ఫిబ్రవరి 18న బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు విడుదల

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న హైబ్రిడ్ స్పోర్ట్స్ కార్ 'బిఎమ్‌డబ్ల్యూ ఐ8' (BMW i8)ను కంపెనీ గడచిన సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడు ఈ మోడల్‌ను రానున్న ఫిబ్రవరి నెలలో మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు ఫిబ్రవరి 18, 2015వ తేదీన మార్కెట్లో విడుదల కానుంది. అయితే, బిఎమ్‌డబ్ల్యూ ఈ మోడల్ కార్లను చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే ఇండియాకు కేటాయించినట్లు సమాచారం.

పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే ఈ హైటెక్ స్పోర్ట్స్ కారును ధృడమైన కార్బన్ బాడీతో తయారు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆకర్షనీయమైన లుక్, సరికొత్త స్టయిల్‌తో డిజైన్ చేసిన ఈ కారు, ఓ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కార్.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఫిబ్రవరి 18న బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ స్పోర్ట్స్ కారులో ఓ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు, ఇది డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్ ద్వారా రియర్ యాక్సిల్ (వెనుక చక్రాల)‌కు పవర్‌ను చేరవేస్తుంది. అలాగే, ఇందులో అమర్చిన 125 హార్స్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ ఫ్రంట్ యాక్సిల్ (ముందు చక్రాల)కు పవర్‌ను చేరవేస్తుంది.

ఫిబ్రవరి 18న బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు విడుదల

పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్లు రెండూ కలిపి మొత్తం 349 హెచ్‌పిల శక్తిని, 550 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

ఫిబ్రవరి 18న బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కారును పూర్తిగా పెట్రోల్ ఇంజన్‌తో కానీ లేదా పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తో కానీ లేదా రెండింటిని కలిపి ఒకేసారిగా కానీ ఉపయోగించి డ్రైవ్ చేయవచ్చు.

ఫిబ్రవరి 18న బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు విడుదల

బిఎమ్‌డబ్ల్యూ భవిష్యత్తులో తయారు చేయనున్న అన్ని ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్ల యొక్క డ్రైవ్ టెక్నాలజీ కోసం "ఈ-డ్రైవ్" (eDrive)ను ఉపయోగిస్తుంది. ఐ8లో కూడా ఇదే టెక్నాలజీని ఉపయోగించారు.

ఫిబ్రవరి 18న బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు విడుదల

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే (బహుశా 7 లేదా 8 యూనిట్లు) లభ్యం కానుంది. ఈ మోడల్‌ను పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, ఇండియాకు దిగుమతి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో, దీని ధర సుమారు రూ.1.5 కోట్లు ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
BMW India will launch the highly anticipated i8 hybrid supercar on February 18. The launch will take place in Mumbai. Stay tuned for latest updates.
Story first published: Thursday, January 29, 2015, 15:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X