బిఎమ్‌డబ్ల్యూ 1-సిరీస్ ఎమ్ పెర్ఫార్మెన్స్ ఎడిషన్ విడుదల

By Ravi

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ తమ సరికొత్త ఎంట్రీ లెవల్ పెర్ఫార్మెన్స్ లగ్జరీ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎమ్ (M) పెర్ఫార్మెన్స్ ప్యాకేజ్‌తో కూడిన బిఎమ్‌డబ్ల్యూ 1-సిరీస్ ఎమ్ ఎడిషన్ (BMW 1-Series M Edition)ను కంపెనీ ప్రవేశపెట్టింది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతుంది.

పెట్రోల్ వెర్షన్‌లో 1.6 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 136 హెచ్‌పిల శక్తిని, 220 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8.7 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.


డీజిల్ వెర్షన్‌లో 2.0 లీటర్, 4-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 143 హెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8.6 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

పరిమిత కాలం మాత్రమే బిఎమ్‌డబ్ల్యూ 1-సిరీస్ ఎమ్ ఎడిషన్ లభిస్తుందని, కేవలం 111 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఇంప్రూవ్డ్ ఏరోడైనమిక్ ప్యాకేజ్‌తో కొడ్డ 1-సిరీస్ ఎమ్ పెర్ఫార్మెన్స్ ఎడిషన్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఈ ఏరోడైనమిక్ ప్యాకేజ్‌లో స్పాయిలర్ విత్ ఫిన్స్, రేసింగ్ స్ట్రైప్స్, బ్లాక్ కలర్ ఫ్రంట్ గ్రిల్, ఎమ్ పెర్ఫార్మెన్స్ బ్యాడ్జ్ వంటి ఫీచర్లు దీని సొంతం.

BMW 1 Series M Performance Edition Launched In India

సెప్టెంబర్ 2013లో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తొలిసారిగా తమ 1-సిరీస్ మోడల్‌ను విడుదల చేసింది. మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్‌కు పోటీగా దీనిని ప్రవేశపెట్టారు. అయితే, మెర్సిడెస్ బెంజ్ ఇటీవల తమ ఏ-క్లాస్‌లో ఎడిషన్ 1 మోడల్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో, బిఎమ్‌డబ్ల్యూ కూడా ఈ 1-సిరీస్ ఎమ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టడం గమనార్హం.
Most Read Articles

English summary
BMW India has launched its 1 Series M Performance Edition, which will be surprisingly available in both petrol and diesel option. The German manufacturer had began promoting its performance variant of the 1 Series from the month of July itself.
Story first published: Friday, August 1, 2014, 13:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X