ఫెరారీ తన ఎక్స్‌క్లూజివిటీని కోల్పోనుందా?

By Ravi

ఫెరారీ అంటేనే అరుదైన బ్రాండ్. రోడ్డుపై అత్యంత అరుదుగా మనకు ఈ కార్లు కనిపిస్తుంటాయి. అదే దాని ఎక్స్‌క్లూజివిటీ. ఎవరికంటే వారికి ఫెరారీ కార్లను కొనుగోలు చేయటం సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా ఫెరారీ కారును కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నా, తక్షణమే అది వారికి సొంతం కాదు. ఇందుకోసం వారు నెలలు కొన్నిసార్లయితే సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సి ఉంటుంది.

ఫెరారీ కార్లను పరిమిత సంఖ్యలో ఉత్పత్తి చేస్తారు. కొన్ని రకాల మోడళ్లనయితే, పరిమిత యూనిట్లలో మాత్రమే తయారు చేస్తారు. అలాంటి వాటిని ఎంత ముందుగా వచ్చి బుక్ చేసుకుంటే అంత ముందుగా లభిస్తుంది. ఫెరారీ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, కంపెనీ పరిమిత సంఖ్యలోనే వాటిని ఉత్పత్తి చేస్తుంటుంది. దీని వలన ఎక్కువ కాలం వేచి ఉండలేని కొందరు పటిష్ట కస్టమర్లు మనసు చంపుకొని వేరే బ్రాండ్ల వైపు మొగ్గు చూపుతుంటారు. కానీ నిజమైన ఫెరారీ అభిమానులు మాత్రం తమ వంతు కోసం ఎదురుచూస్తుంటారు.

Will Ferrari Lose Its Exclusivity

ఇలా అత్యంత అరుదుగా లభించే ఫెరారీ, ఇకపై విరివిగా లభిస్తే.. దాని ఎక్స్‌క్లూజివిటీ మాయమయ్యే ఆస్కారం ఉంటుంది. ఫెరారీ బ్రాండ్‌కు కొత్తగా చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఫియట్ క్రైస్లర్ చైర్మన్ మార్చియోన్ ఇదే పని చేయనున్నారు. ఫెరారీ ఇదివరకటి బాస్ లుకా డి మోంటెజ్‌మోలో చైర్మన్ పదవి నుంచి తప్పుకోవటంతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సెర్గియో మార్చియోన్, ఫెరారీ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని చేపట్టనున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని ఎక్కువ యూనిట్ల ఫెరారీ కార్లను ఉత్పత్తి చేస్తామని, కానీ తమ బ్రాండ్స్ ఐకానిక్ స్టేటస్ విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడబోమని మార్చియోన్ స్పష్టం చేశారు. ఫెరారీ ప్రస్తుతం సంవత్సరానికి 7,000 కార్లను ఉత్పత్తి చేస్తోంది. భవిష్యత్తులో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని 10,000 యూనిట్లకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. ఇదే గనుక జరిగితే ఫెరారీ కూడా ఇకపై ఆడి, పోర్షే వంటి బ్రాండ్ల మాదిరిగా సాధారణ లగ్జరీ బ్రాండ్ అయిపోయి, తన ఎక్స్‌క్లూజివిటీని కోల్పోగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Sergio Marchionne, the current Chairman for Fiat Chrysler, who took charge of Ferrari after Luca di Montezemolo, the long term Chairman stepped out. Sergio, has made thing clear that Ferrari will keep up to the present market demand, by making more units but will never compromise on the brands iconic status.
Story first published: Thursday, October 16, 2014, 12:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X