టెస్టింగ్ దశలో బజాజ్ ఆర్ఈ60 సిఎన్‌జి క్వాడ్రిసైకిల్

By Ravi

క్వాడ్రిసైకిల్స్‌ (నాలుగు చక్రాల వాహనాల)కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తెలపడంతో బజాజ్ ఆటో తమ ఆర్ఈ60 క్వాడ్రిసైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే, తమ సిఎన్‌జి వెర్షన్ బజాజ్ ఆర్ఈ60ని కంపెనీ పూనేకు సమీపంలో టెస్టింగ్ చేస్తోంది. కంపెనీ ఇప్పటికే రెగ్యులర్ పెట్రోల్ వెర్షన్ ఆర్ఈ60ని బజాజ్ గడచిన ఏడాదికి పైగా టెస్టింగ్ చేస్తోంది.

బజాజ్ ఆటో గడచిన 2012లో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ఆర్ఈ60 క్వాడ్రిసైకిల్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సాంప్రదాయ ఆటోరిక్షాలకు ప్రత్యామ్నాయంగా మరింత సౌకర్యవంతంగా, సురక్షితమైన ప్రయాణాన్ని ఆఫర్ చేసే విధంగా బజాజ్ ఆర్ఈ60 మార్కెట్లోకి రానుంది. అయితే, ఇది కేవలం కమర్షియల్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం మాత్రమే ఉపయోగించనున్నారు.

బజాజ్ ఆర్ఈ60 క్వాడ్రిసైకిల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

బజాజ్ ఆర్ఈ60 - ఇంజన్

బజాజ్ ఆర్ఈ60 - ఇంజన్

బజాజ్ ఆర్ఈ60 ఫోర్ వీలర్‌లో 200సీసీ డిటిఎస్-ఐ టెక్నాలజీతో కూడిన ఇంజన్‌ను అమర్చారు. టాటా నానో మాదిరిగానే ఆర్ఈ60 ఇంజన్ కూడా వెనకభాగంలోనే ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్లు వేగంతో పరుగులు తీస్తుంది.

బజాజ్ ఆర్ఈ60 - మైలేజ్

బజాజ్ ఆర్ఈ60 - మైలేజ్

బజాజ్ ఆర్ఈ60 లీటర్ పెట్రోల్‌కు 35 కి.మీ. మైలేజీనిస్తుంది. ఈ ఫోర్ వీలర్‌ను తొలుతగా పొరుగు దేశమైన శ్రీలంకకు ఎగుమతి చేయాలని కంపెనీ యోచిస్తోంది. సిఎన్‌జి వెర్షన్ విషయంలో ఇది మరింత ఎక్కువ ఉండే ఆస్కారం ఉంది.

బజాజ్ ఆర్ఈ60 - 2012 ఆటో ఎక్స్‌పో

బజాజ్ ఆర్ఈ60 - 2012 ఆటో ఎక్స్‌పో

బజాజ్ ఆటో తొలిసారిగా 2012 జనవరిలో న్యూఢిల్లీలో జరిగిన 11వ అంతర్జాతీయ ఆటో ప్రదర్శన సమయంలో తమ ఆర్ఈ60 క్వాడ్రిసైకిల్‌ను ప్రజలకు పరిచయం చేసింది. ఈ ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి బజాజ్ ఆటోకు నాలుగు సంవత్సరాల సమయం పట్టింది.

బజాజ్ ఆర్ఈ60 - ఫీచర్లు

బజాజ్ ఆర్ఈ60 - ఫీచర్లు

* 200సీసీ పెట్రోల్ ఇంజన్

* సిటీ ట్రాఫిక్‌లకు, రోడ్లకు చక్కగా సరిపోతుంది.

* గరిష్ట వేగం గంటకు 70 కి.మీ.

* ప్రకృతి సాన్నిహిత్యమైనది (ఎకో-ఫ్రెండ్లీ)

* ఫోర్ సీటర్ (నలుగురు ప్రయాణికులు సులువుగా ప్రయాణించవచ్చు)

బజాజ్ ఆర్ఈ60 - కొలతలు

బజాజ్ ఆర్ఈ60 - కొలతలు

* బజాజ్ ఆర్ఈ60 పొడవు x వెడల్పు x ఎత్తు : 2752 మి.మీ. x 1312 మి.మీ. x 1650 మి.మీ.

* బజాజ్ ఆర్ఈ60 మొత్తం బరువు: 400 కేజీలు

* కనీస టర్నింగ్ రేడియస్ - 3.5 మీటర్లు

* లగేజ్ (బూట్) స్పేస్ - 44 లీటర్లు

బజాజ్ ఆర్ఈ60 - ధర

బజాజ్ ఆర్ఈ60 - ధర

బజాజ్ ఆర్ఈ60 అంచనా ధర - రూ.1 లక్ష నుండి రూ.1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Most Read Articles

English summary
The launch of the Bajaj RE60 has been a reality soon, as the Government has approved for Quadricycles. The company is planning to launch this Quadricycle by end of this fiscal. Bajaj Auto is already testing RE60 on Indian roads.
Story first published: Wednesday, January 1, 2014, 17:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X