2015 డెట్రాయిట్ ఆటో షో: ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి 3డి ప్రింటెడ్ కారు

ఒక కారును తయారు చేయాలంటే, అది ఎంతో శ్రమతో కూడుకున్నది. అనేక రకాల విడిభాగాలను ఒకచోటకి చేర్చి, వాటిని మనుషులు లేదా రోబోట్‌లు అసెంబ్లింగ్ చేయటం ద్వారా కార్లు తయారవుతాయి. కానీ, భవిష్యత్తులో మాత్రం కార్ల తయారీలో కొత్త వింతలు చోటు చేసుకోనున్నాయి. ఇక కార్లను తయారు చేయటం అంటే, కంప్యూటర్‌లో 'Ctrl + P' బటన్ నొక్కితే సరిపోతుంది.

అవును.. ఇకపై కార్లను 3-డి ప్రింటర్ల సాయంతో మనమే ప్రింట్ చేసుకోవచ్చు. ఇందుకు మనకు కావల్సిందల్లా ఓ కంప్యూటర్, పెద్ద 3-డి ప్రింటర్ మరియు కారు సంబంధించిన బ్లూ ప్రింట్. ఇదిగో ఈ ఫొటోలో మీరు చూస్తున్నద్ది ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి 3-డి ప్రింటెడ్ కారు. ఈ కారు పేరు 'స్ట్రాటీ' (Strati). కార్బన్ ఫైబర్ మెటీరియల్‌ను ఉపయోగించి, 3-డి ప్రింటర్ సాయంతో ఈ కారును ప్రింట్ చేశారు.

ఈ 3-డి ప్రింటెడ్ స్ట్రాటీ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకోండి..!

ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి 3డి ప్రిటెండ్ కారు

తర్వాతి స్లైడ్‌లలో ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి 3-డి ప్రింటెడ్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి..!

ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి 3డి ప్రిటెండ్ కారు

స్ట్రాటీ టూ-సీటర్ ఎలక్ట్రిక్ కారు. డెట్రాయిట్‌లో జరుగుతున్న 2015 నార్త్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఆటో షోలో లోకల్ మోటార్స్ ఈ కారును ప్రదర్శనకు ఉంచింది.

ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి 3డి ప్రిటెండ్ కారు

అమెరికాలోని అరిజోనాకు చెందిన 'లోకల్ మోటార్స్' అనే కంపెనీ ఈ కారును ప్రింట్ చేసింది. ఈ కారును ప్రింట్ చేయటానికి కేవలం 44 గంటలు మాత్రమే పట్టిందని, కేవలం 40 విడిభాగాలతో దీనిని తయారు చేశామని కంపెనీ తెలిపింది.

ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి 3డి ప్రిటెండ్ కారు

స్ట్రాటీ ఓ ఎలక్ట్రిక్ పవర్డ్ 3-డి ప్రెంటెడ్ కారు. బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో నడిచే ఈ కారు గరిష్ట వేగం గంటకు 64 కిలోమీటర్లు మాత్రమే.

ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి 3డి ప్రిటెండ్ కారు

స్ట్రాటీ కారులోని చాసిస్, బాడీ, సీట్లను త్రీడీ ప్రింటర్ సాయంతోనే ప్రింట్ చేశారు. కాగా.. ఇందులో టైర్లు, బ్యాటరీ, వైరింగ్, సస్పెన్షన్ , ఎలక్ట్రిక్ మోటార్, మిర్రర్స్ వంటి విడిభాగాలను మాత్రమే సాధారణ కార్ల కోసం ఉపయోగించే వాటినే ఉపయోగించారు.

ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి 3డి ప్రిటెండ్ కారు

లోకల్ మోటార్స్ తమ స్ట్రాటీ కారును కేవలం కాన్సెప్ట్ దశకు మాత్రమే పరిమితం చేయకుండా, పూర్తిస్థాయిలో ఉత్పత్తిని చేపట్టాలని భావిస్తోంది. ఇందుకోసం ఓ భారీ 3-డి ప్రింటెడ్ కార్ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది.

ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి 3డి ప్రిటెండ్ కారు

మరి మీకు నచ్చిందా కంప్యూటర్ ద్వారా ప్రింట్ అయిన ఈ 3-డి స్ట్రాటీ కార్..!?

Most Read Articles

English summary
A new kind of vehicle and manufacturing process will debut at the 2015 North American International Auto Show (NAIAS). Local Motors will 3D print, assemble and debut the world's first 3D-printed car - live from the show floor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X