ఆగస్ట్ 19న విడుదల కానున్న ఆడి క్యూ3 ఎస్!

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి భారత లగ్జరీ కార్ సెగ్మెంట్లో తన అగ్రస్థానాన్ని పదిలం చేసునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా సరికొత్త ఉత్పత్తులను, తక్కువ ధర కలిగిన లగ్జరీ కార్లను దేశీయ విపణిలో విడుదల చేయనుంది.

ప్రస్తుతం ఆడి ఇండియా అందిస్తున్న క్యూ3లో ఓ చవక వేరియంట్‌ను విడుదల చేయనున్నట్లు గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించినట్లుగానే, ఆగస్ట్ 19న కంపెనీ తమ ఆడి క్యూ3 ఎస్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న ఆడి క్యూ3 ధర కన్నా సుమారు రూ.3 లక్షల తక్కువ ధరతో ఆడి క్యూ3 ఎస్‌ను ప్రవేశపెట్టొచ్చని అంచనా. ఇది ఈ సెగ్మెంట్లోని మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్, బిఎమ్‌డబ్ల్యూ ఇండియా నుంచి కొత్తగా మార్కెట్లోకి రానున్న బిఎమ్‌‌డబ్ల్యూ 1-సిరీస్ (సెప్టెంబర్ 3న విడుదల) వంటి ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్లకు పోటీగా నిలువనుంది.

Audi Q3

రెగ్యులర్ వెర్షన్ ఆడి క్యూ3లో లభ్యమవుతున్న కొన్ని లగ్జరీ ఫీచర్లను తొలగించి ఈ ఆడి క్యూ3 ఎస్ వెర్షన్‌ను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఉపయోగించిన 2.0 లీటర్ ఇంజన్‌ను రీట్యూన్ చేసి పవర్‌ను 140 బిహెచ్‌పి లకు, టార్క్‌ను 320 ఎన్ఎమ్‌లకు కుదించినట్లు సమాచారం.

ఆడి క్యూ3 ఎస్‌లో క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ స్థానంలో 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌ను ఆఫర్ చేయనున్నారు. ఈ ఎంట్రీ లెవల్ ఆడి క్యూ3 క్రాసోవర్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Most Read Articles

English summary
According to sources, Audi India is planning to launch a new Q3 S variant on August 19. This variant is the new entry level Q3 crossover and it will launch next month and it will be around Rs. 3 lakh cheaper than the current price range. Stay tuned to telugu.drivespark.com for latest updates.
Story first published: Thursday, August 8, 2013, 11:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X