400వ బుగాటి వేరాన్ అమ్మకం; ఇక మిగిలినవి 50 మాత్రమే

త్వరపడండి.. ఇక 50 కార్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవును ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే కారు అయిన బుగాటి వేరాన్ ఉత్పత్తి త్వరలోనే నిలిచిపోనుంది. 2005లో తొలిసారిగా మార్కెట్లను తాకిన ఈ కారు ఉత్పత్తి తుది దశకు చేరుకోనుంది. బుగాటి మొత్తం 450 వేరాన్ కార్లను మాత్రమే తయారు చేయనుంది. కాగా.. ఇప్పటే కంపెనీ 399 బుగాటి వేరాన్ కార్లను విక్రయించింది.

తాజాగా.. ఇటీవలే బుగాటి తమ 400వ వేరాన్ కారును విక్రయించింది. 400వ వేరాన్ స్పెషల్ ఎడిషన్ గ్రాండ్ స్పోర్ట్ విటెస్ కావటం విశేషం. బుగాటి లెజెండ్ సిరీస్‌లో భాగంగా కంపెనీ తయారు చేసిన మూడు ఎక్స్‌క్లూజివ్ 'జీన్-పీరే విమిల్లె' మోడళ్లలో ఇదే చివరిది. ఈ అరుదైన ఆల్ట్రా ఎక్స్‌క్లూజివ్ గ్రాండ్ స్పోర్ట్ విటెస్సె రోడ్‌స్టర్ కారును మిడిల్ ఈస్ట్ చెందిన కస్టమర్ కొనుగోలు చేశాడు.

మరిన్ని వివరాలను క్రింది ఫొటో పీచర్‌లో పరిశీలించండి.

బుగాటి వేరాన్

సూపర్‌కార్ కంపెనీలు తమ మోడళ్లలో ఎక్స్‌క్లూజివిటీని మెయింటైన్ చేయటం కోసం ఉత్పత్తిని పరిమితం చేస్తుంటారు. అలాగే, బుగాటి కూడా తమ వేరాన్ ఉత్పత్తిని కేవలం 450 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఇందులో ఇప్పటికే 400 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక మిగిలినవి 50 యూనిట్లు మాత్రమే.

బుగాటి వేరాన్

బుగాటి వేరాన్‌లో నాలుగు రకాల వేరియంట్లు ఉన్నాయి, అవి - 1101 పిఎస్ వేరాన్, 2005 మోడల్ 16.4, వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ మరియు 2008 మోడల్ ఒరిజినల్ వేరాన్ యొక్క రోడ్‌స్టర్ వెర్షన్.

బుగాటి వేరాన్

ఇందులో ఫాస్టెస్ట్ ప్రొడక్షన్ కారు 1200 పిఎస్ వేరాన్ సూపర్ స్పోర్ట్. ఇది 2010 మోడల్. ఫాస్టెస్ట్ ఓపెన్‌టాప్ ప్రొడక్షన్ కారు విషయానికి వస్తే, అది వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ విటెస్స్. ఇది 2012 మోడల్.

బుగాటి వేరాన్

కూపే వెర్షన్ వేరాన్ల ఉత్పత్తిని 300 యూనిట్లకు పరిమితం చేశారు కాబట్టి ఈ వెర్షన్ మోడళ్లు అప్పుడే ఖాలీ అయిపోయాయి. ఇక మిగిలినవి 150 యూనిట్లు రోడ్‌స్టర్ వెర్షన్లు. వీటిలో ఇప్పటికే 100 యూనిట్లు అమ్ముడుపోయాయి. అంటే, ఇక చివరికి మిగిలినవి 50 యూనిట్ల వేరాన్ రోడ్‌స్టర్ వెర్షన్లు మాత్రమే.

బుగాటి వేరాన్

బుగాటి వేరాన్ కారులో 8.0 లీటర్, డబ్ల్యూ16 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇప్పటి వరకు ఇదే అత్యంత వేగవంతమైన ప్రొడక్షన్ వెర్షన్ కారుగా గిన్నిస్ రికార్డును కలిగి ఉంది.

Most Read Articles

English summary
One of the greatest cars in automotive history is nearing its end. Production of Bugatti Veyron, the monster of a supercar, which was conceived in 2005, will come to an end in the near future as production inches towards its stipulated production limit. Bugatti recently sold the 400th Veyron, a Grand Sport Vitesse. 
Story first published: Monday, December 9, 2013, 16:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X