షెవర్లే క్రూజ్ సెడాన్‌ను మరోసారి అప్‌డేట్ చేసిన జనరల్ మోటార్స్

By Ravi

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ దేశీయ విపణిలో అందస్తున్న పవర్‌ఫుల్ సెడాన్ 'షెవర్లే క్రూజ్' (Chevrolet Cruze)ను కంపెనీ స్వల్పంగా అప్‌గ్రేడ్ చేసింది. కొత్త 2014 వెర్షన్ షెవర్లే క్రూజ్ ఇప్పుడు టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్‌తో పాటుగా మెరుగైన మైలేజీనిచ్చేలా దీని ఇంజన్‌కు కూడా ట్యూన్ చేశారు.

షెవర్లే క్రూజ్ అమ్మకాలను మరింత పెంచుకునేందుకు గాను ఈ మార్పులు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ రెండు మార్పులు మినహా కొత్త క్రూజ్ సెడాన్‌లో వేరే ఏ ఇతర మార్పులు లేవు. కొత్త షెవర్లే క్రూజ్ మూడు వేరియంట్లలో (ఎల్‌టి, ఎల్‌టిజెడ్ మ్యాన్యువల్ మరియు ఎల్‌టిజెడ్ ఆటోమేటిక్) లభిస్తుంది. వీటి ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

Chevrolet Cruze
  • షెవర్లే క్రూజ్ ఎల్‌టి - రూ.13.7 లక్షలు
  • షెవర్లే క్రూజ్ ఎల్‌టిజెడ్ మ్యాన్యువల్ - రూ.15.19 లక్షలు
  • షెవర్లే క్రూజ్ ఎల్‌టిజెడ్ ఆటోమేటిక్ - రూ.16.19 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

షెవర్లే క్రూజ్ సెడాన్‌లో 2.0 లీటర్, 4-సిలిండర్, విసిడిఐ 16వి ఎస్ఓహెచ్‌సి డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3800 ఆర్‌పిఎమ్ వద్ద 165 బిహెచ్‌పిల శక్తిని మరియు 2000 ఆర్‌పిఎమ్ వద్ద 380 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తుంది.

Most Read Articles

English summary
Chevrolet Cruze has received its second update within 6 months. The latest update adds turn indicator lamps on the outside rear view mirrors. Furthermore, the automatic variant is now said have been made more fuel efficient.
Story first published: Tuesday, March 25, 2014, 11:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X