బెర్లిన్ వ్యాపారవేత్తను వరించిన తొలి ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

By Ravi

ప్రముఖ జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్, లీటరు ఇంధనానికి 100 కిలోమీటర్లకు పైగా మైలేజీనిచ్చేలా తయారు చేసిన ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు ఇతర కాన్సెప్ట్ కార్ల మాదిరిగా కేవలం కాన్సెప్ట్ దశకే పరిమితం కాకుండా, ఉత్పత్తి దశకు కూడా చేరుకుంది. అంతేకాదు, ఉత్పత్తి దశ దాటి మొదటి కస్టమర్ వద్దకు కూడా చేరిపోయింది.

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 తొలి హైబ్రిడ్ కారును బెర్లిన్‌కు చెందిన వ్యాపారవేత్తను వరించింది. మెక్‌కిన్సే అండ్ కంపెనీ డైరెక్టర్ డా. క్రిస్టియన్ మలోర్నీ మొట్టమొదటి ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 కారును కొనుగోలు చేశారు. జర్మనీలోని డ్రెస్డెన్‌లో ఉన్న ట్రాన్స్‌పరెంట్ ఫ్యాక్టరీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఫోక్స్‌వ్యాగన్ అధికారులు ఈ కారు తాళం చెవులను మలోర్నీకి అందజేశారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తొలి ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

తొలి ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారును అందుకుంటున్న మెక్‌కిన్సే అండ్ కంపెనీ డైరెక్టర్ డా. క్రిస్టియన్ మలోర్నీ.

తొలి ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

గత కొద్ది సంవత్సరాలుగా ఫోక్స్‌వ్యాగన్ తమ ఎక్ఎల్స్1 కాన్సెప్ట్‌పై పనిచేస్తోంది. తాజాగా.. గడచిన సంవత్సరం మార్చ్ నెలలో జెనీవాలో జరిగిన 83వ అంతర్జాతీయ మోటార్ షోలో ఇందులో ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న ప్రొడక్షన్ వెర్షన్‌ను ప్రదర్శించింది.

తొలి ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు డీజిల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో నడుస్తుంది. ఇందులో 47 బిహెచ్‌పి, ట్విన్-సిలిండర్, 800 సీసీ, టర్బో డీజిల్ ఇంజన్‌ను, అలాగే, 27 బిహెచ్‌పి ఎలక్ట్రిక్ మోటార్‌లను అమర్చారు.

తొలి ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

ఈ రెండు మోటార్లలో డీజిల్ ఇంజన్ రెగ్యులర్ డీజిల్‌తో నడుస్తుంది. ఇకపోతే ఎలక్ట్రిక్ మోటార్ మాత్రం కారులో అమర్చిన 5.5 కిలోవాట్ బ్యాటరీ సాయంతో నడుస్తుంది.

తొలి ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు బరువును తేలికంగా ఉంచేందుకు గానూ దీని బాడీ నిర్మాణంలో ఎక్కువ భాగం ధృఢమైన కార్బన్ ఫైబర్‌ను ఉపయోగించారు. ఫలితంగా ఈ కారు నుంచి అధిక మైలేజ్ రాబట్టడం సాధ్యమైంది.

తొలి ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు మొత్తం బరువు 795 కేజీలు మాత్రమే. ఈ కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు లీటరు ఇంధనానికి 111.16 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

తొలి ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 3.8 మీటర్ల పొడవును, 1.66 మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 159.9 కిలోమీటర్లు. ఇది 12.7 సెకండ్ల వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 160 కి.మీ.

తొలి ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 కారులో 10 లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ ఉంటుంది. ఈ ఇంధనం సాయంతో 49.8 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. డీజిల్, బ్యాటరీ పవర్‌తో కలిపి ఈ కారులో 499 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

తొలి ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

దీని ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ, ఇది లక్ష డాలర్లు ఉండొచ్చని అంచనా. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.54 లక్షలకు పైమాటే (పన్నులు కలుపుకోకుండా).

తొలి ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1

ఇలాంటి కార్లు ఇండియాకి కూడా వస్తే ఎంత బాగుంటుందో కదా..!

Most Read Articles

English summary
McKinsey & Company Director Dr. Christian Malorny has become the firs proud owner of the most fuel efficient Volkswagen ever made the XL1. German carmaker has handed over the keys to the first XL1 hybrid during an event held at the Transparent Factory in Dresden, Germany.
Story first published: Saturday, June 7, 2014, 10:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X