మేడ్ ఇన్ ఇండియా బిఎమ్‌‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి విడుదల

By Ravi

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, భారత మార్కెట్లో ఓ సరికొత్త 3 సిరీస్ జిటి (గ్రాన్ తురిస్మో) కారును విడుదల చేయనున్నట్లు గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. స్థానికంగా భారత్‌లో తయారు చేసిన 'బిఎమ్‌డబ్ల్యూ 3 సీరీస్‌ గ్రాన్‌ తురిస్మో' (BMW 3 Series Gran Turismo) మోడల్‌ను దేశీయ విపణిలో విడుల చేసింది.

ఇది కూడా చదవండి: రూ.4 లక్షలకు దిగువన రెనో స్మాల్ కార్

భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ నుంచి వచ్చి ఈ లేటెస్ట్ కారు ధర రూ.42.75 లక్షలు (ఎక్స్షోరూమ్)గా ఉంది. ఈ కొత్త కారును చెన్నైకి సమీపంలోని మహీంద్రా వరల్డ్ సిటీ సింగపూర్‌ కోయిల్‌ వద్ద ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఉత్పత్తి కేంద్రంలో తయారు చేస్తున్నారు. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఇప్పటికే భారత మార్కెట్లో 5 సిరీస్ జిటి కారును అందిస్తోంది.

తాజాగా వచ్చిన ఈ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి తక్కువ ధరకే ఎస్‌యూవీలోని స్పేస్‌ను, సెడాన్‌లోని ఫీల్‌ను ఆఫర్ చేస్తుంది. ఇది 5 సిరీస్ జిటి కన్నా అత్యధికంగా అమ్ముడుపోతుందని అంచనా. బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌‌లో పరిశీలించండి.

బిఎమ్‌‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి విడుదల

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి రెండు వేరియంట్లలో మాత్రమే లభ్యం కానుంది. ఇందులో 2.0 లీటర్ ట్విన్ టర్బో, ఫోర్ సిలిండర్ కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 7.9 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 226 కి.మీ.

బిఎమ్‌‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి దాని సెడాన్ వెర్షన్ కన్నా పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. సెడాన్ వెర్షన్‌తో పోల్చుకుంటే ఇది 200 మి.మీ. పొడవును, 50 మి.మీ. ఎత్తును, 17 మి.మీ. వెడల్పును కలిగి ఉంటుంది. అంటే ఇది బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 కాంపాక్ట్ ఎస్‌యూవీ కన్నా విశాలంగా ఉంటుందన్నమాట.

బిఎమ్‌‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి బూట్ డోర్ స్కొడా ర్యాపిడ్ స్పేస్‌బ్యాక్ మాదిరిగా ఓపెన్ అవుతుంది. అంటే, ఇందులోని వెనుక అద్దం కూడా బూట్ డోరుకే అమర్చబడి ఉంటుంది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, వెనుక బంపర్ క్రింద కాలును గాలిలో ఊపితే చాలు బూట్ డోర్ తెరచుకుంటుంది.

బిఎమ్‌‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి విడుదల

బ్రాడ్ రియర్ ఎండ్ కలిగిన జిటి వెర్షన్ కొంచెం బోల్డ్‌గా కనిపిస్తుంది, సెడాన్‌ను ఉపయోగించేవారు దీనికి అలవాటు పడాల్సి ఉంటుంది. 3 సిరీస్ జిటి సెడాన్‌తో పోల్చుకుంటే మంచి కంఫర్ట్ రైడ్‌ను అందిస్తుంది.

బిఎమ్‌‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి విడుదల

ఇక ఇంటీరియర్ ఎక్విప్‌మెంట్స్ విషయానికి వస్తే, 3 సిరీస్ సెడాన్లో లభ్యమవుతున్న అన్ని రకాలు ఫీచర్లు కూడా ఇందులో లభ్యం కానున్నాయి.

Most Read Articles

English summary
BMW has a visible presence in the Indian market. In their commitment to make their luxury cars more accessible to customers, they will be offering their 3 Series Gran Turismo. This car will be locally manufactured and will attract a price of Rs. 42.75 lakhs.
Story first published: Monday, March 17, 2014, 18:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X