బడ్జెట్‌లో ఎక్సైజ్ డ్యూటీ కట్; దిగిరానున్న వాహనాల ధరలు

By Ravi

కార్ మేకర్లకు ఇదొక తీపి కబురు. మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, కేంద్ర సర్కారు తాజాగా ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్‌ 2014-15లో వాహనాలపై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించారు. గడచిన రెండేళ్లుగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న భారత ఆటోమొబైల్ పరిశ్రమకు కాస్తంత ఊరట కలిగిస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

ఆర్థిక మంత్రి తెలిపిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు మరియు వాణిజ్య వాహనాలపై 12 శాతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 8 శాతానికి తగ్గించారు (మొత్తం 4 శాతం తగ్గింపు విధించారు). అలాగే, మిడ్-సైజ్ సెడాన్లపై సుంకాన్ని 24 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు (4 శాతం తగ్గింపు).

Excise Duties Slashed By FM

ఇకపోతే, గడచిన బడ్జెట్‌లో ఎస్‌యూవీలపై భారీగా సుంకాన్ని పెంచిన (30 శాతానికి) సంగతి తెలిసినదే. కాగా.. ప్రస్తుత బడ్జెట్‌లో ఈ సుంకాన్ని ఏకంగా 6 శాతం తగ్గించి 30 శాతం నుంచి 24 శాతానికి దిగివచ్చేలా చేశారు.

అన్ని రకాల వాహనాలపై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గిన నేపథ్యంలో, కార్ మేకర్లు ఈ ప్రయోజనాన్ని వినియోగదారులపై బదిలీ చేసినట్లయితే, టొయోటా ఇన్నోవా వంటి వాహనాలపై కస్టమర్లకు 27,000 వరకు మరియు మారుతి స్విఫ్ట్ వంటి వాహనాలపై రూ.8,500 వరకు ఆదా అవుతుంది. ఏదేమైనప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని ఆటోమొబైల్ కంపెనీలు స్వాగతించే అవకాశం ఉంది మరియు ఈ నిర్ణయం వలన కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Prices of automobiles, including cars, sports utility vehicles and two-wheelers, are set to come down with Finance Minister P Chidambaram today announcing a reduction in excise duty in the interim Budget.
Story first published: Monday, February 17, 2014, 15:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X