గో ప్లస్ ఎమ్‌పివి స్పెసిఫికేషన్స్‌‌ను వెల్లడి చేసిన డాట్సన్!

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్, ఇటీవల పునఃప్రవేశపెట్టిన తమ పురాతన కార్ బ్రాండ్ డాట్సన్ క్రింద తక్కువ ధర కలిగిన ఎంట్రీ లెవల్ కార్లను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, డాట్సన్ బ్రాండ్ కంపెనీ ఇప్పటికే ఇండియాలో గో హ్యాచ్‌బ్యాక్‌ను అలాగే ఇండోనేషియాలో గో ప్లస్ ఎమ్‌పివిలను ఆవిష్కరించింది.

ఈ రెండు ఉత్పత్తుల్లో తొలుత భారత మార్కెట్లో డాట్సన్ గో విడుదల కానుంటే, ఇండోనేషియన్ మార్కెట్లో డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి విడుదల కానుంది. ఇవి రెండూ వచ్చే ఏడాది ఆరంభం నాటికి విడుదల కావచ్చని సమాచారం. కాగా.. తొలుత ఇండోనేషియాలో విడుదల కానున్న డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివికి సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ తాజాగా విడుదల చేసింది.

ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి..!

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి స్పెసిఫికేషన్స్‌‌

ఇండోనేషియన్ మార్కెట్లో విడుదల కానున్న డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలో 1.2 లీటర్, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. (ఇది నిస్సాన్ మైక్రాలో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌కు రీట్యూన్డ్ వెర్షన్). డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ కారులో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగించే ఆస్కారం ఉంది.

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి స్పెసిఫికేషన్స్‌‌

డాట్సన్ గో ప్లస్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 68 పిఎస్‌ల శక్తిని, 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్‌ను కూడా కంపెనీ విడుదల చేసే అవకాశం ఉంది.

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి స్పెసిఫికేషన్స్‌‌

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి మైలేజ్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, దీని లైట్ వెయిట్ నిర్మాణం కారణంగా ఇది మెరుగైన మైలేజీని ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది. దీని మొత్తం బరువు 794 కేజీలు మాత్రమే. ఇది మారుతి సుజుకి ఎర్టిగా బరువు కన్నా 386 కేజీలు తేలికైనది.

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి స్పెసిఫికేషన్స్‌‌

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి ఉత్పత్తి ఖర్చును తక్కువగా ఉంచేందుకు గాను ఇందులో 13 ఇంచ్ చక్రాలను మాత్రమే ఉపయోగించారు. ఇవి 155/70 టైర్లతో కవర్ చేయబడి ఉంటాయి.

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి స్పెసిఫికేషన్స్‌‌

డాట్సన్ గో ప్లస్ ఓ కాంపాక్ట్ ఎమ్‌పివి. అంటే, ఇది 7 సీటింగ్ (2+3+2) కెపాసిటీని ఆఫర్ చేస్తున్నప్పటికీ, పొడవులో మాత్రం నాలుగు మీటర్ల కన్నా తక్కువగానే ఉంటుదన్నమాట. దీన్నిబట్టి చూస్తే, ఇందులో ఇంటీరియర్స్‌ చాలా ఇరుకుగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి స్పెసిఫికేషన్స్‌‌

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి 3995 మి.మీ పొడవును, 1635 మి.మీ వెడల్పును 1485 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్ బేస్ 2450 మి.మీలుగా ఉంటుంది.

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి స్పెసిఫికేషన్స్‌‌

డాట్సన్ గో ప్లస్ రెడ్డిష్ గోల్డ్, వైట్ సాలిడ్, సిల్వర్ మెటాలిక్, గ్రే మెటాలిక్, బ్లాక్ సాలిడ్ అనే ఐదు రంగులలో లభ్యం కానుంది. దీని ధర సుమారు రూ.5 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Most Read Articles

English summary
Nissa's budget brand Datsun is scheduled to make its arrival in India in early 2014, but the we already have the very first details about the Datsun GO+, the compact MPV, emerging from the Indonesian market. Here are some specifications about the Indonesian spec GO+ as per the brochure.
Story first published: Tuesday, December 3, 2013, 12:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X