వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఫైనల్ డిజైన్ ఆవిష్కరణ

By Ravi

అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ 'డెట్రాయిట్ ఎలక్ట్రిక్' గడచిన సంవత్సరం ఏప్రిల్ నెలలో 'ఎస్‌పి:01' (SP:01) అనే ఆల్-ఎలక్ట్రిక్, టూ-సీటర్ స్పోర్ట్స్ కారు ప్రోటోటైప్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. కంపెనీ, ఇప్పుడు ఈ కారుకు సంబంధించిన ఫైనల్ డిజైన్‌ను ఆవిష్కరించింది. తాము తయారు చేసిన 'ఎస్‌పి:01' ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంతో పరుగులు తీసే ఎలక్ట్రిక్ స్పోర్ట్ కార్ అని కంపెనీ పేర్కొంది.

గతంలో ఆవిష్కరించిన ప్రోటోటైప్‌కు, ఇప్పటి ఫైనల్ డిజైన్‌కు అనేక మార్పులు ఉన్నాయి. ఫాస్ట్‌బ్యాక్ బాడీని కలిగిన ఈ స్పోర్ట్స్ కారును కంప్యుటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (సిఎఫ్‌డి)ని ఉపయోగించి డిజైన్ చేశారు, ఇది ఎయిర్‌ఫ్లో (గాలి ప్రవాహం)ను పర్యవేక్షించి, మంచి పెర్ఫార్మెన్స్, స్టెబిలిటీని ఆఫర్ చేయటంలో సహకరిస్తుంది.


అధిక వేగం వద్ద మంచి రోడ్ గ్రిప్ కోసం డౌన్‌ఫోర్స్‌ను పెంచేందుకు గాను ఈ కారులో కొత్తగా అండర్-బాడీ డిఫ్యూజర్‌ను మరియు వెనుక వైపు స్పాయిలర్‌ను ఏర్పాటు చేశారు. కార్‌ను చల్లగా ఉంచేందుకు బానెట్‌పై ఎయిర్ ఇన్‌లెట్ మరియు అవుట్‌లెట్స్ డక్ట్స్ (వెంట్స్)ను మెరుగుపరచారు. యాక్సిడెంట్ సందర్భాల్లో కారు బ్యాటరీలు పంక్చర్ కాకుండా ఉండేందుకు కోసం ఓ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు.

డెట్రాయిట్ ఎలక్ట్రిక్ ఎస్‌పి:01 కారు గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇందులో 150 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది కారుకు మధ్య భాగంలో అమర్చబడి ఉంటుంది. ఇది కేవలం 3.7 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దాదాపు 1000 కిలోల బరువు ఉండే ఈ కారు బాడీని కార్బన్ ఫైబర్‌తో నిర్మించారు.


ఇందులో క్లచ్ ఫ్రీ 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఉంటుంది (అంటే గేరు మార్చాలనుకున్నప్పుడు క్లచ్ నొక్కాల్సిన అవసరం లేదన్నమాట). ఇంకా ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్, 2-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎస్‌పి:01 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు కేవలం 4.3 గంటల వ్యవధిలో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 290 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

డెట్రాయిట్ ఎలక్ట్రిక్ కేవలం 999 యూనిట్ల ఎస్‌పి:01 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్లను మాత్రమే తయారు చేయనుంది. డెట్రాయిట్ ఎలక్ట్రిక్ ఎస్‌పి:01 కారును యూకేలో ఉత్పత్తి చేయనున్నారు. ఈ కారును వచ్చే ఏడాది ఏషియా, ఈఎమ్ఈఏ, నార్త్ అమెరికా మార్కెట్లలో విక్రయించనున్నారు. అమెరికన్ మార్కెట్లో దీని ధర రూ.1,35,000 డాలర్లు ఉండొచ్చని అంచనా. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.80 లక్షలకు పైమాటే.

Detroit Electric

డెట్రాయిట్ ఎలక్ట్రిక్ కంపెనీ గురించి..
డెట్రాయిట్ ఎలక్ట్రిక్ 1907లోనే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయటం ప్రారంభించింది. ఆ తర్వాతి కాలంలో ఇది ఏటా 2,000 కార్లను విక్రయిస్తుండేది. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత కంపెనీ దివాళా తీసి 1939లో పూర్తిగా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. దాదాపు ఏడు దశాబ్ధాల తర్వాత డెట్రాయిట్‌లో ఏర్పాటు చేసిన తమ అధునాతన ప్లాంటులో కంపెనీ ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారును ఉత్పత్తి చేయనుంది. మరి లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా వచ్చిన ఎస్‌పి:01 సూపర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు మీకు కూడా నచ్చిందా..?

డెట్రాయిట్ ఎలక్ట్రిక్ ఎస్‌పి:01 స్పోర్ట్ కార్ టీజర్ వీడియో
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/qo2EexeXMgU?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Detroit Electric, an American based Electric Vehicle (EV) company has revealed the design for its upcoming two-seater sports car, the SP:01. The company claims that this will be the fastest electric sports car.&#13;
Story first published: Wednesday, October 29, 2014, 14:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X