డ్యూయెల్ టోన్ బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ విడుదల

బజాజ్ ఆటో అందిస్తున్న 'పల్సర్ 200ఎన్ఎస్'లో కంపెనీ కొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. బజాజ్ ఆటో ఇప్పుడు డ్యూయెల్ టోన్ (రెండు రంగుల కలయిక) కలర్స్‌తో కూడిన మూడు కొత్త కలర్ ఆప్షన్లను పల్సర్ 200ఎన్ఎస్‌లో ప్రవేశపెట్టింది.

కొత్త 2014 బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ మోడళ్లు ఇప్పుడు సఫైర్ బ్లూ అండ్ ఎబోనీ బ్లాక్, ప్యాషన్ రెడ్ అండ్ ఎబోనీ బ్లాక్ మరియు మెటాలిక్ వైట్ అండ్ ఎబోనీ బ్లాక్ అనే కొత్త రంగులలో లభిస్తుంది. ప్రస్తుతం పల్సర్ 200ఎన్ఎస్ బైక్ రూ.87,794 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకు లభ్యమవుతోంది. అనేక నగరాల్లో ఇది కేవలం రూ.1 లక్షకు దిగువనే లభిస్తుంది.

మరిన్ని వివరాలను, ఫొటోలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

డ్యూయెల్ టోన్ బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్

ఈ కొత్త పల్సర్ 200న్ఎస్‌లో కేవలం పెయింట్, బాడీ గ్రాఫిక్స్‌లలో మార్పులు తప్ప మరే మార్పులు లేవు. ఇందులో తొలిసారిగా ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీతో కూడిన లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్, 4-వాల్వ్, ఎస్ఓహెచ్‌సి 199.5సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఫలితంగా, బైక్ పనితీరు అద్భుతంగా ఉండడమే కాకుండా ఇది తక్కువ కర్బన వ్యర్థాలను విడుదల చేస్తుంది.

డ్యూయెల్ టోన్ బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్

పల్సర్ 200ఎన్ఎస్ మోటార్‌సైకిల్‌ను నడుపుతుంటే అసలైన స్పోర్ట్స్ బైక్‌ను నడుపుతున్న అనుభూతిని పొందుతున్నట్లు అనిపిస్తుంది. ఇంజన్ శబ్ధాన్ని తగ్గించేందుకు అంలేగే ఇంజన్ ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉంచేందుకు ఇందులో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.

డ్యూయెల్ టోన్ బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ బైక్‌‌లో ప్రపంచంలో మరెక్కడాని లేని విధంగా తొలిసారిగా ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీతో కూడిన లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్, 4-వాల్వ్, ఎస్ఓహెచ్‌సి 199.5సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9500 ఆర్‌పిఎమ్ వద్ద 23.52 పిఎస్‌ల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 18.3 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

డ్యూయెల్ టోన్ బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్‌ ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది. కొత్త పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్ కేవలం 3.8 సెకండ్లలోనే 0 నుండి 60 కి.మీ. వేగాన్ని, అలాగే 9.8 సెకన్లలో 0 నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

డ్యూయెల్ టోన్ బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్

పల్సర్ 200ఎన్ఎస్ గరిష్టంగా గంటకు 136 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది ఇంతటి శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉన్నప్పటికీ లీటర్ పెట్రోల్‌కు 58 కి.మీ (గంటకు 55 కి.మీ. వేగంతో వెళ్లినప్పుడు మాత్రమే) మైలేజీని కూడా ఇస్తుందని బజాజ్ ఆటో పేర్కొంది.

Most Read Articles

English summary
The 2014 model Bajaj Pulsar 200NS will be available in three new dual tone colours. These are: Safire Blue & Ebony Black; Passion Red & Ebony Black; Metallic White & Ebony Black.
Story first published: Tuesday, December 10, 2013, 14:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X