డాట్సన్ గో ప్లస్ ఈ ఏడాది రావట్లేదు; 2015లో విడుదల

నిస్సాన్‌కు చెందిన డాట్సన్ బ్రాండ్ నుంచి ఈ ఏడాది మార్కెట్లో విడుదల కావలసి ఉన్న రెండవ ఉత్పత్తి 'గో ప్లస్' (Go+) ఎమ్‌పివి విడుదల వాయిదా పడింది. వాస్తవానికి ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిని విడుదల చేస్తామని గతంలో నిస్సాన్ ఇండియా ప్రకటించినప్పటికీ, కంపెనీలో చోటు చేసుకున్న యాజమాన్య మార్పుల కారణంగా, దీని విడుదల వచ్చే ఏడాదికి వాయిదా పడింది.

వచ్చే ఏడాది ప్రథమార్థంలో డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిని భారత మార్కెట్లో విడుదల చేస్తామని నిస్సాన్ ఇండియాకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు గుయ్‌లామ్ సికర్డ్ ప్రకటించారు. డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన 'గో ప్లస్' ఎమ్‌పివిని గడచిన ఫిబ్రవరి నెలలో గ్రేటర్ నోయిడాలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో నిస్సాన్ ఇండియా తొలిసారిగా ఆవిష్కరించింది.

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవును కలిగి ఉంటుంది. గో హ్యాచ్‌బ్యాక్ వీల్‌బేస్, గో ప్లస్ ఎమ్‌పివి వీల్‌బేస్ రెండు ఒకేలా ఉంటాయి (2450 మి.మీ.). ఉత్పత్తి వ్యయాన్ని భారీగా తగ్గించుకొని, సరసమైన ధరకే గో ప్లస్ ఎమ్‌పివిని అందించాలనే ఉద్దేశ్యంతో డాట్సన్ తమ ఎమ్‌పివి కోసం హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను యధావిధిగా ఉపయోగించి దీనిని తయారు చేస్తున్నారు.

డాట్సన్ గో ప్లస్ ఒక సెవన్ సీటర్ ఎమ్‌పివి, దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

డాట్సన్ గో ప్లస్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివికి సంబంధించిన మరిన్ని సాంకేతిక, ఇతర వివరాలను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

కాంపాక్ట్ ఎమ్‌పివి

కాంపాక్ట్ ఎమ్‌పివి

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి మొత్తం 3995 మి.మీ. పొడవును, 1635 మి.మీ. వెడల్పును, 1485 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. ఇదొక సబ్-ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎమ్‌పివి. ఎక్సైజ్ రాయితీలను పొందుతుంది.

ఇంజన్ ఆప్షన్స్

ఇంజన్ ఆప్షన్స్

ఇంజన్ విషయానికి వస్తే.. డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్, నిస్సాన్ మైక్రా కార్లలో ఉపయోగిస్తున్న అదే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలోను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. డీజిల్ ఇంజన్ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

డాట్సన్ గో ప్లస్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి కూడా గో హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే 'మొబైల్ డాకింగ్ స్టేషన్'తో లభిస్తుంది. ఈ ఫొటోలో గో ప్లస్ ఎమ్‌పివి ఇంటీరియర్ లుక్‌ని చూడొచ్చు.

డాట్సన్ గో ప్లస్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి 7 సీటర్ ఆప్షన్ (2+3+2) (డ్రైవర్‌తో కలిపి)ను కలిగి ఉంటుంది. ముందు వరుస అలాగే మధ్య వరుసలో కూర్చునే ప్రయాణికులకు విశాలమైన లెగ్‌‌రూమ్ ఉంటుంది.

డాట్సన్ గో ప్లస్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలో కూడా హ్యాచ్‌బ్యాక్ వెర్షన్ మాదిరిగానే సెంటర్ కన్సోల్ ఉండదు. గేర్ బాక్సును డ్యాష్‌బోర్డుకే జతచేయబడి ఉంటుంది.

డాట్సన్ గో ప్లస్

డాట్సన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకునేందుకు గో హ్యాచ్‌బ్యాక్ కారును పెద్దగా మార్పు చేయకుండా, వెనుక వైపు మాత్రమే కాస్తంత స్థలాన్ని పెంచి ఈ ఎమ్‌పివి రూపొందించింది. అందుకే వెనుక డోరు కూడా చిన్నదిగా అనిపిస్తుంది. ఇంత పెద్ద ఎమ్‌పివి అంత చిన్న డోర్ కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది.

డాట్సన్ గో ప్లస్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి వెనుక రెండు వరుసలలోని సీట్లను పూర్తిగా ముందుకు మడచి, లగేజ్ రూమ్‌ను పెంచుకోవచ్చు.

డాట్సన్ గో ప్లస్

మూడవ వరుసలోని సీట్లు పొట్టిగా ఉండే వారికి లేదా చిన్న పిల్లకు మాత్రమే సరిపోయేలా ఉంటాయి. పొడవుగా ఉన్నవారు కానీ లేదా కొంచెం లావుగా ఉన్న వారు కానీ ఇందులో సౌకర్యంగా కూర్చోలేరు.

డాట్సన్ గో ప్లస్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Most Read Articles

English summary
Japanese auto major Nissan will drive in its second model from the Datsun portfolio, a multi- purpose vehicle Go+, in the first part of next year in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X