త్వరలో విడుదల: అప్‌గ్రేడెడ్ రెనో ఫ్లూయెన్స్ ప్రీమియం సెడాన్

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ప్రీమియం సెడాన్ ఫ్లూయెన్స్‌లో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను కంపెనీ మార్కెట్లో విడుదల చేయనుంది. రెనో ఇండియా తొలిసారిగా తమ ఫ్లూయెన్స్ సెడాన్‌ను దేశీయ విపణిలో విడుదల చేయటం ద్వారా భారత మార్కెట్లో ప్రవేశించింది. భారత మార్కెట్లో దీని ధర అధికంగా ఉండటంతో ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగలేదు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న రెనో ఫ్లూయెన్స్ కన్నా డిజైన్, ఫీచర్స్ పరంగా మరింత మెరుగ్గా ఉండేలా అభివృద్ధి చేసిన సరికొత్త 2013 రెనో ఫ్లూయెన్స్ ప్రీమియం సెడాన్‌ ఈ ఏడాది మార్కెట్లో విడుదల కానుంది.

గడచిన సంవత్సరం టర్కీలో 2012 మాస్కో మోటార్ షోలో రెనో తమ సరికొత్త 2013 ఫ్లూయెన్స్ సెడాన్‌ను ఆవిష్కరించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్ 2013 - జూన్ 2013) ఈ కొత్త కారు భారత మార్కెట్లోకి రావచ్చని అంచనా. మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా, రెనో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి తమ కొత్త ఫ్లూయెన్స్‌ను అభివృద్ధి చేసింది. సరికొత్త ఫ్రంట్ లుక్, ప్రీమియం ఇంటీరియర్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, అల్లాయ్ వీల్స్, టచ్‌స్క్రీన్ మల్టీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్


కొత్త 2013 రెనో ఫ్లూయెన్స్ సెడాన్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. డీజిల్ వెర్షన్ రెనో ఫ్లూయెన్స్‌లో అమర్చిన 1461సీసీ డీజిల్ ఇంజన్‌ గరిష్టంగా 110 పిఎస్‌ల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 20.4 కి.మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుంది. అలాగే, పెట్రోల్ వెర్షన్ రెనో ఫ్లూయెన్స్‌లో అమర్చిన 1997సీసీ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 137 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 13.4 కి.మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుంది. కాగా.. ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న రెనో ఫ్లూయెన్స్ సెడాన్ మూడు వేరియంట్లలో (రెండు పెట్రోల్, ఒక డీజిల్) లభిస్తోంది.

Most Read Articles

English summary
French auto major Renault has updated its premium sedan Fluence to boost the sales. Company has recently unveiled this 2013 Renault Fluence premium sedan at Turky Motor Show. It is Expected to launch in India in the first quarter of the next fiscal.
Story first published: Saturday, January 12, 2013, 18:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X