బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 స్థానిక ఉత్పత్తి షురూ, డెలివరీలు ప్రారంభం

By Ravi

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, గడచిన మే నెలలో దేశీయ విపణిలో విడుదల చేసిన తమ సరికొత్త అప్‌డేటెడ్ 2014 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీని, ఇప్పుడు ఇండియాలోనే అసెంబ్లింగ్ చేస్తోంది. ఇందులో డీజిల్ వేరియంట్‌ను తమిళనాడులోని చెన్నైలో ఉన్న తమ ప్లాంట్‌‌లోనే అసెంబ్లింగ్ చేయటం ప్రారంభించామని, ఈనెలాఖరు నాటికి డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా విడుదల చేసిన ఈ కొత్త కొత్త ఎక్స్5 ఎస్‌యూవీ మూడవ తరాని (థర్డ్ జనరేషన్)కి చెందినది. మునుపటి వెర్షన్ కన్నా ఇది మరింత ప్రీమియంగా ఉంటుంది. ఈ కొత్త మోడల్‌కు అనూహ్య రీతిలో స్పందన లభించడంతో ప్రస్తుతం దీని వెయిటింగ్ పీరియడ్ మూడు నెలల వరకు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. దేశీయ విపణిలో ఈ కొత్త 2014 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ధరను రూ.70.9 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు.


కొత్త 2014 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5లో 3.0 లీటర్ (2993సీసీ), ఇన్-లైన్ 6-సిలిండల్, ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు ఈ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 258 హెచ్‌పిల శక్తిని, 1500-3000 ఆర్‌ప్ఎమ్ వద్ద 560 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

పెద్ద గ్రిల్, పెద్ద హెడ్‌లైట్స్, ఇంప్రూవ్డ్ డ్యాష్‌బోర్డ్, ఉడెన్ ఫినిషింగ్, 10.5 ఇంచ్ ఐడ్రైవ్ స్క్రీన్, రివర్సింగ్ కెమెరా, హైక్వాలిటీ సీట్స్ వంటి పలు అప్‌గ్రేడ్స్ ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌5లో ప్రధానంగా చెప్పుకోదగినవి. ఇది మునుపటి వెర్షన్ కన్నా మరింత పెద్దదిగా, బోల్డ్‌గా మరియు స్పోర్టీయర్‌గా అనిపిస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తొలిసారిగా తమ సరికొత్త ఎక్స్5 మోడల్‌ను భారత్‌కు పరిచయం చేసింది.

BMW X5 2014

ఇంకా ఇందులో పానోరామిక్ సన్‌రూఫ్, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, 3 కలర్లలో యాంబీంట్ లైటింగ్ వంటి ఫీచర్లతో పాటుగా కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (సిబిసి), డైనమిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (డిఎస్‌సి), రన్ ఫ్లాట్ టైర్స్, ఫ్రంట్ అండ్ రియర్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్, ఫ్రంట్ అండ్ రియర్ హెడ్ ఎయిర్‌బ్యాగ్స్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి
Most Read Articles

English summary
BMW India has rolled out a diesel variant of its locally manufactured Sports Utility Vehicle, X5, from its Chennai plant at an ex-showroom price of Rs 70.9 lakh. The SUV will initially only be available in the xDrive 30d Pure Design Experience trim - other variants will follow.
Story first published: Friday, June 27, 2014, 8:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X