పరిమిత సంఖ్యలో డాసియా డస్టర్ పికప్ మోడల్ విడుదల

By Ravi

ఇప్పటి వరకు ఎస్‌యూవీ రూపంలో మాత్రమే లభిస్తున్న డస్టర్ తాజాగా పికప్ అవతారమెత్తింది. ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో భారత మార్కెట్లో విక్రయిస్తున్న డస్టర్‌ను యూరోపియన్ మార్కెట్లలో డాసియా బ్రాండ్ క్రింద విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. డాసియా తమ డస్టర్‌ను పికప్ ట్రక్కుగా మార్చి లిమిటెడ్ ప్రొడక్షన్ మోడల్‌గా విక్రయిస్తోంది.

ఓఎమ్‌వి పెట్రోమ్ (బల్క్ ఆర్డర్‌ను ఇచ్చే కస్టమర్) నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు డాసియా డస్టర్ పికప్ మోడల్‌ను తయారు చేశారు. కేవలం 500 యూనిట్ల డాసియా డస్టర్ వాహనాలను మాత్రమే తయారు చేయనున్నారు. ఈ లాట్‌లో ఇప్పటికే తొలి మోడళ్లను ఉదాహరణగా సదరు కస్టమర్‌కు డెలివరీ కూడా చేశారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

డాసియా డస్టర్ పికప్

తర్వాతి స్లైడ్‌లలో డస్టర్ పికప్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.

డాసియా డస్టర్ పికప్

రెగ్యులర్ డస్టర్‌ను పికప్‌గా మార్చే ప్రక్రియను డాసియా స్వతహాగా చేపట్టడం లేదు. ఇందు కోసం డాసియా ప్రముఖ కోచ్‌బిల్డర్ రోమ్‌ట్యూరింగియాను ఆశ్రయించింది.

డాసియా డస్టర్ పికప్

డాసియా తమ డస్టర్ వాహనాలను రోమ్‌ట్యూరింగియాకు డెలివరీ చేస్తే, రోమ్‌ట్యూరింగియా వాటిని పికప్ వాహనాలుగా మార్చి, ఫైనల్ ప్రోడక్ట్‌ను కస్టమర్లకు పంపిణీ చేస్తుంది.

డాసియా డస్టర్ పికప్

ఈ డాసియా డస్టర్ పికప్ మోడల్‌ను 1.5 లీటర్ డిసిఐ, 110 పిఎస్ ఇంజన్, ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేస్తున్నారు.

డాసియా డస్టర్ పికప్

సౌత్ ఈస్టర్న్ యూరప్‌లో అతిపెద్ద చమురు కంపెనీ అయిన ఓవిఎమ్ పెట్రోమ్, మారు ప్రాంతాలకు చేరుకునేందుకు వీలుగా ఫ్లాట్‌బెడ్‌తో కూడిన ఆఫ్‌రోడింగ్ వాహనాలను ఆఫర్ చేయాల్సిందిగా డాసియాను కోరింది.

డాసియా డస్టర్ పికప్

డస్టర్ డ్రైవర్ క్యాబిన్ వరకు వేరు చేసి, వెనుక భాగాన్ని ఫ్లాట్‌బెడ్‌గా మార్చి ఈ పికప్‌ను తయారు చేశారు. ఈ ఫ్లాట్‌బెడ్ పొడవు 1.7 మీటర్లు. దీనిపై 450 కేజీల బరువును మోసుకెళ్లవచ్చు.

Most Read Articles

English summary
Romanian car brand Dacia has offered a pickup and now the brand is back on the bed-gifted vehicle market with the Duster Pick-Up.
Story first published: Wednesday, October 8, 2014, 11:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X