భారత్‌లో ఎంజాయ్ ఎమ్‌పివి ఉత్పత్తిని ప్రారంభించిన చెవర్లే

చెవర్లే సెయిల్ హ్యాచ్‌బ్యాక్, సెడాన్ వెర్షన్లను విజయవంతంగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన అమెరికన్ కార్ కంపెనీ జనరల్ మోటార్స్, ఇప్పుడు తాజాగా మరొక ఉత్పత్తిని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. గడచిన సంవత్సరం జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పో కంపెనీ ప్రదర్శించిన చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివిని కంపెనీ తాజాగా మార్కెట్లో చేయబోతుంది. గతకొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న ఈ ఎమ్‌పివి అతి త్వరలోనే మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే ఈ ఎమ్‌పివి ఉత్పత్తిని జనరల్ మోటార్స్ గుజరాత్‌లోని తమ హలోల్ ప్లాంటులో ప్రారంభించింది.

జనరల్ మోటార్స్ తొలుత పెట్రోల్ వెర్షన్ ఎంజాయ్ ఎమ్‌పివి మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో 94.6 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇక డీజిల్ వెర్షన్ ఎంజాయ్ ఎమ్‌పివి విషయానికి వస్తే ఇందులో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్ (మారుతి ఎర్టిగా డీజిల్ వెర్షన్‌లో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగించారు)ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఫిక్స్డ్-జియోమెట్రీ టర్బోఛార్జర్ (ఎఫ్‌జిటి)ను ఉపయోగించుకొని, రియర్ వీల్ డ్రైవ్‌తో లభ్యం కావచ్చని తెలుస్తోంది.

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివిని జనరల్ మోటార్స్ చైనా భాగస్వామి షాంగై ఆటోమోటివ్ ఇండస్ట్రీ కంపెనీ (ఎస్ఏఐసి)తో కలిసి అమెరికా ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్‌ అభివృద్ధి చేసింది. ఇది ఈ సెగ్మెంట్లోని టొయోటా ఇన్నోవా, మారుతి సుజుకి ఎర్టిగా, మహీంద్రా జైలో, నిస్సాన్ ఇవాలియా వంటి ఎమ్‌పివిలకు పోటీగా నిలువనుంది.

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

Most Read Articles

English summary
General Motors India has started the regular production of the its much awaited Chevrolet Enjoy MPV at Halol plant in Gujarat. Chevrolet Enjoy MPV is slated for launch in the first quarter of this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X