ఏప్రిల్ 25న రానున్న బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా భారత మార్కెట్లో అందిస్తున్న లగ్జరీ సెడాన్ 'బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్'లో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం లభిస్తున్న 7-సిరీస్ కన్నా మరింత మెరుగైన ఫీచర్లను, అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని జోడించి అప్‌గ్రేడ్ చేసిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఈనెల 25న కంపెనీ దేశీయ విపణిలో విడుదల చేయనుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఇండియాకు 7-సిరీస్ లగ్జరీ సెడాన్ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. ఈ నేపథ్యంలో, ఇందులో అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టడం ద్వారా ఈ మోడల్ అమ్మకాలను మరింతగా పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఏప్రిల్ 25, 2013వ తేదీన భారత మార్కెట్లో విడుదల కానున్న ఈ సరికొత్త 7-సిరీస్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్లలో అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి.

ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినవి రివైజ్డ్ ఫ్రంట్ డిజైన్, కొత్త ఫాగ్ ల్యాంప్స్, మరింత అప్‌రైట్ కిడ్నీ గ్రిల్, ఫుల్ అడాప్టివ్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, బూట్‌లిడ్‌పై క్రోమ్ స్ట్రిప్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను గమనించవచ్చు. ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో ఫ్రంట్ సీట్లను కాస్త చిన్నవి చేశారు అలాగే వెనుక సీట్లను మరింత మెరుగుపరచారు.

2013 బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్‌లో కొత్త డిజిటల్ డిస్‌ప్లే సిస్టమ్‌ను అమర్చారు, డ్రైవింగ్ మోడ్‌ను మార్చినప్పుడు ఇందులోని స్క్రీన్ కలర్ కూడా మారుతుంది. ఐడ్రైవ్ సిస్టమ్ మరియు 3డి నావిగేషన్ మ్యాప్స్ కోసం కూడా ఈ కారులో 10.25 ఇంచ్ ఎల్‌సిడి డిస్‌ప్లే స్క్రీన్ ఉంటుంది. భారత్‌లో 730ఎల్‌డి, 740ఎల్ఐ వేరియంట్లు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ కొత్త వేరియంట్లలో ఇది వరకటి ఇంజన్లనే రీట్యూన్ చేసి ఉపయోగించారు. ఈ ఇంజన్ల సామర్థ్యాలలో స్వల్పంగా మార్పులు ఉన్నాయి. 2013 బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ డీజిల్ ఇంజన్ సామర్థ్యాన్ని స్వల్పంగా పెంచగా, పెట్రోల్ వెర్షన్ మైలేజీని 21 శాతం మెరుగుపరచినట్లు కంపెనీ పేర్కొంది. ఈ రెండు వేరియంట్లు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (8 ఆటోమేటిక్ గేర్లు)తో లభిస్తాయి. ఈ కొత్త కారుకు సంబంధించిన మరింత సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌‌ను గమనిస్తూనే ఉండండి.

2013 బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్

2013 బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్

2013 బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్

2013 బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్

2013 బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్

2013 బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్

2013 బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్

2013 బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్

2013 బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్

2013 బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్

2013 బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్

2013 బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్

Most Read Articles

English summary
German luxury carmaker BMW India is all set launch the facelift version 7-series in India. The new upgraded BMW 7-series is slated to launch on April 25, 2013. The new car gets revised interiors and exteriors. Stay tuned to Drivespark for more details.
Story first published: Wednesday, April 17, 2013, 8:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X