అద్దెకు మహీంద్రా ఈ2ఓ; రోజుకు రూ.800 మాత్రమే

By Ravi

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారును కొనడానికి మీ దగ్గర అంత డబ్బులు లేవా..? అయితే, అద్దెకు తీసుకోండి, అద్దె రోజుకు కేవలం 800 రూపాయలు మాత్రమే. ఆశ్చర్యంగా ఉంది. ఈ2ఓ ఎలక్ట్రిక్ కారును అద్దెకు ఇచ్చేందుకు మహీంద్రా గ్రూపుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విభాగం మహీంద్రా రేవా (Mahindra Reva), ప్రముఖ క్యాబ్ రెంటల్ సంస్థ కార్జాన్‌రెంట్ (Carzonrent) చేతులు కలిపాయి.

ఈ ఒప్పందంలో భాగంగా, రేవా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారును సైకిళ్ల మాదిరిగా రోజు బాడుగకు తీసుకోవచ్చు. మీకు డ్రైవింగ్, వచ్చి చెల్లుబాటైన లైసెన్స్ కలిగి ఉంటే చాలు, మీరే స్వయంగా ఈ కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు. కార్జాన్‌రెంట్ 24 గంటల కోసం రూ.800 అద్దెను వసూలు చేస్తుంది. ఈ ఆఫర్ ప్రస్తుతానికి న్యూఢిల్లీ, ముంబై, బెంగుళూరు నగరాల్లో మాత్రమే అక్టోబర్ 1, 2013 నుంచి అందుబాటులో ఉండనుంది.

త్వరలోనే ఈ పథకాన్ని అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇరు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ప్రతి నగరంలో ఐదు మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కార్లను ఈ స్కీమ్ కోసం కార్జాన్‌రెంట్ అందుబాటులో ఉంచింది. మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

అద్దెకు మహీంద్రా ఈ2ఓ; రోజుకు రూ.800 మాత్రమే

ఈ సందర్భంగా, మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ చేతన్ మియానీ మాట్లాడుతూ.. కార్జాన్‌రెంట్‌తో అసోసియేషన్ ద్వారా మహీంద్రా ఈ2ఓ గురించి, అది అందించే విలువైన ప్రయోజనాల గురించి కస్టమర్లలో అవగాహన కలుగుతుందని అన్నారు.

అద్దెకు మహీంద్రా ఈ2ఓ

ఇతర సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు అయ్యే అద్దెతో పోల్చుకుంటే, మహీంద్రా ఈ2ఓ అద్దెకు అయ్యే ఖర్చు మూడు వంతులు తక్కువగా ఉంటుందని, సెల్ఫ్-డ్రైవ్ బిజినెస్‌లో ఇది కొత్త విప్లవానికి నాంది పలుకుతుందని, సిటీ ప్రయాణికులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తుందని కార్జాన్‌రెంట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రాజీవ్ తెలిపారు.

మహీంద్రా ఈ2ఓ క్లుప్తంగా..

మహీంద్రా ఈ2ఓ క్లుప్తంగా..

మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ మోటార్ల సాయంతో నడుస్తుంది. ఇందులో లిథియం ఐయాన్ బ్యాటరీలను ఉపయోగించారు. ఇవి సాంప్రదాయ ఏసిడ్ బ్యాటరీలతో పోల్చుకుంటే 4 రెట్లు తేలికైనవి మరియు 3 రెట్లు సౌకర్యవంతమైనవే కాకుండా మంచి పెర్ఫామెన్స్‌ను, బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉంటాయి.

మహీంద్రా ఈ2ఓ

ఈ బ్యాటరీలు కేవలం 5 గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతాయి. ఇందులో ఉపయోగించిన బ్యాటరీల శక్తి సాధారణ సెల్‌ఫోన్లలో ఉపయోగించే 3-4 వేల బ్యాటరీలలో ఉండే శక్తితో సమానం. పూర్తి ఛార్జ్‌పై 100 కిలోమీటర్ల రేంజ్ వరకూ ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.

