ఆడి క్యూ3 ఎస్ విడుదల; ధర రూ.24.99 లక్షలు

చవక ఆడి క్యూ3 గురించి గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ విభిన్న కథనాల్లో ప్రచురించినట్లుగానే, జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా తమ ఎంట్రీ లెవల్ లగ్జరీ కారు 'ఆడి క్యూ3 ఎస్' (Audi Q3 S)ను నేడు (ఆగస్ట్ 19, 2013) భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఆడి క్యూ3 ఎస్ ధర రూ.24.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఆడి క్యూ3 ఎస్‌ ఈ సెగ్మెంట్లోని మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్, బిఎమ్‌డబ్ల్యూ ఇండియా నుంచి కొత్తగా మార్కెట్లోకి రానున్న బిఎమ్‌‌డబ్ల్యూ 1-సిరీస్ (సెప్టెంబర్ 3న విడుదల కానుంది) వంటి ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్లకు పోటీగా నిలువనుంది. ఈ కారును సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్ రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లోనే అసెంబ్లింగ్ చేయనున్నారు.

audi q3
రెగ్యులర్ వెర్షన్ ఆడి క్యూ3లో లభ్యమవుతున్న అనే ఫీచర్లను తొలగించి ఈ ఆడి క్యూ3 ఎస్‌ను తయారు చేశారు. ఇందులో క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ సిస్టమ్కు బదులుగా ఫ్రంట్ వీల్ డ్రైవ్, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఇది 2.0 లీటర్ డీజిల్ ఇంజన్తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 142 పిఎస్‌ల శక్తిని, 320 ఎన్ఎమ్‌‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆడి క్యూ3 ఎస్ కేవలం 9.9 సెకండ్లలోనే 0-100 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఇది లీటరుకు 17.71 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.
Audi Q3 S Launched
Most Read Articles

English summary
German luxury car maker Audi has launched Q3 S in India at INR 24.99 lakhs. It is powered by 2.0-liter TDI diesel engine, which has been detuned to produce 140bhp and 320Nm of torque, as compared to 177bhp and 380Nm found on the regular Q3.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X