ప్రపంచంలో కెల్లా వేగంగా వృద్ధి చెందుతున్న కార్ కంపెనీలు

By Ravi

ఆటోమొబైల్ రంగంలో కేవలం మార్కెట్ వాటాను మాత్రమే పెంచుకుంటే పెద్దవాళ్లు అయిపోరు. అలాగని పెద్ద పెద్ద కార్లు, ఖరీదైన కార్లు తయారు చేసే కంపెనీలు కూడా పెద్దవేమీ కాదు. మనదేశపు కంపెనీ అయిన టాటా మోటార్స్ ప్రపంచంలో కెల్లా వేగంగా వృద్ధి చెందుతున్న కార్ కంపెనీల జాబితాలో స్థానం దక్కించుకుంది.

కెఎమ్‌పిజి నిర్వహించిన 14వ వార్షిక ఆటోమోటివ్ ఎగ్జిక్యూటివ్ సర్వేలో (ఏప్రిల్ నెలలో ప్రచురితమైంది) ప్రపంచంలో కెల్లా ఎవరు అగ్రగాములో, ఎవరు వేగంగా వృద్ధి చెందుతున్నారో తెలిసిపోయింది. ఈ టాప్ 10 వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కార్ కంపెనీలలో మన దేశపు కంపెనీ టాటా మోటార్స్ 10వ స్థానంలో నిలిచింది.

ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి..!

10. టాటా మోటార్స్

10. టాటా మోటార్స్

ఈ జాబితాలో భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌ది 10వ స్థానం. బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత టాటా మోటార్స్ దశ తిరిగింది. 2018 నాటికి టాటా మోటార్స్ మార్కెట్ వాటా భారీగా పెరుగుతుందని 50 శాతం మంది విశ్వసిస్తుంటే, 20 శాతం మంది మాత్రం టాటా తన మార్కెట్ వాటాను కోల్పోతుందని ఈ సర్వేలో వెల్లడించారు.

9. నిస్సాన్

9. నిస్సాన్

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ విషయంలో, 2018 నాటికి నిస్సాన్ మార్కెట్ వాటా పెరుగుతుందని 50 శాతం మంది విశ్వసిస్తుంటే, 14 శాతం మంది మాత్రం తగ్గుతుందని విశ్వసిస్తున్నారు. నిస్సాన్ వద్ద ఇన్ఫినిటీ లగ్జరీ కార్ బ్రాండ్ ఉంది.

8. గీలే ఆటోమోటివ్

8. గీలే ఆటోమోటివ్

చైనాకు చెందిన గీలే ఆటోమోటివ్ విషయంలో, ఈ బ్రాండ్ మార్కెట్ వాటా పెరుగుతుందని 51 శాతం మంది విశ్వసిస్తుంటే, 11 శాతం మంది మాత్రం తగ్గుతుందని విశ్వసిస్తున్నారు. గీలే ఆటోమోటివ్ వద్ద వోల్వో బ్రాండ్ ఉంది)

7. ఎఫ్ఏడబ్ల్యూ గ్రూప్

7. ఎఫ్ఏడబ్ల్యూ గ్రూప్

చైనాలోని పురాతన కంపెనీల్లో ఎఫ్ఏడబ్ల్యూ కూడా ఒకటి. 195లో హాంగ్ క్విలో ప్రారంభమైన ఈ కంపెనీ విషయంలో, సర్వే ప్రకారం 53 శాతం మంది ఈ బ్రాండ్ మార్కెట్ వాటా పెరుగుతుందని విశ్వసిస్తుంటే, 9 శాతం మంది మాత్రం తగ్గుతుందని విశ్వసిస్తున్నారు. వీరికి ఫోక్స్‌వ్యాగన్‌తో జాయింట్ వెంచర్ కూడా ఉంది.

6. ఎస్ఏఐసి మోటార్

6. ఎస్ఏఐసి మోటార్

చైనాలోని 4 అతిపెద్ద ఆటో కంపెనీలలో ఎస్ఏఐసి కూడా ఒకటి. ఈ కంపెనీ విషయంలో, 2018 నాటికి దీని మార్కెట్ వాటా పెరుగుతుందని 61 శాతం మంది విశ్వసిస్తుంటే, 10 శాతం మంది మాత్రం తగ్గుతుందని విశ్వసిస్తున్నారు. ఎస్ఏఐసి ఎమ్‌జి బ్రాండ్‌ను సొంతం చేసుకుంది, దీనిని అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్‌తో జాయింట్ వెంచర్ కూడా ఉంది.

5. హ్యుందాయ్

5. హ్యుందాయ్

కొరియన్ ఆటో దిగ్గజం హ్యుందాయ్ ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. 2018 నాటికి దీని మార్కెట్ వాటా పెరుగుతుందని 61 శాతం మంది విశ్వసిస్తుంటే, 14 శాతం మంది మాత్రం తగ్గుతుందని విశ్వసిస్తున్నారు. హ్యుందాయ్‌తో టైఅప్ పెట్టుకున్న కియా విషయంలో కూడా ఇదే ఫలితం వచ్చింది.

4. టొయోటా

4. టొయోటా

జపనీస్ ఆటో దిగ్గజం టొయోటా విషయంలో 2018 నాటికి దీని మార్కెట్ వాటా పెరుగుతుందని 68 శాతం మంది విశ్వసిస్తుంటే, కేలం 7 శాతం మంది మాత్రం తగ్గుతుందని విశ్వసిస్తున్నారు.

3. బిఏఐసి

3. బిఏఐసి

చైనాకు చెందిన బిఏఐసి (బీజింగ్ ఆటోమోటివ్ కంపెనీ) విషయంలో, దీని మార్కెట్ వాటా పెరుగుతుందని 70 శాతం మంది విశ్వసిస్తుంటే, కేవలం 5 శాతం మంది మాత్రం తగ్గుతుందని విశ్వసిస్తున్నారు.

2. బిఎమ్‌డబ్ల్యూ

2. బిఎమ్‌డబ్ల్యూ

ఈ జాబితాలో ద్వితీయ స్థానంలో ఉన్నది జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ. బిఎమ్‌డబ్ల్యూ విషయంలో, 2018 నాటికి మార్కెట్ వాటా పెరుగుతుందని 70 శాతం మంది భావిస్తుంటే, కేవలం 7 శాతం మంది మాత్రమే తగ్గుతుందని భావిస్తున్నారు.

1. ఫోక్స్‌వ్యాగన్

1. ఫోక్స్‌వ్యాగన్

ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న ఫోక్స్‌వ్యాగన్. ఫోక్స్‌వ్యాగన్ వద్ద ఆడి, పోర్షే వంటి పలు లగ్జరీ బ్రాండ్‌లతో స్కొడా వంటి రెగ్యులర్ బ్రాండ్లు కూడా ఉన్నాయి. ఫోక్స్‌వ్యాగన్ విషయంలో, 2018 నాటికి మార్కెట్ వాటా పెరుగుతుందని 81 శాతం మంది భావిస్తుంటే, కేవలం 3 శాతం మంది మాత్రమే తగ్గుతుందని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
What companies do the world's auto executives think will increase their market share from now until 2018? KMPG's 14th Annual Automotive Executive Survey, published in April, gives the auto industry a sense of who will lead and who will fall behind.
Story first published: Wednesday, October 23, 2013, 15:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X