చెన్నై రోడ్లపై డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి టెస్టింగ్..

By Ravi

నిస్సాన్‌కు చెందిన డాట్సన్ బ్రాండ్ క్రింద మరో కొత్త మోడల్ గో ప్లస్ ఎమ్‌పివి త్వరలోనే మార్కెట్లో విడుదల కానున్న సంగతి తెలిసినదే. డాట్సన్ ఇప్పటికే తమ గో ప్లస్ ఎమ్‌పివిని ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. ఈ కారును తమిళనాడులోని రెనో-నిస్సాన్ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో, డాట్సన్ గో ప్లస్‌ను చెన్నై రోడ్లపై టెస్టింగ్ చేస్తుండగా ఆ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన 'డాట్సన్ గో+' (గో ప్లస్ అని పలకాలి) ఎమ్‌పివిని గడచిన ఫిబ్రవరి నెలలో గ్రేటర్ నోయిడాలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ తొలిసారిగా ఆవిష్కరించింది. డాట్సన్ ఇప్పటికే ఈ మోడల్‌ను ఇండోనేషియా మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎమ్‌పివిని దీపావళి నాటికి మార్కెట్లో అందుబాటులోకి తీసుకువస్తామని నిస్సాన్ గతంలో తెలిపింది.

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవును కలిగి ఉంటుంది. గో హ్యాచ్‌బ్యాక్ వీల్‌బేస్, గో ప్లస్ ఎమ్‌పివి వీల్‌బేస్ రెండు ఒకేలా ఉంటాయి (2450 మి.మీ.). ఉత్పత్తి వ్యయాన్ని భారీగా తగ్గించుకొని, సరసమైన ధరకే వీటిని అందించాలనే ఉద్దేశ్యంతో డాట్సన్ తమ ఎమ్‌పివి కోసం హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను యధావిధిగా ఉపయోగించి దీనిని తయారు చేస్తున్నారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి టెస్టింగ్

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్, నిస్సాన్ మైక్రా కార్లలో ఉపయోగిస్తున్న అదే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలోను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో డీజిల్ వెర్షన్ కూడా అందుబాటులో ఉండనుంది. నిస్సాన్ మైక్రాలో ఉపయోగిస్తున్న డీజిల్ ఇంజన్‌నే ఇందులోను ఉపయోగించే ఆస్కారం ఉంది.

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి టెస్టింగ్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి 7 సీటర్ ఆప్షన్ (2+3+2) (డ్రైవర్‌తో కలిపి)ను కలిగి ఉంటుంది. ముందు వరుస అలాగే మధ్య వరుసలో కూర్చునే ప్రయాణికులకు విశాలమైన లెగ్‌‌రూమ్ ఉంటుంది. డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలో కూడా హ్యాచ్‌బ్యాక్ వెర్షన్ మాదిరిగానే సెంటర్ కన్సోల్ ఉండదు. గేర్ బాక్సును డ్యాష్‌బోర్డుకే జతచేయబడి ఉండటం వలన ముందు వరుసలో మంచి స్పేస్ లభిస్తుంది.

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి టెస్టింగ్

డాట్సన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకునేందుకు గాను గో హ్యాచ్‌బ్యాక్ కారును పెద్దగా మార్పు చేయకుండా, వెనుక వైపు మాత్రమే కాస్తంత పొడవును పెంచి ఈ ఎమ్‌పివి రూపొందించింది. అందుకే వెనుక డోరు కూడా చిన్నదిగా అనిపిస్తుంది. ఇంత పెద్ద ఎమ్‌పివికి అంత చిన్న డోర్ ఉండటం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది.

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి టెస్టింగ్

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి వెనుక రెండు వరుసలలోని సీట్లను పూర్తిగా ముందుకు మడచి, లగేజ్ రూమ్‌ను పెంచుకోవచ్చు. మూడవ వరుసలోని సీట్లు పొట్టిగా ఉండే వారికి లేదా చిన్న పిల్లకు మాత్రమే సరిపోయేలా ఉంటాయి. పొడవుగా ఉన్నవారు లేదా కొంచెం లావుగా ఉన్న వారు ఇందులో సౌకర్యంగా కూర్చోలేకపోవచ్చు.

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి టెస్టింగ్

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి కూడా 'మొబైల్ డాకింగ్ స్టేషన్'తో లభ్యం కానుంది. దీని సాయంతో మీ స్మార్ట్‌ఫోన్‌ను ఇన్ఫోటైన్‌మెంట్ ఎక్విప్‌మెంట్‌గా మార్చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Datsun has unvieled Go plus MPV at Auto Expo 2014. Now Datsun has started testing GO+ compact MPV in India. Here are the first spy images of Datsun Go+ testing in Chennai roads. The Datsun GO+ MPV will be launched in India by Diwali.
Story first published: Thursday, May 29, 2014, 10:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X