స్మాల్ కార్ స్కెచ్‌లను రిలీజ్ చేసిన డాట్సన్

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్‌కు చెందిన పురాతన కార్ బ్రాండ్ 'డాట్సన్' (Datsun) ఈనెల 15న న్యూఢిల్లీలో తమ తొలి చిన్న కారును మార్కెట్లో విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, డాట్సన్ తమ తొలి కారుకు సంబంధించిన అఫీషియల్ స్కెచ్‌లను విడుదల చేసింది. అంతేకాకుండా డాట్సన్ బ్రాండ్ కోసం ఓ వెబ్‌పేజ్‌ (http://www.datsun.co.in)ను కూడా ప్రారంభించి, కౌంట్ డౌన్ టైమ్‌ను స్టార్ట్ చేసింది.

ప్రత్యేకించి భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని డాట్సన్ ఈ కారును అభివృద్ధి చేస్తోంది. జులై 15, 2013న న్యూఢిల్లీలోని కింగ్‌డమ్ ఆఫ్ డ్రీమ్స్ వద్ద నిర్వహించనున్న డాట్సన్ గ్లోబల్ ప్రీమియర్‌లో ఈ చిన్న కారును కంపెనీ అధికారికంగా ఆవిష్కరించనున్నారు. ఈ కారును ఆవిష్కరించడం ద్వారా డాట్సన్ తమ కార్ బ్రాండ్‌ను తిరిగి ప్రవేశపెట్టినట్లవుతుంది. అధిక వృద్ధితో అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్, ఇండోనేషియా, రష్యాలో డాట్సన్ చిన్న కార్లు 2014లో వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్నాయి.

అనంతరం, అదే సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో కూడా డాట్సన్ కార్లను ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా, విభిన్న మార్కెట్ల కోసం డాట్సన్ బ్రాండ్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేయనున్నారు. డాట్సన్ ఉత్పత్తులన్నింటినీ కూడా సరసమైన ధరకే ఆఫర్ చేస్తామని కంపెనీ పేర్కొంది. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, సౌకర్యవంతమైన ఫీచర్లతో ఉండేలా కొత్త కార్లను అభివృద్ధి చేస్తామని డాట్సన్ హెడ్ విన్సెంట్ కోబీ తెలిపారు. తమ ఉత్పత్తుల ప్రధానంగా మధ్యతరగతి ప్రజల కారు అవసరాలను తీర్చే విధంగా ఉంటాయని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా, డాట్సన్ కారులోని ముందు వరుసలో పాత క్లాసిక్ కార్లలో గమనించినట్లుగా, బెంచ్ సీట్లను (సెంటర్ కన్సోల్ లేకుండా పొడవుగా ఉండే సీట్ల) జోడించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. డాట్సన్ చిన్న కారుకు సంబంధించిన లేటెస్ట్ అప్‌‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

డాట్సన్ స్మాల్ కార్ స్కెచ్

డాట్సన్ తమ తొలి కారుకు సంబంధించిన అఫీషియల్ స్కెచ్‌లను నేడు విడుదల చేసింది.

డాట్సన్ స్మాల్ కార్ స్కెచ్

ఈ అఫీషియల్ స్కెచ్‌లతో పాటుగా డాట్సన్ బ్రాండ్ కోసం ఓ వెబ్‌పేజ్‌ (http://www.datsun.co.in)ను కూడా ప్రారంభించి, కౌంట్ డౌన్ టైమ్‌ను స్టార్ట్ చేసింది.

డాట్సన్ స్మాల్ కార్ స్కెచ్

అధిక వృద్ధితో అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్, ఇండోనేషియా, రష్యాలో డాట్సన్ చిన్న కార్లు 2014లో వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్నాయి. అనంతరం, అదే సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో కూడా డాట్సన్ కార్లను ప్రవేశపెట్టనున్నారు.

డాట్సన్ స్మాల్ కార్ స్కెచ్

జులై 15, 2013న న్యూఢిల్లీలోని కింగ్‌డమ్ ఆఫ్ డ్రీమ్స్ వద్ద నిర్వహించనున్న డాట్సన్ గ్లోబల్ ప్రీమియర్‌లో ఈ చిన్న కారును కంపెనీ అధికారికంగా ఆవిష్కరించనున్నారు.

క్లాసిక్ బెంచ్ సీట్లు

క్లాసిక్ బెంచ్ సీట్లు

పురాతన క్లాసిక్ కార్లలో ఉపయోగించిన బెంచ్ సీట్ల స్టయిలింగ్‌‌ను ఈ కొత్త డాట్సన్ కారులో కూడా ఉపయోగించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

నిస్సాన్ డేజ్

నిస్సాన్ డేజ్

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ అందిస్తున్న డేజ్ చిన్న కారులో కనిపించే విధంగా, ఈ డాట్సన్ కారులో కూడా డ్యాష్ బోర్డుకే గేర్ బాక్సును ఫిక్స్ చేసి ఉండొచ్చని అంచనా.

పోటీ - మారుతి ఆల్టో

పోటీ - మారుతి ఆల్టో

డాట్సన్ చిన్న కారు ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి ఆల్టో వంటి చిన్న కార్లతో పోటీ పడనుంది. ప్రస్తుతం దేశీయ విపణిలో మారుతి సుజుకి ఆల్టో ధరలు రూ.3.25 లక్షల నుంచి రూ.3.6 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.

పోటీ - హ్యుందాయ్ శాంత్రో

పోటీ - హ్యుందాయ్ శాంత్రో

డాట్సన్ చిన్న కారు ఈ సెగ్మెంట్లోని హ్యుందాయ్ శాంత్రో వంటి చిన్న కార్లతో పోటీ పడనుంది. ప్రస్తుతం దేశీయ విపణిలో శాంత్రో ధరలు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.

పోటీ - చెవర్లే స్పార్క్

పోటీ - చెవర్లే స్పార్క్

డాట్సన్ చిన్న కారు ఈ సెగ్మెంట్లోని చెవర్లే స్పార్క్ వంటి చిన్న కార్లతో పోటీ పడనుంది. ప్రస్తుతం దేశీయ విపణిలో స్పార్క్ ధరలు రూ.3.33 లక్షల నుంచి రూ.4.16 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.

Most Read Articles

English summary
Datsun today revealed sketches giving a preview of the first new generation Datsun car, which will be unveiled at a world premiere event in New Delhi, India on July 15th, 2013.
Story first published: Monday, July 1, 2013, 17:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X