ఆడి క్యూ3 డైనమిక్ విడుదల; ధర రూ.38.40 లక్షలు

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న తమ పాపులర్ లగ్జరీ కాంపాక్ట్ ఎస్‌యూవీ క్యూ3లో కంపెనీ మరో కొత్త టాప్-ఎండ్ వేరియంట్‌ను పరిచయం చేసింది. 'ఆడి క్యూ3 డైనమిక్' (Audi Q3 Dynamic) పేరుతో లభ్యం కానున్న ఈ వేరియంట్‌ను ఆడి డ్రైవ్ సెలక్ట్ ఫీచర్ (వివిధ డ్రైవింగ్ మోడ్స్‌ను సెలక్ట్ చేసుకునే ఫీచర్)తో ఆఫర్ చేయనున్నారు. ఇది క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇందులో ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా బదిలీ అవుతుంది.

ఆడి క్యూ3 డైనమిక్ వేరియంట్‌లో రఫ్ రోడ్ కండిషన్స్ కోసం సరికొత్త డైనమిక్ సస్పెన్షన్‌ను అమర్చారు. ఇంకా ఇందులో క్లియర్ లెన్స్ టెయిల్ ల్యాంప్స్, 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఆఫ్-రోడ్ స్టైల్ ప్యాకేజ్, పానరోమిక్ సన్‌రూఫ్, రూమీ ఇంటీరియర్, స్పోర్టీ ఎక్స్టీరియర్ మొదలైన ఫీచర్లు లభిస్తాయి. దేశీయ విపణిలో ఆడి క్యూ3 డైనమిక్ వేరియంట్ ధర రూ.38.40 లక్షలుగా ఉంది. భారత్‌లో ఆడి క్యూ3 రేంజ్ ప్రారంభ ధర రూ.25.49 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది.

భారత మార్కెట్లో ఇప్పటికే ఆడి క్యూ3 ఓ సక్సెస్‌‌ఫుల్ మోడల్‌గా ఉంది. ఈ నేపథ్యంలో, మరిన్ని ఆకర్షనీయమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన ఆడి క్యూ3 డైనమిక్ వేరియంట్ వలన ఈ మోడల్ అమ్మకాలు మరింత జోరందుకునే అవకాశం ఉంది. ఆడి క్యూ3 డైనమిక్ వేరియంట్లో లభించే ఫీచర్లు, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఆడి క్యూ3 డైనమిక్ - ఎక్స్టీరియర్

ఆడి క్యూ3 డైనమిక్ - ఎక్స్టీరియర్

ఇందులో 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, హీట్ ఇన్సులేటింగ్ గ్లాస్, జెనాన్ ప్లస్ హెడ్‌లైట్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, క్లియర్ లెన్స్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, డైనమిక్ హెడ్‌లైట్ రేంజ్ అడ్జస్టమెంట్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్ కోసం అండర్‌బాడీ గార్డ్స్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లున్నాయి. ఇధి ఫ్లోరెట్ సిల్వర్, మైథాస్ బ్లాక్ మరియు మాన్‌సూన్ గ్రే కలర్లలో లభిస్తుంది.

ఆడి క్యూ3 డైనమిక్ - ఇంటీరియర్

ఆడి క్యూ3 డైనమిక్ - ఇంటీరియర్

ఇంటీరియర్స్‌లో మల్టీ ఫంక్షన్ లెథర్ స్టీరింగ్ వీల్, హై గ్లోస్ ప్యాకేజ్, వాల్‌నట్ బ్రౌన్ ఇన్‌లేస్, స్టోరేజ్ ప్యాకేజ్, ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబల్ ఫ్రంట్ సీట్స్, ఫ్రంట్ సీట్స్ కోసం 4-వే లంబార్ సపోర్ట్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, లైట్ అండ్ రెయిన్ సెన్సార్ వంటి ఫీచర్లున్నాయి.

ఆడి క్యూ3 డైనమిక్ - సేఫ్టీ ఫీచర్స్

ఆడి క్యూ3 డైనమిక్ - సేఫ్టీ ఫీచర్స్

ఈ వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్‌పి (ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ ప్రోగ్రామ్), పార్కింగ్ అసిస్ట్, లైట్ అండ్ రెయిన్ సెన్సార్, క్వాట్రో వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి.

ఆడి క్యూ3 డైనమిక్ - కంఫర్ట్ ఫీచర్స్

ఆడి క్యూ3 డైనమిక్ - కంఫర్ట్ ఫీచర్స్

ఇందులో ఆడి డ్రైవ్ సెలక్ట్, ఆటో రిలీజ్ ఫంక్షన్, హిల్ స్టార్ట్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, 2-జోన్ డీలర్క్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, డైనమిక్ కంఫర్ట్ సస్పెన్షన్ వంటి కంఫర్ట్ ఫీచర్లున్నాయి.

ఆడి క్యూ3 డైనమిక్ - ఇన్ఫోటైన్‌మెంట్

ఆడి క్యూ3 డైనమిక్ - ఇన్ఫోటైన్‌మెంట్

ఇందులో 10 స్పీకర్లు, ఓ సబ్‌వూఫర్‌తో కూడిన ఆడియో సిస్టమ్, వాయిస్ డైలాగ్ సిస్టమ్, 5.8 ఇంచ్ రీట్రాకబల్ ఎమ్ఎమ్ఐ స్క్రీన్, కాన్సెర్ట్ రేడియో, ఆడి మ్యూజిక్ ఇంటర్‌ఫేస్, బ్లూటూత్ విత్ ఆడియో స్ట్రీమింగ్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

ఆడి డ్రైవ్ సెలక్ట్

ఆడి డ్రైవ్ సెలక్ట్

ఆడి డ్రైవ్ సెలక్ట్ సిస్టమ్ ద్వారా కంఫర్ట్, డైనమిక్ మరియు ఆటో మోడ్స్‌ను డ్రైవర్ ఎంచుకోవచ్చు. మనం ఎంచుకునే డ్రైవింగ్ మోడ్‌ను బట్టి స్టీరింగ్, సస్పెన్షన్, యాక్సిలరేటర్ పెడల్/ఇంజన్, ట్రాన్సిమిషన్‌లు ఆటోమేటిక్‌గా మనం ఎంచుకున్న మోడ్‌‌కు అనుగుణంగా అడ్జస్ట్ అవుతాయి.

ఆడి క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్

ఆడి క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్

క్వాట్రో అనేది ఆడి ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్, ఆడి ఈ సిస్టమ్‍‌ను తొలిసారిగా 1980 మార్చ్ 3వ తేదీన జరిగిన జెనీవా మోటార్ షో ద్వారా పరిచయం చేసింది. ఇదివరకు ఆడి తమ రోడ్/ర్యాలీ కారును క్వాట్రో అని పిలిచేది, ఆ కారును 1991 వరకు ఉత్పత్తి చేశారు. క్వాట్రో అంటే ఇటాలియన్ భాషలో నాలుగు అని అర్థం. ఈ జర్మన్ కార్ కంపెనీ ఇప్పుడు తమ అన్ని ఫోర్-వీల్ డ్రైవ్ మోడళ్లకు క్వాట్రో సిస్టమ్‌ను ఆఫర్ చేస్తుంది.

Most Read Articles

English summary
Audi, the German luxury car manufacturer, today announced the launch of the Audi Q3 Dynamic with Audi Drive Select in the Indian market. Loaded with exciting new features and priced at INR 38,40,000/- (ex-showroom Mumbai), the Audi Q3 Dynamic is available for sale across all dealerships in India.
Story first published: Thursday, September 11, 2014, 15:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X