డాట్సన్ గో కారుకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ డిటేల్స్

By Ravi

నిస్సాన్‌కు చెందిన బడ్జెట్ కార్ బ్రాండ్ 'డాట్సన్' భారత మార్కెట్లో తమ తొలి ఉత్పత్తి 'డాట్సన్ గో' హ్యాచ్‌బ్యాక్‌ను వాణిజ్య పరంగా విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది. ఇందులో భాగంగానే, డాట్సన్ గో కారు విషయంలో కొనుగోలుదారుల్లో అవగాహన కల్పించేందుకు, అలాగే తమ ప్రచార కార్యక్రమంలో భాగంగా, భారతదేశంలోని 90 నగరాల్లో డాట్సన్ గో రోడ్ షోలను నిర్వహించనుంది.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ విషయంలో కూడా ఫోర్డ్ ఇండియా ఇదే తరహా మార్కెటింగ్ స్ట్రాటజీని అనుసరించింది. అప్పట్లో మంచి సక్సెస్‌ను సాధించింది. అదే విధంగా, నిస్సాన్ మోటార్ ఇండియా కూడా ఇప్పుడు డాట్సన్ గో కారు విషయంలో ఈ రోడ్ షో మార్కెటింగ్ స్ట్రాటజీని పాటించనుంది. ఈ రోడ్ షోల ద్వారా డాట్సన్ గోను ప్రజలకు మరింత చేరువ చేయాలని కంపెనీ యోచిస్తోంది.

తొలుత ముంబై, న్యూఢిల్లీ, చెన్నైలలో ఈ రోడ్ షో నిర్వహించనున్నారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి మా డ్రైవ్‌స్పార్క్ బృందం హాజరయ్యింది. ఈ సందర్భంగా, కంపెనీ అధికారులు డాట్సన్ గో కారు, తమ బ్రాండ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆ ఎక్స్‌క్లూజివ్ వివరాలు ఏంటో ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి.

డాట్సన్ గో ఎక్స్‌క్లూజివ్ డిటేల్స్

డాట్సన్ గో కారు తయారీలో ఎక్కువ భాగం లోకలైజేషన్ కారణంగా (స్థానికంగా లభించే విడిభాగాలను ఉపయోగించడం) దీనిని తక్కువ ధరకే అందిస్తామని, విడిభాగాలు కూడా తక్కువ ధరకే లభిస్తాయని కంపెనీ అధికారులు తెలిపారు.

డాట్సన్ గో ఎక్స్‌క్లూజివ్ డిటేల్స్

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యం కానుంది. నిస్సాన్ మైక్రా, రెనో పల్స్ కార్లలో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే డాట్సన్ గో కారులోను ఉపయోగించారు (పవర్, పెర్ఫామెన్స్, మైలేజ్ వివరాలు ఇంకా వెల్లడించలేదు).

డాట్సన్ గో ఎక్స్‌క్లూజివ్ డిటేల్స్

ఈ ఇంజన్ సెగ్మెంట్లో కెల్లా మెరుగైన మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్) ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. (మైలేజ్ వివరాలు ఇంకా వెల్లడించలేదు).

డాట్సన్ గో ఎక్స్‌క్లూజివ్ డిటేల్స్

ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వెర్షన్ అందుబాటులో లేదు. ఈ గేర్‌బాక్స్‌ను డ్యాష్ బోర్డుకే జతచేయబడి ఉంటుంది. ఫలితంగా ఫ్రంట్ డ్రైవర్ సీట్, ప్యాసింజర్ సీట్లు కలుపబడినట్లు ఉంటాయి. ఎక్కువ స్పేస్ లభిస్తుంది.

డాట్సన్ గో ఎక్స్‌క్లూజివ్ డిటేల్స్

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ ఇన్‌బిల్ట్ మొబైల్ డాకింగ్ స్టేషన్‌లో లభ్యమవుతుంది. దీని సాయంతో కస్టమర్లు తమ స్మార్ట్‌‌ఫోన్లను కారుకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఓ ప్రత్యేక మొబైల్ హ్యాంగర్‌ను కూడా డ్యాష్‌బోర్డుకు అమర్చబడి ఉంటుంది. ఆక్స్-ఇన్, యూఎస్‌బి కనెక్టివిటీ ఉంటుంది.

డాట్సన్ గో ఎక్స్‌క్లూజివ్ డిటేల్స్

అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫుల్లీ లోడెడ్ డాట్సన్ గో టాప్-ఎండ్ వేరియంట్ సైతం రూ.4 లక్షల కన్నా తక్కువ ధరకే లభ్యమవుతుందని కంపెనీ పేర్కొంది. (ఎన్ని వేరియంట్లను ఆఫర్ చేసే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు).

డాట్సన్ గో ఎక్స్‌క్లూజివ్ డిటేల్స్

ధర పరంగా చూసుకుంటే, ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

డాట్సన్ గో ఎక్స్‌క్లూజివ్ డిటేల్స్

26 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగి ఉండి, మొదటిసారిగా కారు కొనుగోలు చేసే కస్టమర్లను (ఫస్ట్ టైమ్ బయ్యర్స్) లక్ష్యంగా చేసుకొని ఈ కారును అందుబాటులోకి తీసుకువస్తున్నామని డాట్సన్ తెలిపింది.

డాట్సన్ గో ఎక్స్‌క్లూజివ్ డిటేల్స్

నిస్సాన్‌ మోటార్‌ ఇండియా దేశంలోని 90కి పైగా నగరాల్లో డాట్సన్ గో రోడ్ షోలను నిర్వహించనుంది. ఈ రోడ్ షోలో ద్వారా కస్టమర్లు తమ డాట్సన్ కారును నేరుగా దగ్గర నుంచి చూసి, దాని ఫీచర్లను మరియు పనితీరును పరీక్షించిన తర్వాతనే కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

డాట్సన్ గో ఎక్స్‌క్లూజివ్ డిటేల్స్

డాట్సన్ గో రోడ్ షోలను మెట్రో నగారలతో పాటు టైర్‌-1 నగరాల్లోను, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని టైర్‌-3, టైర్‌-4 నగారల్లో నిర్వహించనున్నారు. ఈ కారును దేశంలోని ఈశాన్య ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా విడుదల చేయనున్నారు.

డాట్సన్ గో ఎక్స్‌క్లూజివ్ డిటేల్స్

ప్రారంభంలో భాగంగా, డాట్సన్ గో కార్లను, దేశంలోని నిస్సాన్ మోటార్ ఇండియా అవుట్‌లెట్ల ద్వారా విక్రయించనున్నారు. ఆ తర్వాత భవిష్యత్తులో డాట్సన్ బ్రాండ్ కోసం ప్రత్యేక అవుట్‌లెట్లను ప్రారంభించే ఆస్కారం ఉంటుంది.

Most Read Articles

English summary
Datsun have set-up a Pan-India roadshow campaign, which showcases the entry level hatchback 'GO'. Over 90 cities, will witness the new compact car at prominent locations.The Pan-India campaign will provide an opportunity to potential customers to experience the car prior launch.
Story first published: Monday, December 16, 2013, 18:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X