లాఫెరారీ కార్లన్నీ అమ్ముడుపోయాయి; ఇక నో స్టాక్!

By Ravi

షాకింగ్ న్యూస్.. లాఫెరారీ స్టాక్ ఖాలీ అయిపోయింది.. ఇటలీకి చెందిన ప్రముఖ సూపర్‌కార్ల తయారీ కంపెనీ ఫెరారీ ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2013 జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించిన 'లాఫెరారీ' హైపర్‌కారుకు నో స్టాక్ బోర్డ్ పెట్టేశారు.

ఈ మోడల్ విషయంలో ఎక్స్‌క్లూజివిటీని మెయింటైన్ చేయటం కోసం, కేవలం 499 లాఫెరారీ కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తామని ఈ కారు విడుదల సమయంలో ఫెరారీ పేర్కొంది. ఫెరారీ ఎన్జో మోడల్‌కు సక్సెసర్‌గా వచ్చిన లాఫెరారీని సొంతం చేసుకునేందుకు కస్టమర్లు క్యూ కట్టడంతో, అన్ని కార్లు ఖాలీ అయిపోయాయి.

ఫెరారీ నుంచి లభిస్తున్న అత్యంత వేగంతమైన ఉత్పత్తి వెర్షన్ కార్లలో లాఫెరారీదే అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు, ఫెరారీ కార్లలో కెల్లా అత్యంత ఖరీదైన కారు కూడా ఇదే. దీని ధర 14 లక్షల డాలర్లు. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

లాఫెరారీ

లాఫెరారీ ఒక హైబ్రిడ్ కారు. ఇది డ్యూయెల్ పవర్ (పెట్రోల్ + బ్యాటరీ)తో పనిచేస్తుంది.

లాఫెరారీ

లాఫెరారీ హైపర్‌కారులో 6.3 లీటర్ వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9000 ఆర్‌పిఎమ్ వద్ద 800 హెచ్‌పిల గరిష్ట శక్తిని, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 700 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

లాఫెరారీ

ఇందులో అమర్చిన 120 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ 163 హెచ్‌‌పిల గరిష్ట శక్తిని, 270 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

లాఫెరారీ

పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్లు రెండు కలిసి గరిష్టంగా 963 హెచ్‌పిల శక్తిని విడుదల చేస్తాయి.

లాఫెరారీ

లాఫెరారీ హైపర్‌కారు కేవలం 3 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అలాగే 15 సెకండ్లలో 0-300 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

లాఫెరారీ

లాఫెరారీ గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

Most Read Articles

English summary
All 499 Laferrari cars have already been sold even with a $1.4 million price tag. LaFerrari is the first production hybrid car from Ferrari, combining a 789bhp 6.3-litre V12 with a 120kW electric motor, for a total output of 950bhp. It accelarates 0-100 km/h in less than 3 seconds, 0-300 km/h in 15 seconds. Top speed in excess of 350 km/h.
Story first published: Wednesday, December 11, 2013, 11:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X