మార్చ్ 2014 నుంచి డాట్సన్ గో అమ్మకాలు ప్రారంభం

By Ravi

చాలా కాలం తర్వాత నిస్సాన్ బడ్జెట్ కార్ బ్రాండ్ డాట్సన్ నుంచి వస్తున్న మొట్టమొదటి స్మాల్ కార్ 'డాట్సన్ గో' హ్యాచ్‌బ్యాక్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. మార్చ్ 2014లో ఈ కారును వాణిజ్య పరంగా విడుదల చేస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వచ్చే నెలలో ఈ కారును చెన్నైలోని రెనో-నిస్సాన్ భాగస్వామ్యంలో నిర్వహించబడుతున్న ఓరగడం ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నారు.

ఫిబ్రవరి 4వ తేది నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని, మార్చ్ 2014లో వాణిజ్య పరంగా విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది. అలాగే, రానున్న నెలలో జరగనున్న 2014 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో డాట్సన్ తమ గో హ్యాచ్‌బ్యాక్ కారుతో పాటుగా మరో 3 కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. ఇందులో గో ప్లస్ ఎమ్‌పివితో పాటుగా మరో రెండు కాన్సెప్ట్ వాహనాలు ఉండనున్నాయి.

ప్రస్తుతానికి డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ కారును దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్ అవుట్‌లెట్ల ద్వారా విక్రయించనున్నారు. భవిష్యత్తులో డాట్సన్ బ్రాండ్‌ను విస్తృత స్థాయిలో విస్తరించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

Datsun Go Hatchback

నిస్సాన్ అందిస్తున్న చవక కారు మైక్రా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని డాట్సన్ గో కారును అభివృద్ధి చేశారు. మైక్రాలో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే డాట్సన్ గో కారులోను ఉపయోగించారు (పవర్, పెర్ఫామెన్స్ వివరాలు వెల్లడించలేదు). ఈ కారును పూర్తిగా భారతదేశంలోనే తయారు చేశారు. భవిష్యత్తులో మరిన్ని డాట్సన్ కార్లను కూడా ఇక్కడి మార్కెట్లో ఉత్పత్తి చేయనున్నారు. ధృడత్వం, సౌకర్యం, మైలేజ్‌తో పాటు అన్ని ముఖ్యమైన ఫీచర్లను డాట్సన్ గో కారులో జోడించారు.

డాట్సన్ గో ఒక 5-సీటర్ హ్యాచ్‌బ్యాక్. ఇందులో కేవలం మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్) మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ గేర్‌బాక్స్‌ను డ్యాష్ బోర్డుకే జతచేయబడి ఉంటుంది. ఫలితంగా ఫ్రంట్ డ్రైవర్ సీట్, ప్యాసింజర్ సీట్లు కలుపబడినట్లు ఉంటాయి. ఇది మొబైల్ డాకింగ్ స్టేషన్‌లో లభ్యమవుతుంది. కస్టమర్లు తమ స్మార్ట్‌‌ఫోన్లతో కారుకు కనెక్ట్ కావచ్చు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం డాట్సన్ గో చిన్న కారు ధర రూ.4 లక్షలకు దిగువనే ఉండనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Datsun has announced that its first car upon rebirth, the Datsun Go, would begin retailing in India from March 2014. Stay tuned to drivespark for latest updates.
Story first published: Thursday, January 16, 2014, 16:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X