ఉత్పత్తి సిద్ధంగా ఉన్న ఏరోమొబిల్ 3.0 ఫ్లయింగ్ కార్ ఆవిష్కరణ

By Ravi

స్లోవేకియాకు చెందిన ఇంజనీర్ స్టీఫెన్ క్లీన్ తయారు చేసిన 'ఏరోమొబిల్ 2.5' (Aeromobil 2.5) అనే ఫ్లయింగ్ కారు‌లో మరిన్ని మార్పులు చేర్పులు చేసి కాన్సెప్ట్ దశ నుంచి దాదాపు ఉత్పత్తి దశకు తీసుకువచ్చారు. ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న ఈ ఫ్లయింగ్ కారుకు 'ఏరోమొబిల్ 3.0' (AeroMobil 3.0) అనే పేరును ఖరారు చేశారు.

ఏరోమొబిల్ 3.0 ఫ్లయింగ్ కారును అక్టోబర్ 29, 2014వ తేదీన ఆస్ట్రియాలోని వియన్నాలో జరిగిన పయోనీర్స్ ఫెస్టివల్‌లో ఆవిష్కరించారు. ఆ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలను మరియు ఈ ఏరోమొబిల్ 3.0 ఫ్లయింగ్ కారుకు సంబంధించిన వివరాలను ఈ కథనంలో తెలుసుకోవచ్చు. మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఏరోమొబిల్ 3.0 ఫ్లయింగ్ కార్ ఆవిష్కరణ

తర్వాతి స్లైడ్‌లలో ప్రొడక్షన్ వెర్షన్ ఫ్లయింగ్ కార్ ఏరోమొబిల్ 3.0కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

ఏరోమొబిల్ 3.0 ఫ్లయింగ్ కార్ ఆవిష్కరణ

ఏరోమొబిల్ సంస్థ 1990వ సంవత్సరం నుంచి ఫ్లయింగ్ కార్ కాన్సెప్ట్‌పై పనిచేస్తోంది. తమ మొట్టమొదటి చూడటానికి వికారంగా ఉండి, తరచూ ఉపయోగించేందుకు వీలుగా ఉండేది కాదని కంపెనీ పేర్కొంది. ఆ తర్వాత ఈ ఫ్లయింగ్ కారు డిజైన్‌ను అనేక సార్లు మార్చారు.

ఏరోమొబిల్ 3.0 ఫ్లయింగ్ కార్ ఆవిష్కరణ

ఏరోమొబిల్ 2.5 ఫ్లయింగ్ కారును ఆవిష్కరించిన తర్వాత కేవలం 10 నెలల సమయంలోనే ఈ కొత్త ఏరోమొబిల్ ఫ్లయింగ్ 3.0 కారును అభివృద్ధి చేశామని, ఇది దాదాపుగా ఫైనల్ ప్రోడక్ట్‌కు చాలా దగ్గరగా ఉన్న ప్రోటోటైప్ అని కంపెనీ పేర్కొంది.

ఏరోమొబిల్ 3.0 ఫ్లయింగ్ కార్ ఆవిష్కరణ

ప్రొడక్షన్ వెర్షన్ ఏరోమొబిల్ 3.0 ఫ్లయింగ్ కారులో రోటాక్స్ 912 ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్‌ను ఏరోమొబిల్ 3.0 వెనుక భాగంలో అమర్చారు.

ఏరోమొబిల్ 3.0 ఫ్లయింగ్ కార్ ఆవిష్కరణ

ఏరోమొబిల్ 3.0 గాలిలో 700 కిలోమీటర్ల దూరం, నేలపై 875 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. గాలిలో ఇది గంటకు 15 లీటర్ల ఇంధనాన్ని, రోడ్డుపై 12.5 కెఎమ్‌పిఎల్ మైలేజీని ఆఫర్ చేస్తుంది.

ఏరోమొబిల్ 3.0 ఫ్లయింగ్ కార్ ఆవిష్కరణ

గాలిలో ఏరోమొబిల్ 3.0 గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు, రోడ్డుపై గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. టేకాఫ్ స్పీడ్ గంటకు 130 కిలోమీటర్లు.

ఏరోమొబిల్ 3.0 ఫ్లయింగ్ కార్ ఆవిష్కరణ

ఏరోమొబిల్ 3.0 ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. నాలుగు చక్రాలు కలిగిన ఈ వాహనంలో వెనుక చక్రాలు బ్యాలెన్సింగ్ కోసం సహకరిస్తాయి, ముందు చక్రాలు ఇంజన్‌కు కనెక్ట్ అయి ఉంటాయి.

ఏరోమొబిల్ 3.0 ఫ్లయింగ్ కార్ ఆవిష్కరణ

ఏరోమొబైల్ 3.0 క్యాబిన్/కాక్‌పిట్‌లో రెండు సీట్లు ఉంటాయి. ఇందులో ఒకటి డ్రైవర్/పైలట్ కోసం మరొకటి ప్యాసింజ్/కోపైలట్ కోసం.

ఏరోమొబిల్ 3.0 ఫ్లయింగ్ కార్ ఆవిష్కరణ

ఈ ఫ్లయింగ్ కారులో రెండు స్టీరింగ్ వీల్స్ ఒకదానిపై ఒకటి ఉంటాయి. ఇందులో పెద్ద స్టీరింగ్‌ను రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఉపయోగించాలి, దానిపై ఉండే చిన్న స్టీరింగ్‌ను గాలిలో ఫ్లయింగ్ కారును కంట్రోల్ చేసేందుకు వినియోగించాలి.

ఏరోమొబిల్ 3.0 ఫ్లయింగ్ కార్ ఆవిష్కరణ

ఏరోమొబిల్ 3.0 ఫ్లయింగ్ కారు ఫ్రేమ్‌ను స్టీల్‌తో తయారు చేశారు, దీని బాడీని కార్భన్ ఫైబర్ పదార్థంతో తయారు చేశారు. ఫలితంగా దీని తక్కువ బరువును కలిగి ఉంటుంది.

వీడియో

ఏరోమొబిల్ 3.0 ఫ్లయింగ్ కారు టెస్ట్ ఫ్లయిట్ వీడియోని ఈ స్లైడ్‌లో వీక్షించవచ్చు.

Most Read Articles

English summary
The AeroMobil 3.0 prototype was premiered on October 29th at the Pioneers Festival in Vienna. The current flying car prototype AeroMobil 3.0 incorporates significant improvements and upgrades. It is now being tested in real flight conditions since October 2014. Initially certified by the Slovak Federation of Ultra-Light Flying, it now entered a regular flight-testing program. The AeroMobil 3.0 prototype is very close to the final product.
Story first published: Thursday, October 30, 2014, 10:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X