స్టీరింగ్ లేని వాహనాన్ని ఎప్పుడైనా చూశారా..?

By Ravi

గడచిన నెలలో బ్యాంకాక్‌లో జరిగిన 2014 అంతర్జాతీయ మోటార్ షోలో టొయోటా ఆవిష్కరించిన 'ఎఫ్‌వి2 కాన్సెప్ట్' (FV2 Concept) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భవిష్యత్ రవాణా (ఫ్యూచర్ ట్రాన్స్‌పోర్ట్)ను దృష్టిలో ఉంచుకొని టొయోటా ఈ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేసింది.

ఇది కూడా చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే టొయోటా ఫన్-విఐఐ కాన్సెప్ట్

టొయోటా ఫన్-టూ-డ్రైవ్ సిద్ధాంతం నుంచి పుట్టుకొచ్చిన వాహనమే ఈ ఎఫ్‌వి2 కాన్సెప్ట్. అడ్వాన్స్డ్ ఫ్యూచర్ వెహికల్ టెక్నాలజీతో ఈ వాహనాన్ని డిజైన్ చేశారు. గడచిన సంవత్సరం జపాన్‌లో జరిగిన 2013 టోక్యో మోటార్ షోలో తొలిసారిగా ఈ కాన్సెప్ట్‌ను ప్రదర్శించారు.

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను, ఫొటోలను పరిశీలిద్దాం రండి..!

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్ డిజైన్, నిర్మాణం చాలా విశిష్టంగా ఉంటుంది. ముందు, వెనుక చిన్నవిగా ఉండే రెండు వెడల్పాటి చక్రాలు, సైడ్స్‌ను సపోర్ట్ చేస్తూ ఉండే, రెండు పెద్ద చక్రాలు ఉంటాయి.

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్

సైడ్ చక్రాలు మరియు దీని బాడీ ప్యానెల్స్ ఎల్ఈడి డిస్‌ప్లేతో తయారు చేయబడి ఉంటాయి. వాహనం చలనంలో ఉన్నప్పుడ ఈ డిస్‌ప్లే కనిపించే విజువల గ్రాఫిక్స్ మరింత అందాన్నిస్తాయి.

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్

టొయోటా ఎఫ్‌వి2లో ఒక్కరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇందులో డ్రైవర్ కూర్చొని లేదా నిలుచుకొని ప్రయాణం చేయవచ్చు. ఇది పూర్తిగా ఆటోమేటిక్ వాహనం.

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్‌లో ఆసక్తికరమైన మరియు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఇందులో స్టీరింగ్ వీల్ ఉండదు. వాహనాన్ని టర్న్ చేయాలంటే, డ్రైవర్ ఎటు వైపుకు కదిలితే వాహనం అటు వైపుకు కదులుతుంది.

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్

అంటే, వాహనాన్ని ఎడమవైపుకు తిప్పాలనుకున్నప్పుడు డ్రైవర్ ఎడమవైపుకు జరిగితే సరిపోతుంది. అలానే, కుడి, ఎడమ, ముందు, వెనుక వైపులకు ఈ వాహనాన్ని డ్రైవర్ కదలికతో కంట్రోల్ చేయవచ్చు.

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్

ఐటిఎస్ టెక్నాలజీ ద్వారా భవిష్యత్తులో ఈ వాహనం ట్రాఫిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో కనెక్ట్ అయి, ట్రాఫిక్ సిగ్నల్స్, బ్లైండ్ స్పాట్స్ వంటి వాటిని ముందుగానే గుర్తించి, ఆటోమేటిక్‌గా అప్రమత్తమై, అందుకు తగిన విధంగా స్పందిస్తుంది.

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్

గుర్రానికి మరియు దానిని సవారీ చేసే వారికి మధ్య ఉన్న సంబంధం మాదిరిగానే, ఈ వాహనానికి మరియు దానిని నడిపే వారికి మధ్య సంబంధం ఉంటుందని కంపెనీ పేర్కొంది.

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్

టొయోటా ఎఫ్‌వి2 వాయిస్ అండ్ ఇమేజ్ రికగ్నైజేషన్ సిస్టమ్‌ను కలిగి ఉండి డ్రైవర్ మూడ్‌ను అంచనా వేయటం ద్వారా డ్రైవింగ్ ఎబిలిటీ, హిస్టరీలపై సమాచారం అందించి, ఓ కో-పైలట్ మాదిరిగా వారికి సహకరిస్తుంది.

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్ మొత్తం 3000 మి.మీ. పొడవును, 1600 మి.మీ. వెడల్పును కలిగి ఉంటుంది.

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్

స్లీప్‌మోడ్ (ఫ్రంట్ విండ్ షీల్డ్ మూసి ఉన్నప్పుడు)లో దీని ఎత్తు 990 మి.మీ గాను, డ్రైవింగ్ మోడ్ (ఫ్రంట్ విండ్ షీల్డ్ తెరచి ఉన్నప్పుడు) దీని ఎత్తు 1780 మి.మీ. గాను ఉంటుంది.

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్

టొయోటా ఎఫ్‌వి2 వీల్‌బేస్ 2360 మి.మీ. మరియు దీని సీటింగ్ కెపాసిటీ 1 (వ్యక్తి).

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్

టొయోటా తమ ఎఫ్‌వి2 కాన్సెప్ట్‌కు సంబంధించిన సాంకేతిక వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇది నిజరూపం దాల్చుతుందో లేక కాన్సెప్ట్‌గానే మిగిలిపోతుందో వేచి చూడాలి.

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్

2014 బ్యాంకాక్ మోటార్ షోలో టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్‌ ప్రదర్శన.

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్

2014 బ్యాంకాక్ మోటార్ షోలో టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్‌ ప్రదర్శన.

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్

2014 బ్యాంకాక్ మోటార్ షోలో టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్‌ ప్రదర్శన.

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్

2014 బ్యాంకాక్ మోటార్ షోలో టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్‌ ప్రదర్శన.

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్

2014 బ్యాంకాక్ మోటార్ షోలో టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్‌ ప్రదర్శన.

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్

2014 బ్యాంకాక్ మోటార్ షోలో టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్‌ ప్రదర్శన.

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్

2014 బ్యాంకాక్ మోటార్ షోలో టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్‌ ప్రదర్శన.

వీడియో

టొయోటా ఎఫ్‌వి2 కాన్సెప్ట్ డెమో వీడియోని ఈ స్లైడ్‌లో వీక్షించండి.

Most Read Articles

English summary
The Toyota FV2 is a concept car that can express Toyota’s “Fun to Drive” philosophy even in a future world in which vehicle technology has greatly progressed. The vehicle enhances the driving experience by connecting physically and emotionally with the driver, becoming more fun to drive the more it is used.
Story first published: Saturday, April 5, 2014, 11:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X