సరికొత్త హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఆవిష్కరణ

By Ravi

హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20లో ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కంపెనీ సరికొత్త 2014 ఐ20 కారుకు సంబంధించిన ఫొటోలను, వివరాలను అధికారికంగా వెల్లడి చేసింది.

ఈ కొత్త కారును 'హ్యుందాయ్ ఎలైట్ ఐ20' (Hyundai Elite i20) పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మోడల్ కోసం నేటి నుంచే (ఆగస్ట్ 1, 2014) బుకింగ్‌లను స్వీకరించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఎలైట్ ఐ20 కారును హ్యుందాయ్ ఈ నెల 11వ తేదీన భారత విపణిలో విడుదల చేయనుంది.


ఈ కొత్త తరం హ్యుందాయ్ ఎలైట్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ కారును ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా డిజన్ చేశారు. జర్మనీలోని రుస్సెల్స్‌హీమ్‌లో హ్యుందాయ్ డిజైన్ సెంటర్ యూరప్ వద్ద ఈ కారును డిజైన్ చేశారు. ప్రస్తుత తరం ఐ20తో పోల్చుకుంటే ఈ కొత్త తరం ఎలైట్ ఐ20 డిజైన్ సరికొత్తగా కనిపిస్తుంది.
Hyundai Elite i20 Rear

ఈ కొత్త ఎలైట్ ఐ20 ముందు వైపు కొత్త హ్యుందాయ్ కంపెనీ సిగ్నేచర్ హెక్సాగనల్ గ్రిల్, మందపాటి థిన్ హారిజాంటల్ స్ట్రిప్, వ్రాప్ అరౌండ్ విండో, బూమర్యాంగ్ షేప్డ్ టెయిల్ లైట్స్‌తో ఇది రిఫ్రెష్డ్ లుక్‌ని కలిగి ఉంటుంది. ఈ కారుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలంటే, ఇంకో పది రోజుల వరకు ఆగాల్సిందే.
Most Read Articles

English summary
Hyundai Motor has revealed design renderings of All-New “The Elite i20”, which was designed at Hyundai Motor’s Design Centre Europe in Rüsselsheim, Germany. The new version of Hyundai’s popular B-segment model features the brand’s ‘Fluidic Sculpture 2.0’ design philosophy, in a sophisticated and distinctive design.
Story first published: Friday, August 1, 2014, 11:39 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X