల్వో యొక్క మొట్టమొదటి ఎస్60 పోల్‌స్టర్‌ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి సి43 కు గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Read In Telugu To Know About Volvo S60 Polestar Launched In India. Get more details about Volvo S60 Pollstar price, engine, features, specifications and more.
Story first published: Friday, April 14, 2017, 19:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X