మహీంద్రా ఈ2ఓ

ఈ కారును ఐఫోన్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ వంటి స్మార్ట్ ఫోన్లతో కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా మహీంద్రా ఈ2ఓ కారును కంట్రోల్ చేయవచ్చు. ఒకవేళ పార్కింగ్ స్థలంలో కారును లాక్ చేయటం మర్చిపోయి వెళ్లిపోతే స్మార్ట్ ఫోన్ మొబైల్ స్క్రీన్‌పై ఒక్క బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా కారును లాక్ చేయవచ్చు.

మహీంద్రా ఈ2ఓ

కారును ఎండలో పార్క్ చేసినపుడు కారు లోపలి వాతావరణ వేడెక్కుతుంది, అయితే ఈ2ఓ కారులో ఉండే ఏసిని మొబైల్ ద్వారా కంట్రోల్ చేసి మీరు తిరిగి వెళ్లడానికి కొద్దినిమిషాల ముందు కారులో ఏసిని మొబైల్ ద్వారా ఆన్ చేసుకొని చల్లగా ప్రయాణించవచ్చు. ఇదే విధంగా శీతాకాలంలో కూడా బయలుదేరడానికి ముందే కారు లోపలి హీటర్‌ను మొబైల్ ద్వారా ఆన్ చేసుకొని వెచ్చగా ప్రయాణించవచ్చు.

మహీంద్రా ఈ2ఓ

ఒకవేళ మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీ ఛార్జ్ పూర్తిగా ఖాలీ అయిపోతే, రివైవ్ అనే బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా సుమారు 8-10 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

మహీంద్రా ఈ2ఓ

ఈ కారులో 6.2 ఇంచ్ టచ్‌స్క్రీన్ మల్టీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఎమ్‌పి3, ఆడియో వీడియో ప్లేయర్ మాదిరిగా పనిచేయటమేకాకుండా, కారులోని కంప్యూటింగ్ సిస్టమ్‌కు దీనిని అనుసంధానం చేయటం జరుగుతుంది. ఇది నావిగేషన్ సిస్టమ్‌లా కూడా పనిచేస్తుంది.

మహీంద్రా ఈ2ఓ

ఈ అధునాత నావిగేషన్ సిస్టమ్ సాయంతో, కారులోని బ్యాటరీ సాయంతో ఎంత దూరం ప్రయాణించవచ్చు, ప్రయాణించే మార్గంలో ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడున్నాయ్, సింగిల్ ట్రిప్‌లో ఎంత దూరం ప్రయాణించవచ్చు, రౌండప్‌ ట్రిప్‌లో ఎంత దూరం ప్రయాణించవచ్చు తదితర విషయాలను తెలుసుకోవచ్చు.

మహీంద్రా ఈ2ఓ

ఇది పూర్తిగా ఆటోమేటిక్ కారు (క్లచ్‌, గేర్లు ఉండవు). ఇది కేవలం 3.9 మీటర్ల టర్నింగ్ రేడియస్‌ను మాత్రమే కలిగి ఉండి, సిటీ రోడ్లకు చక్కగా సరిపోతుంది. ఈ కారులో ఎత్తుగా ఉండే రోడ్లపై సౌకర్యవంతమైన ప్రయాణం కోసం హిల్ హోల్డ్ ఫీచర్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా ఈ2ఓ

ఏసి ఆన్‌లో ఉన్నప్పటికీ కారు పవర్, యాక్సిలరేషన్ తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ కారులోని బ్యాటరీలను తొలిసారిగా సౌరశక్తితో (సోలార్ ఎనర్జీ) ఛార్జ్ చేస్తారు.

Most Read Articles

English summary
Carzonrent and Mahindra Reva have come together to offer a very appealing car renting service. Under this plan a person can rent a Mahindra e2o electric car for a day from Carzonrent for a very reasonable Rs 800.
Story first published: Thursday, September 26, 2013, 13:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X