ముంబైలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభం

By Ravi

ఈ ఫొటోలను చూసి ఇదెక్కడో విదేశాల్లో దృశ్యమని భ్రమ పడిపోకండి.. ఎందుకంటే ఇది మన దేశంలోనిదే. ఇంత చక్కటి వరల్డ్ క్లాస్ రహదారి ఎక్కడ ఉందా అని ఆలోచిస్తున్నారా..? ఇది మన దేశ వాణిజ్య రాజధానిగా చెప్పుకునే ముంబైలో ఉంది. ఈ లింక్ రోడ్డును ఇటీవలే ప్రారంభించారు.

ఈ రోడ్డుపై ఓ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కూడా ఉంది. అంతేకాదు ఇది మనదేశంలో మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావటం విశేషం. ఈ రోడ్డును ముంబైలోని చెంబూర్ నుంచి శాంటాక్రూజ్ వరకు నిర్మించారు. గడచిన వారంలోనే ఈ రోడ్డును ప్రయాణికుల కోసం ఓపెన్ చేశారు.

భారతదేశపు మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓర్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ముంబైలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభం

ఈ లింక్ రోడ్డును నిర్మించడానికి సుమారు రూ.450 కోట్లను ఖర్చు చేశారు. తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవే మరియు పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవేల మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా మరింత వేగంగా ప్రయాణించేందుకు ఈ లింక్ రోడ్డు సహకరిసతుంది.

ముంబైలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభం

ఈ లింక్ రోడ్డు మొత్తం పొడవు 1.8 కిలోమీటర్లు. ఈ రోడ్డుపై నిర్మించిన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ హార్బర్, సెట్రల్ రైల్వే ట్రాక్‌ల మీదుగా పోతుంది. ఈ ఫ్లైఓవర్‌ను ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే, తిలక్ నగర్, అమర్ మహల్, కుర్లా వెస్ట్ అలాగే ఈస్ట్‌ల నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు.

ముంబైలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభం

మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ లింక్ రోడ్డు ఓపెనింగ్ గురించి పెద్దగా ప్రచారం జరగట్లేదు. అంతేకాదు, ముంబైలో చాలా మందికి ఈ లింక్ రోడ్డు ఓపెన్ అయిన సంగతి కూడా తెలియదు. ఈ రోడ్డుపై ఘట్కోపర్ నుంచి కుర్లా వెస్ట్ వెళ్లటానికి కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.

ముంబైలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభం

ఈ లింక్ రోడ్డు ప్రాజెక్ట్ 2006లో ప్రారంభమైంది. ఇది పూర్తి కావటానికి మొత్తం 8 ఏళ్ల సమయం పట్టింది. డబుల్ డెక్కర్ ఫ్లైఓర్‌ని నిర్మించడానికి అనుమతులు రావటంలో జాప్యం కారణంగా, ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యానికి కారణం అని చెబుతున్నారు.

ముంబైలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభం

ఈ ప్రాజెక్ట్ వలన దాదాపు 3000 లకు పైగా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వీరందరినీ వేరే ప్రాంతానికి తరలించాల్సి వచ్చింది. ఇలంటి కారణాల వలన ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం జరగటమే కాకుండా, దీనిని వ్యయం కూడా భారీగా పెరిగింది. గతంలో ఈ ప్రాజెక్టును కేవలం రూ.115 కోట్లకే పూర్తి చేయాలనుకున్నారు. అది కాస్తా రూ.450 కోట్లకు చేరుకుంది.

Most Read Articles

English summary
Mumbai dwellers can finally travel faster from Chembur to Santa Cruz thanks to the link road between them, which was opened to commuters on Friday.
Story first published: Tuesday, April 22, 2014, 12:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X