బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల; ధర, ఫీచర్లు

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న 5-సిరీస్ లగ్జరీ కారులో ఓ కొత్త రిఫ్రెష్డ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ లగ్జరీ కారు 3 ఇంజన్ ఆప్షన్లతో మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. భారత మార్కెట్లో కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ప్రారంభ ధర రూ.46.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ కారులో కిడ్నీ గ్రిల్, సైడ్ విండో ఫ్రేమ్స్, టైల్ పైప్ టిప్, ఫాగ్ ల్యాంప్ సరౌండ్స్‌ను కొత్తగా డిజైన్ చేశారు. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ లోవర్-ఎయిర్ డ్యామ్‌ను రీస్టయిల్ చేశారు. వెనుక వైపు డిజైన్‌లోను అలాగే ఇంటీరియర్స్‌లోను స్వల్ప మార్పులు చేర్పులు న్నాయి. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

వేరియంట్లు, ధరలు

వేరియంట్లు, ధరలు

* బిఎమ్‌డబ్ల్యూ 520డి మోడ్రన్: రూ. 46.9 లక్షలు

* బిఎమ్‌డబ్ల్యూ 520డి లగ్జరీ: రూ. 46.9 లక్షలు

* బిఎమ్‌డబ్ల్యూ 525డి లగ్జరీ ప్లస్: రూ. 51.9 లక్షలు

* బిఎమ్‌డబ్ల్యూ 530డి ఎమ్ స్పోర్ట్: రూ. 57.9 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

బిఎమ్‌డబ్ల్యూ 530డి ఎమ్ స్పోర్ట్

బిఎమ్‌డబ్ల్యూ 530డి ఎమ్ స్పోర్ట్

ఈ వేరియంట్‌లో పవర్‌ఫుల్ 3.0 లీటర్ ట్విన్ పవర్ టర్బో ఇన్‌లైన్ సిక్స్-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 258 హెచ్‌పిల శక్తిని, 540 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.8 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కి.మీ.

బిఎమ్‌డబ్ల్యూ 525డి

బిఎమ్‌డబ్ల్యూ 525డి

ఈ వేరియంట్‌లో 2.0 లీటర్ ట్విన్ పవర్ టర్బో ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 218 హెచ్‌పిల శక్తిని, 450 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6.9 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 243 కి.మీ.

బిఎమ్‌డబ్ల్యూ 520డి

బిఎమ్‌డబ్ల్యూ 520డి

ఈ వేరియంట్‌లో 2.0 లీటర్ ట్విన్ పవర్ టర్బో ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 184 హెచ్‌పిల శక్తిని, 380 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 7.9 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 231 కి.మీ.

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ బ్లాక్ సఫైర్, కాలిస్టో గ్రే, కార్బన్ బ్లాక్ మెటాలిక్, క్యాష్‌మియర్ సిల్వర్, గ్లాసీయర్ సిల్వర్, ఇంపీరియల్ బ్లూ బ్రిలియంట్ ఎఫెక్ట్, జటోబా, సోఫిస్టో గ్రే బ్రిలియంట్ ఎఫెక్ట్, మినరల్ వైట్ వంటి మెటాలిక్ రంగులలో లభిస్తుంది. ఆల్పైన్ వైట్ మాత్రం నాన్ మెటాలిక్ రంగులో లభిస్తుంది.

స్టాండర్డ్ ఫీచర్స్

స్టాండర్డ్ ఫీచర్స్

అన్ని వేరియంట్లలో యాక్టివ్ ప్రొటెక్షన్ విత్ అటెన్షన్ అసిస్ట్, యాక్టివ్ హెడ్‌రెస్ట్ (ఫ్రంట్), డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (డిఎస్‌సి) విత్ డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ (డిటిసి), సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ మరియు వార్నింగ్ ట్రైయాంగిల్, ఫస్ట్ ఎయిడ్ కిట్. ఆటో స్టార్ట్-స్టాప్, ఈకో ప్రో మోడ్, బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్, నెక్స్ట్ జెనరేషన్ బిఎమ్‌డబ్ల్యూ ఐడ్రైవ్ (ఆన్-బోర్డ్ డ్రైవర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్), హార్మన్ కార్డన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, బ్లూటూత్ మరియు యూఎస్‌బి కనెక్టివిటీ ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తాయి.

అదనపు ఫీచర్లు

అదనపు ఫీచర్లు

ఈ స్టాండర్డ్ ఫీచర్లకు అదనంగా, 525డి లగ్జరీ ప్లస్, 530డి ఎమ్ స్పోర్ట్ వేరియంట్లలో బిఎమ్‌డబ్ల్యూ యాప్స్, బిఎమ్‌డబ్ల్యూ నావిగేషన్ ప్రొఫెషనల్ (ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ - జపిఎస్), 25.9 సెంటీమీటర్ కలర్ డిస్‌ప్లే, ఐడ్రైవ్ విత్ టచ్ కంట్రోలర్, డివిడి డ్రైవ్ మరియు మ్యాప్స్, ఆడియో ఫైల్స్ కోసం ఇంటిగ్రేటెడ్ హార్డ్ డ్రైవ్ ఫీచర్లు లభిస్తాయి.

Most Read Articles

English summary
BMW has introduced the facelifted 5 Series luxury sedan in India. The updated model comes with three engine options and four variants. The new 5 Series lineup has a starting price of INR 46.90 lakhs. BMW 5 Series facelift adds a host of visual changes.
Story first published: Thursday, October 10, 2013, 17:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X