ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో అప్‌గ్రేడెడ్ డస్టర్ విడుదల

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరగనున్న 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ డస్టర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ గడచిన నెలలో ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడే ఇదే విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న రెనో డస్టర్‌ను 2010లో జరిగిన జెనీవా మోటార్ షోలో కంపెనీ ఆవిష్కరించింది.

దీని విశిష్టమైన డిజైన్ కారణంగా ఇది అశేష ప్రజాదరణను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇది రెనో నుంచి ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న మోడల్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో డస్టర్ సక్సెస్‌ను పరిగణలోకి తీసుకొని ఇందులో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది. కంపెనీ ఇప్పటికే ఈ పనిలో ఉంది. 2014 వెర్షన్ రెనో/డాసియా డస్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ప్రదర్శించనున్నారు.

ఈ కొత్త రెనో డస్టర్ భారత మార్కెట్లో కూడా విడలయ్యే అవకాశం ఉంది. మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

రెనో డస్టర్ ఫేస్‌లిఫ్ట్

రెనో డస్టర్ ఫేస్‌లిఫ్ట్

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వంటి కొత్త మోడళ్ల రాకతో పోటీ పెరగడంతో, డస్టర్‌ను మరింత రిచ్‌గా తీర్చిదిద్దేందుకు ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ డస్టర్‌ను రానున్న నెలల్లో కంపెనీ విడుదల చేయనుంది.

2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో

2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో

కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రెనో డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరగనున్న 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ఆవిష్కరించనున్నారు.

డి-క్రాస్ కాన్సెప్ట్

డి-క్రాస్ కాన్సెప్ట్

రెనో గతంలో ఆవిష్కరించిన డస్టర్ డి-క్రాస్ కాన్సెప్ట్‌లోని కొన్ని డిజైన్ ఫీచర్లను కొత్త డస్టర్ ఫేస్‌లిఫ్ట్‌లో గమనించే ఆస్కారం ఉంది.

డిజైన్ మార్పులు

డిజైన్ మార్పులు

కొత్త డస్టర్‌లో డిజైన్ పరంగా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే ఆస్కారం ఉంది.

ఇంటీరియర్ మార్పులు

ఇంటీరియర్ మార్పులు

ఇంటీరియర్లలో కూడా మార్పులు ఉండనున్నాయి. సరికొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్, టచ్ స్క్రీన్ డిస్‌ప్లే వంటి బెటర్ ఎలక్ట్రానిక్స్, మంచి నాణ్యత కలిగిన అప్‌హోలెస్ట్రీ వంటి మార్పులను ఈ కొత్త డస్టర్‌లో జోడించనున్నట్లు తెలుస్తోంది.

Most Read Articles

English summary
Despite its success the compact SUV has gone on without any change for long enough and if has to remain competitive in the face of new launches from rivals such as the Ford EcoSport, a generation jump is necessary. Renault knows this and hence, the 2014 Duster has been prepped.
Story first published: Tuesday, July 23, 2013, 14:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X