ఆడి ఏ3 క్యాబ్రియో విడుదల; ధర రూ.44.75 లక్షలు

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా, ఈ ఏడాది ఆగస్ట్ నెలలో మార్కెట్లో విడుదల చేసిన ఆడి ఏ3 కాంపాక్ట్ లగ్జరీ సెడాన్ అతికొద్ది కాలంలోనే మంచి సక్సెస్‌ను సాధించడంతో, కంపెనీ ఇందులో నేడు (డిసెంబర్ 11, 2014) మరో కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఓపెన్ టాప్ లగ్జరీ రైడ్ కోరుకునే వారి కోసం కంపెనీ ఇందులో ఓ కన్వర్టిబల్ వెర్షన్‌ను విడుదల చేసింది.

ఈ కన్వర్టిబల్ కారును ఆడి ఏ3 క్యాబ్రియో అని పిలువనున్నారు. దేశీయ విపణిలో దీని ధరను రూ.44.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు. ఇది కేవలం ఒకే ఒక్క వేరియంట్‌లో, అందులోను పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. అయితే, కస్టమర్ల కోసం కంపెనీ ఇందులో అనేక కస్టమైజేషన్ ఆప్షన్లను కూడా ఆఫర్ చేస్తోంది. ఆడి ఏ3 కన్వర్టిబల్ కారు ఎక్స్టీరియర్ కలర్, ఇంటీరియర్ లెథర్, ఆడియో సిస్టమ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైన వాటిని కస్టమర్లు తమకు నచ్చిన రీతిలో కస్టమైజ్ చేయించుకోవచ్చు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఆడి ఏ3 కన్వర్టిబల్ విడుదల

ఆడి ఏ3 క్యాబ్రియో మోడల్‌ను కంపెనీ తొలిసారిగా 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది. ఈ మోడల్‌ను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకి దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు.

ఇంజన్, ట్రాన్సిమిషన్:

ఇంజన్, ట్రాన్సిమిషన్:

ఇది కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభ్యం కానుంది. ఇందులో 1.8 లీటర్, టర్బోచార్జింగ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 180 హెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ ఎస్-ట్రానిక్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

పెర్ఫార్మెన్స్:

పెర్ఫార్మెన్స్:

ఆడి ఏ3 కన్వర్టిబల్ కారు కేవలం 7.8 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 242 కిలోమీటర్లు.

ఆటోమేటిక్ కన్వర్టిబల్ రూఫ్:

ఆటోమేటిక్ కన్వర్టిబల్ రూఫ్:

ఆడి ఏ3 క్యాబ్రియో ఓ 4-సీటర్ కన్వర్టిబల్ కారు. ఇందులో ఫ్యాబ్రిక్‌తో చేసిన సాఫ్ట్ టాప్ రూఫ్ ఉంటుంది. ఇది గంటకు 50 కిలోమీటర్ల వేగం వరకూ కూడా కేవలం 18 సెకండ్ల వ్యవధిలోనే ఓపెన్ అవుతుంది. ఇది ఎలక్ట్రో హైడ్రాలిక్ మెకానిజం ద్వారా పనిచేస్తుంది.

సీటింగ్, లగేజ్ స్పేస్:

సీటింగ్, లగేజ్ స్పేస్:

ఈ కన్వర్టిబల్ కారు 4421 మి.మీ. పొడవును కలిగి ఉంటుంది. ఇందులో నలుగు ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఇందులో 320 లీటర్ల లగేజ్ స్పేస్ కూడా ఉంటుంది.

కస్టమైజేషన్ ఆప్షన్స్

కస్టమైజేషన్ ఆప్షన్స్

ఆడి ఏ3 క్యాబ్రియో కారు కోసం ఆడి ఇండియా అనేక కస్టమైజేషన్ ఆప్షన్లను కూడా ఆఫర్ చేస్తోంది. ఎక్స్టీరియర్ కలర్, ఇంటీరియర్ లెథర్, ఆడియో సిస్టమ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైన వాటిని కస్టమర్లు తమకు నచ్చిన రీతిలో కస్టమైజ్ చేయించుకోవచ్చు.

ధర:

ధర:

'ఆడి ఏ3 క్యాబ్రియో' పేరుతో లభ్యం కానున్న ఈ కన్వర్టిబల్ వెర్షన్ ధరను దేశీయ విపణిలో రూ.44.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు.

Most Read Articles

English summary
The Audi A3 Cabriolet was launched today at an event in Delhi. The new car is the first convertible in the category and one of the few open-top vehicles available in the country presently. Read on for more about pricing, specs, features and more.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X