భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎక్స్‌పెడిషన్ విడుదల

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ 5-సిరీస్ ఎస్‌యూవీలో సరసమైన ధరకే ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎక్స్‌పెడిషన్ (BMW X5 Expedition)గా పిలిచే ఈ వేరియంట్ ధర రూ.64.09 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇది కేవలం 5-సీటర్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది.

ఇది కూడా చదవండి: సంగీతాన్ని వినిపించే ఇంజన్

రెగ్యులర్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 వేరియంట్లో కొన్ని ఫీచర్లను తగ్గించి, ఈ ఎక్స్5 ఎక్స్‌పెడిషన్‌ను తయారు చేశారు. ఇందులో ఎల్ఈడి అడాప్టివ్ హెడ్‌లైట్స్, ఎల్ఈడి ఫాగ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఇందులో కనిపించవు. అలాగే, 16 స్పీకర్ ఆడియో సిస్టమ్‌కు బదులుగా 9 స్పీకర్ హార్మన్ ఆడియో సిస్టమ్‌ను ఇందులో ఆఫర్ చేస్తున్నారు.


ఇందులో బిఎమ్‌డబ్ల్యూ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉండదు, అలాగే మ్యూజిక్ సిస్టమ్‌లో సిడి ప్లేయర్, హార్డ్ డ్రైవ్, యాప్స్ వంటి ఫీచర్లు ఉండవు. డ్రైవర్ మరియు ప్యాసింజర్ సీట్లకు ఎలక్ట్రిక్ లంబార్ సపోర్ట్‌ను తొలగించారు.

ఇది కూడా చదవండి: ఆగస్ట్ 5న ఫియట్ పుంటో ఇవో విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎక్స్‌పెడిషన్ వేరియంట్లో అదే 3.0 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 254 హెచ్‌పిల శక్తిని, 560 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా.. నార్మల్ స్టెప్‌ట్రానిక్ ట్రాన్సిమిషన్‌కు బదులుగా ఇందులో8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ ఆటో ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు.

BMW Launch X5 Expedition In India

లాంచ్ కంట్రోల్, ప్యాడల్ షిఫ్టర్స్‌ను కూడా ఇందులో తొలగించారు. అయినప్పటికీ, ఇది 6.9 సెకండ్ల వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఇది లీటరుకు 15 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఇది కూడా చదవండి: 2015లో కొత్త ఫోర్డ్ ఫిగో విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎక్స్‌పెడిషన్ వేరియంట్లో కొన్ని ఫీచర్లను కంపెనీ తొలగించినప్పటికీ, సేఫ్టీ విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడలేదు. రెగ్యులర్ ఎక్స్5లో లభించే అన్ని సేఫ్టీ ఫీచర్లను ఈ చవక ఎక్స్5 ఎక్స్‌పెడిషన్ వేరియంట్లోను ఆఫర్ చేస్తున్నారు.

ఈ వీడియో చూశారా...
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/Y7n3X2h_N3k?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
BMW India is a launch spree and post their recent launch of its 7-Series ActiveHybrid. They have launched an affordable variant of the X5 dubbed as Expedition. It will be available only as a five seater option and will cost INR 64,09,000 ex-showroom.&#13;
Story first published: Thursday, July 31, 2014, 9:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X