మరింత శక్తివంతమైన లాఫెరారీని తీసుకురానున్న ఫెరారీ

ఫెరారీ కార్లంటనే పెర్ఫామెన్స్‌కు పెట్టింది పేరు. గడచిన మార్చ్ నెలలో జరిగిన 2013 జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో ఇటలీ కార్ కంపెనీ ఫెరారీ ఆవిష్కరించిన సరికొత్త 'లాఫెరారీ' (LaFerrari) హైపర్ కారు, కంపెనీ ఆఫర్ చేస్తున్న కార్లలో కెల్లా హైపెర్ఫామెన్స్ కలిగిన కారు. అయితే, ఫెరారీ ఈ పెర్ఫామెన్స్‌తో సంతృప్తి చెందినట్లు లేదు కాబోలు, అందుకే లాఫెరారీ కన్నా మరింత శక్తివంతమైన కారును అభివృద్ధి చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

లాఫెరారీ ఛీఫ్ డిజైనర్ ఫ్లావియో మాంజోనీ ఓ ప్రముఖ ఆంగ్ల మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రస్తుతం డిజైన్ చేసిన లాఫెరారీ కన్నా మరింత శక్తివంతమైన సూపర్ ఎక్స్‌క్లూజివ్ వెర్షన్ లాఫెరారీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ పెర్ఫామెన్స్‌ను పొందడం కోసం ప్రస్తుతం 1225 కేజీలుగా ఉన్న లాఫెరారీ బరువును తగ్గించి కేవలం 100 కేజీల మాత్రమే ఉండేలా చేస్తామని ఆయన అన్నారు. దీనివలన పవర్ టూ వెయిట్ రేషియో (పిటిడబ్ల్యూ) మెరుగుపడుతుంది.

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ


ఇక ఫెరారీ లాఫెరారీ విషయానికి వస్తే, ఇదొక హైబ్రిడ్ కారు. ఇది డ్యూయెల్ పవర్ (పెట్రోల్ + బ్యాటరీ)తో పనిచేస్తుంది. ఇందులో 6.3 లీటర్ వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9000 ఆర్‌పిఎమ్ వద్ద 800 హెచ్‌పిల గరిష్ట శక్తిని, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 700 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇందులో అమర్చిన 120 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ 163 హెచ్‌‌పిల గరిష్ట శక్తిని, 270 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్లు రెండు కలిసి గరిష్టంగా 963 హెచ్‌పిల శక్తిని విడుదల చేస్తాయి.

లాఫెరారీ హైపర్‌కారు కేవలం 3 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అలాగే 15 సెకండ్లలో 0-300 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఫెరారీ కంపెనీ కేవలం 499 లాఫెరారీ కార్లను ఉత్పత్తి చేయనుంది. అయితే దీని ధరను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఇది 10 లక్షల యూరోలకు పైగా ఉండొచ్చని అంచనా. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.7 కోట్లకు పైమాటే. మరి ఈ లాఫెరారీ అందాలను తిలకిద్దాం రండి.

Most Read Articles

English summary
Apparently Ferrari is not satisfied with the LaFerrari. LaFerrari's chief designer Flavio Manzoni has told Autocar that a super exclusive version of the LaFerrari will be developed that will be more extreme than the present car.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X