భారత్‌కు వస్తున్న సరికొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీ

By Ravi

షేపులు మారిన సరికొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీ భారత్‌కు వస్తోంది. జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ ఇండియా అందిస్తున్న ఎక్స్-ట్రైల్‌లో అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను దేశీయ విపణిలో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. నిస్సాన్ ఇటీవలే ముగిసిన 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో తమ గ్లోబల్ వెర్షన్ ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. పాత ఎక్స్-ట్రైల్ కన్నా మరింత స్టయిలిష్ లుక్, ప్రీమియం ఫీచర్లతో ఈ కొత్త ఎక్స్-ట్రైల్‌ను అభివృద్ధి చేశారు.

నిస్సాన్ క్వాష్కాయ్, జ్యూక్, మురానో, పెట్రోల్ వంటి మోడళ్లను నుంచి స్ఫూర్తి పొంది ఈ కారును డిజైన్ చేశారు. పాత వెర్షన్ మాదిరిగా ఇది రగ్గ్‌‌డ్ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ మాదిరిగా కాకుండా, క్రాసోవర్ మాదిరిగా కనిపిస్తుంది. ఇది నిస్సాన్ కొత్త ప్లాట్‌ఫామ్ 'కామన్ మాడ్యూల్ ఫ్యామిలీ' (సిఎమ్ఎఫ్)పై రూపొందించిన తొలి కారు కావటం కూడా మరొక విశేషం. రెనో-నిస్సాన్‌లు భవిష్యత్తులో అభివృద్ధి చేయనున్న 11 కార్లకు ఇదే ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించనున్నట్లు పేర్కొన్నాయి.

ఈ ఫ్యూచర్ మోడళ్లలో హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి పెద్ద కార్ల వరకు, అలాగే మరింత ప్రీమియం కార్లు ఉండనున్నాయి. అన్ని వాహనాలకు ఇదే ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవటం వలన సుమారు 30 శాతం వరకు విడిభాగాలపై ఆదా చేసుకోవచ్చని ఈ అలయన్స్ పేర్కొంది. సరే, అదటుంచి సరికొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీకి సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

గ్లోబల్ మోడల్

గ్లోబల్ మోడల్

కొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఓ గ్లోబల్ మోడల్. దాదాపు అన్ని మార్కెట్లో దీని డిజైన్ యధావిధిగా ఉంటుంది. అయితే, ఆయా మార్కెట్లకు అనుగుణంగా ఇంటీరియర్లు, ఫీచర్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది.

మార్కెట్స్

మార్కెట్స్

కొత్త ఎక్స్-ట్రైల్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఐధు ప్లాంట్లలో అసెంబ్లింగ్ చేయనున్నారు. దీనిని 100కు పైగా అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించనున్నారు. ఈ జాబితాలో భారతదేశం కూడా ఉంది.

7-సీటర్

7-సీటర్

కొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీ ఒక 7-సీటర్ ఎమ్‌పివి (2+3+2 సీటింగ్). అమెరికన్ మార్కెట్లో దీనిని రోగ్ మోడల్ స్థానంలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే యూరప్ మార్కెట్లలో క్వాష్కాయ్ +2 స్థానంలో ప్రవేశపెట్టనున్నారు.

ఫ్రంట్-వీల్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్స్

ఫ్రంట్-వీల్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్స్

కొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీ 2-వీల్ డ్రైవ్ (ఫ్రంట్-వీల్ డ్రైవ్), 4-వీల్ డ్రైవ్ (ఆల్-వీల్ డ్రైవ్) ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులో 2-వీల్ డ్రైవ్ స్టాండర్డ్‌గా లభిస్తుంది, 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌గా లభిస్తుంది.

ఇంజన్స్

ఇంజన్స్

కొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్, 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో ఆఫర్ చేయనున్నారు. ఇందులో నిస్సాన్ నుంచి పాపులర్ అయిన ఎక్స్-ట్రానికి సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించే ఆస్కారం కూడా ఉంది.

ధర

ధర

భారత మార్కెట్లో సరికొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీ ధర సుమారు రూ.20 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో

ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో

నిస్సాన్ ఇటీవలే ముగిసిన 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో తమ గ్లోబల్ వెర్షన్ ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది.

Most Read Articles

English summary
All new Nissan X-Trail will be manufactured in 9 locations across the globe and the Renault-Nissan facility at Oragadam in Chennai, India is likely to be one of them. The all new X-Trail will be sold in 190 countries and will be badged as the Rogue in the USA.
Story first published: Thursday, September 26, 2013, 17:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X