ప్రపంచపు తొలి లాంబోర్గిని సెంటెనారియో డెలివరీ

ప్రపంచపు మొదటి లాంబోర్గిని సెంటెనారియో సూపర్ కారును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తొలి కస్టమర్‌కు డెలివరీ ఇచ్చింది. లాంబోర్గిని ప్రపంచ వ్యాప్తంగా కేవలం 40 యూనిట్లను మాత్రమే లిమిటెడ్ ఎడిషన్‌గా అందిస్తోంది

Written By:

తొలినాళ్లలో వాహన పరిశ్రమకు ఊపిరిపోసిన లాంబోర్గిని, ఇప్పుడు అత్యంత ఖరీదైన సూపర్ కార్లను తయారు చేసి, అమ్మకాల్లో తనదైన విజయబావుట ఎగురవేస్తోంది. గత ఏడాది జరిగిన 2016 జెనీవా మోటార్ షో వేదిక మీద ప్రదర్శించిన లాంబోర్గిని సెంటెనారియో సూపర్ కారును ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసి డెలివరీలను ప్రారంభించింది. తొలి సెంటెనారియో కారును డెలివరీ కూడా చేసింది. సెంటెనారియో గురించి మరిన్ని ప్రత్యేకతలు నేటి కథనంలో...

మొత్తం 40 సెంటెనారియో లిమిటెడ్ ఎడిషన్ కార్లను కూపే మరియు రోడ్‌స్టర్ వేరియంట్ల పేరుతో సమానంగా ఉత్పత్తి చేయనుంది. లాంబోర్గిని వీటిని శాంట్ అగాటా బూలెగ్నెస్ వద్ద ఉత్పత్తి చేస్తోంది.

సెంటెనారియో రోడ్‌స్టర్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను కాలిఫోర్నియా వేదికగా గత ఏడాది ఆగష్టులో జరిగిన 2016 పెబ్బెల్ బీచ్ కన్కోర్స్ డి'ఎలిగెన్స్‌లో ఆవిష్కరించింది.

తొలి సెంటెనారియో లాంబోర్గిని కారు ఆరేంజ్ రంగులో ఎంచుకున్నాడు. రూఫ్, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మరియు ఏరోడైనమిక్ శరీభాగాలను నల్లటి రంగుల్లో అందివ్వడం జరిగింది.

నివేదికల ప్రకారం లాంబోర్గిని సెంటెనారియో సూపర్ కారు ధర సుమారుగా 10 మిలియన్ల అరబ్ ధీరమ్‌లుగా ఉన్నట్లు తెలిసింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దీని విలువ సుమారుగా 18 కోట్ల రుపాయలు. దీని కొనాలనే ఆలోచనను కలలోకి కూడా రానివ్వకండి. ఎందుకంటే 40 కార్లను కూడా ఇప్పటికే బుక్ చేసుకున్నారు.

లాంబోర్గిని ఈ సెంటెనారియోలో 6.5-లీటర్ సామర్థ్యం ఉన్న న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి12 ఇంజన్ అందించింది. ఇది గరిష్టంగా 770బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి అనుసంధానం చేసిన 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

లాంబోర్గిని సెంటెనారియో సూపర్ కారు కేవలం 2.8 సెకండ్ల కాల వ్యవధిలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 350కిలోమీటర్లుగా ఉంది.

మీరు సూపర్ కార్ల ప్రేమికులు కాదా....? మీకు ఎస్‌యూవీలంటే ఇష్టమా... అయితే ప్రస్తుతం విపణిలో ఉన్న ఎస్‌యూవీలకు పోటీగా రెనో ఇండియా క్యాప్చర్ ఎస్‌యూవీని తీసుకువస్తోంది. దీనికి చెందిన మరిన్ని ఫోటోలను వీక్షించడానికి క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
World’s First Lamborghini Centenario Delivered To Customer
Please Wait while comments are loading...

Latest Photos