ఈ ఏడాది మరో సరికొత్త టాటా సఫారీ స్టోర్మ్ వస్తోంది

By Ravi

టాటా మోటార్స్ విక్రయిస్తున్న సఫారీ స్టోర్మ్ త్వరలోనే మరో కొత్త రూపంలో దర్శనమివ్వనుంది. సఫారీ స్టోర్మ్‌లో ఓ సరికొత్త వెర్షన్‌ను విడుదల చేస్తామని టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ కొత్త సఫారీ ఎక్స్టీరియర్, ఇంటీరియర్లలో అనేక మార్పులు, చేర్పులు ఉండనున్నాయి. అంతేకాదు, ఇందులో యాంత్రికపరంగా కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి.

ప్రస్తుత సఫారీ స్టోర్మ్‌లో ఉపయోగిస్తున్న ఇంజన్ కన్నా మరింత స్పోర్టీయర్ ఇంజన్‌ను కొత్త సఫారీ స్టోర్మ్‌లో ఉపయోగించనున్నారు. లేటెస్ట్ టాటా ఆరియాలో కంపెనీ ఉపయోగించిన 2.2 లీటర్ వేరికార్ ఇంజన్‌ను రీట్యూన్ చేసి పవర్‌ను 140 బిహచ్‌పిల నుంచి 150 బిహెచ్‌పిలకు పెంచడం ద్వారా ఓవరాల్ ఎస్‌యూవీ పెర్ఫార్మెన్స్‌ను మెరుగుపరచనున్నారు.

ఇంకా ఇందులో హార్మన్ కార్డన్ నుంచి గ్రహించిన టచ్‌స్క్రీన్ నావిగేషన్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేయనున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి రానున్న సరికొత్త టాటా సఫారీ స్టోర్మ్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కూడా పరిచయం చేయనున్నారు.

Tata Safari Storme

ప్రస్తుతం తరం కార్లు అనేక కొత్త ఫీచర్లతో మార్కెట్లో లభిస్తున్న నేపథ్యంలో, కొత్త సఫారీ స్టోర్మ్‌లో ఈ మార్పులు ఎంతో స్వాగతించదగినవి. ఈ ధర శ్రేణిలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్, మంచి హైవే పెర్ఫార్మెన్స్, డీసెంట్ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలు కలిగిన ఈ ప్రీమియం ఎస్‌యూవీ మార్కెట్లో మంచి సక్సెస్‌ను సాధించగలదని నిపుణులు భావిస్తున్నారు.

కొత్త టాటా సఫారీ స్టోర్మ్‌లో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు. ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ సైడ్ మిర్రర్స్, సెంటర్ ఆర్మ్‌రెస్ట్స్, రూఫ్ మౌంటెడ్ ఏసి వంటి ప్రీమియం సేఫ్టీ ఫీచర్లు లభ్యం కానున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Tata Motors has announced the release of the new Safari Storme. The new Safari Storme will have many changes on the outside as well as the inside. The major noticeable changes would the reworked engine which will help the new Storme to be sportier than its predecessor.
Story first published: Monday, June 30, 2014, 15:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X