రష్యా మార్కెట్ కోసం డాట్సన్ సెడాన్; పేరు 'ఆన్-డు'

By Ravi

దాదాపు 30 ఏళ్ల తర్వాత తిరిగి జీవం పోసుకున్న, నిస్సాన్‌కు చెందిన 100 ఏళ్ల పురాతన ఆటోమొబైల్ బ్రాండ్ డాట్సన్, తాజాగా మరో ఉత్పత్తిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పటికే గో హ్యాచ్‌బ్యాక్ (భారత్‌లో విడుదలైంది), గో ప్లస్ ఎమ్‌పివిలను (ఇండోనేషియాలో విడుదల కానుంది) పరిచయం చేసిన డాట్సన్, తమ మూడవ ఉత్పత్తి 'ఆన్-డు' (on-DO) సెడాన్‌ను రష్యాలో విడుదల చేయనుంది.

ఇది కూడా చదవండి: డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ప్రత్యేకించి రష్యన్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని, జపనీస్ డిఎన్‌ఏ మరియు క్వాలిటీతో పూర్తిగా జపాన్‌లో ఇంజనీరింగ్ చేయబడిన ఈ ఫ్యామిలీ సెడాన్ తొలుత రష్యాలో విడుదల కానుంది. డాట్సన్ తమ ఆన్-డు సెడాన్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని, భారత మార్కెట్ కోసం కూడా ఓ కాంపాక్ట్ సెడాన్‌ను అభివృద్ధి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

డాట్సన్ సెడాన్‌కు సంబంధించిన ఫొటోలు మరియు వివరాలను పరిశీలిద్దాం రండి..!

డాట్సన్ ఆన్-డు సెడాన్

వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన డాట్సన్ బ్రాండ్ రష్యా మార్కెట్లోకి ప్రవేశించడం ఇదే మొట్టమొదటి సారి. డాట్సన్ ఆన్-డు సెడాన్ ద్వారా రష్యన్ కస్టమర్లకు చేరువ కానున్న డాట్సన్ బ్రాండ్, అక్కడి మార్కెట్లో ఇప్పటికే పాతుకుపోయిన నిస్సాన్, ఇన్ఫినిటి బ్రాండ్ల సరసన చేరనుంది.

డాట్సన్ ఆన్-డు సెడాన్

మోటారింగ్ చరిత్రలో అతి పురాతన పేర్లలో ఒకటైన డాట్సన్, జపాన్‌లో తమ తొలి కారు డ్యాట్ (DAT)ని విడుదల చేసి సరిగ్గా వందేళ్లు గడచిన తర్వాత ఈ బ్రాండ్ రష్యాలోకి ప్రవేశించింది.

డాట్సన్ ఆన్-డు సెడాన్

డాట్సన్ మాతృ సంస్థ నిస్సాన్ మోటార్ కార్పోరేషన్ ఇప్పటికే రష్యా మార్కెట్లో, నిస్సాన్ మరియు ఇన్ఫినిటి బ్రాండ్లతో పలు సెగ్మెంట్లలో కార్లను విక్రయిస్తుండగా, డాట్సన్ బ్రాండ్ రాకతో ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లోతో అన్ని వెహికల్ సెగ్మెంట్లను కవర్ చేసినట్లయింది.

డాట్సన్ ఆన్-డు సెడాన్

ఈ సందర్భంగా నిస్సాన్ మోటార్ ప్రెసిడెంట్, సీఈఓ కార్లోస్ ఘోస్న్ మాట్లాడుతూ.. తమ కంపెనీకి రష్యా ప్రపంచంలో కెల్లా 5వ అతిపెద్ద మార్కెట్ అని, రానున్న మూడేళ్ల అమ్మకాలను మూడింతలు పెంచుకోవాలని, అలాగే మార్కెట్ వాటాను రెట్టింపు చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నామని అన్నారు.

డాట్సన్ ఆన్-డు సెడాన్

డాట్సన్ ఆన్-డు నాలుగు డోర్లు, ఐదు సీట్లతో విశాలమైన క్యాబిన్ కలిగిన ఓ పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ సెడాన్ అని కంపెనీ పేర్కొంది.

డాట్సన్ ఆన్-డు సెడాన్

డాట్సన్ ఆన్-డు సెడాన్ 4333 మి.మీ. పొడవును, 1700 వెడల్పును మరియు 1500 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. దీని బూట్ స్పేస్ సామర్థ్యం 530 లీటర్లు.

డాట్సన్ ఆన్-డు సెడాన్

డాట్సన్ ఆన్-డు సెడాన్ స్టయిలింగ్‌ను జపాన్‌లో కంపెనీ యొక్క గ్లోబల్ డిజైన్ సెంటర్‌లో పూర్తి చేశారు.

డాట్సన్ ఆన్-డు సెడాన్

ఇకపోతే దీని డెవలప్‌మెంట్ అండ్ ఇంజనీరింగ్‌ను అవ్‌టోవాజ్ ఇంజనీర్లు మరియు నిస్సాన్ ఇంజనీర్ల బృందం కలిసి రష్యాలో అభివృద్ధి చేశారు.

డాట్సన్ ఆన్-డు సెడాన్

డాట్సన్ ఆన్-డు సెడాన్‌లో 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 87 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

డాట్సన్ ఆన్-డు సెడాన్

డాట్సన్ ఆన్-డు సెడాన్‌ను 4,00,000 రౌబ్లెస్ (రష్యన్ కరెన్సీ) కన్నా తక్కువకే అందించాలని కంపెనీ యోచిస్తోంది.

డాట్సన్ ఆన్-డు సెడాన్

డాట్సన్ ఆన్-డు సెడాన్‌ను రష్యాలోని టోగ్లియట్టిలో ఉన్న అవ్‌టోవాజ్ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు.

Most Read Articles

English summary
Russian customers striving to own their first Japanese brand car got closer to that goal today with the launch of the Datsun brand and the introduction of the Datsun on-DO model. This marks the first time ever that the Datsun brand has been marketed in Russia and it heralds the debut of an automotive brand in Russia with a clear, attractive philosophy. 
Story first published: Saturday, April 5, 2014, 10:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X