షెవర్లే కాంపాక్ట్ ఎస్‌యూవీ పేరు 'ఆడ్రా'; ఫిబ్రవరిలో ఆవిష్కరణ

జనరల్ మోటార్స్ ఇండియా వచ్చే నెలలో జరగనున్న 12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పోలో ఓ షెవర్లే కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌కు 'షెవర్లే అడ్రా' (Chevrolet Adra) అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం.

ఈ సెగ్మెంట్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్ వంటి మోడళ్లకు పోటీనిచ్చేలా షెవర్లే తమ కాంపాక్ట్ ఎస్‌యూవీని తీర్చిదిద్దనుంది. జనరల్ మోటార్స్ నుంచి పాపులర్ అయిన స్మాల్ కార్ ప్లాట్‌ఫామ్‌ 'గమ్మా 2'ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త షెవర్లే కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇదే ప్లాట్‌ఫామ్‌పై షెవర్లే బీట్, ఏవియో, ట్రాక్స్ వంటి మోడళ్లను తయారు చేస్తున్నారు.

Chevrolet Adra Compact SUV

గ్లోబల్ మార్కెట్లలో ప్రస్తుతం షెవర్లే నుంచి లభిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ట్రాక్స్ మాత్రమే. వాస్తవానికి తొలుత షెవర్లే ట్రాక్‌ను ఇండియాకు తీసుకురావచ్చని యోచించినప్పటికీ, ఇది పొడవులో నాలుగు మీటర్ల కన్నా ఎక్కువగా ఉండటంతో, దీని కన్నా కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇండయాకు పరిచయం చేయటం ద్వారా భారత సర్కారు ఆఫర్ చేస్తున్న ఎక్సైజ్ రాయితీలను పొందాలని కంపెనీ యోచిస్తోంది.

జనరల్ మోటార్స్ ఆవిష్కరించనున్న షెవర్లే ఆడ్రా కాంపాక్ట్ ఎస్‌యూవీలో 1.3 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 77 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజన్‌ను షెవర్లే సెయిల్ సెడాన్ మరియు షెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివిలలో ఉపయోగిస్తున్నారు. షెవర్లే ఆడ్రా ఉత్పత్తి దశకు చేరుకునేందుకు మరో ఏడాది సమయం పట్టే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
The Ford EcoSport compact SUV competitor from Chevrolet that was previously reported to debut in India as a concept car at the Auto Expo 2014 now has a name. The Chevy compact SUV concept will reportedly be called Adra. Chevrolet Adra compact SUV is expected to be based on General Motors' small vehicle platform, Gamma 2 that's also used by the Trax SUV.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X