డాట్సన్ గో ప్లస్ కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభ్యం!

By Ravi

డాట్సన్ గో తర్వాత ఆ బ్రాండ్ నుంచి మార్కెట్లో విడుదల కావల్సిన ఉన్న రెండవ ఉత్పత్తి డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి. ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి ఈ మోడల్‌ను దేశీయ విపణిలో విడుదల చేసేందుకు నిస్సాన్ ఇండియా సన్నాహాలు చేస్తోంది. అయితే, తాజా అప్‌డేట్ ప్రకారం, గో హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే గో ప్లస్ ఎమ్‌పివి కూడా కేవలం పెట్రోల్ వెర్షన్ మాత్రమే లభ్యం కానున్నట్లు తెలుస్తోంది.

డీజిల్ వెర్షన్ డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి విషయంలో కంపెనీ వెయిట్ అండ్ వాచ్ విధానాన్ని అనుసరించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి, డీజిల్ వెర్షన్ డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి తయారీ పెట్రోల్ వెర్షన్ తయారీ కన్నా ఖర్చుతో కూడుకున్న విషయం కావటంతో, తొలుత పెట్రోల్ వెర్షన్ గో ప్లస్‌ను విడుదల చేసిన తర్వాత, ఆ మోడల్ మంచి సక్సెస్ సాధించి, డీజిల్ వెర్షన్‌కు డిమాండ్ ఏర్పడితే అప్పుడు గో ప్లస్ డీజిల్ వేరియంట్‌ను విడుదల చేయాలని నిస్సాన్ భావిస్తున్నట్లు సమాచారం.


డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన 'డాట్సన్ గో+' (గో ప్లస్ అని పలకాలి) ఎమ్‌పివిని గడచిన ఫిబ్రవరి నెలలో గ్రేటర్ నోయిడాలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ తొలిసారిగా ఆవిష్కరించింది. డాట్సన్ ఇప్పటికే ఈ మోడల్‌ను ఇండోనేషియా మార్కెట్లో విడుదల చేసింది. ఇండోనేషియాలో విడుదలైన డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి కూడా కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తోంది.

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్, నిస్సాన్ మైక్రా కార్లలో ఉపయోగిస్తున్న అదే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలోను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి 7 సీటర్ ఆప్షన్ (2+3+2) (డ్రైవర్‌తో కలిపి)ను కలిగి ఉంటుంది. ముందు వరుస అలాగే మధ్య వరుసలో కూర్చునే ప్రయాణికులకు విశాలమైన లెగ్‌‌రూమ్ ఉంటుంది.

Datsun GO Plus Rear

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలో కూడా హ్యాచ్‌బ్యాక్ వెర్షన్ మాదిరిగానే సెంటర్ కన్సోల్ ఉండదు. గేర్ బాక్సును డ్యాష్‌బోర్డుకే జతచేయబడి ఉండటం వలన ముందు వరుసలో మంచి స్పేస్ లభిస్తుంది. డాట్సన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకునేందుకు గాను గో హ్యాచ్‌బ్యాక్ కారును పెద్దగా మార్పు చేయకుండా, వెనుక వైపు మాత్రమే కాస్తంత పొడవును పెంచి ఈ ఎమ్‌పివి రూపొందించింది. అందుకే వెనుక డోరు కూడా చిన్నదిగా అనిపిస్తుంది. ఇంత పెద్ద ఎమ్‌పివికి అంత చిన్న డోర్ ఉండటం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది.

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి కూడా 'మొబైల్ డాకింగ్ స్టేషన్'తో లభ్యం కానుంది. దీని సాయంతో మీ స్మార్ట్‌ఫోన్‌ను ఇన్ఫోటైన్‌మెంట్ ఎక్విప్‌మెంట్‌గా మార్చుకోవచ్చు. డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవును కలిగి ఉంటుంది. గో హ్యాచ్‌బ్యాక్ వీల్‌బేస్, గో ప్లస్ ఎమ్‌పివి వీల్‌బేస్ రెండు ఒకేలా ఉంటాయి (2450 మి.మీ.). ఉత్పత్తి వ్యయాన్ని భారీగా తగ్గించుకొని, సరసమైన ధరకే వీటిని అందించాలనే ఉద్దేశ్యంతో డాట్సన్ తమ ఎమ్‌పివి కోసం హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను యధావిధిగా ఉపయోగించి దీనిని తయారు చేస్తున్నారు.

Most Read Articles

English summary
Datsun is expected to launch its GO+ in India during the festive season. Now there is speculation that when the vehicle launches it will be available like the hatchback only as a petrol powered vehicle. The MPV segment demands a diesel option and this could play against the success of Datsun MPV.
Story first published: Friday, June 27, 2014, 12:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X